హిజ్రాగా నటిస్తున్న టాప్స్టార్ | vikram to play transgender villain | Sakshi
Sakshi News home page

హిజ్రాగా నటిస్తున్న టాప్స్టార్

Published Sat, Jan 9 2016 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

హిజ్రాగా నటిస్తున్న టాప్స్టార్

హిజ్రాగా నటిస్తున్న టాప్స్టార్

సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయోగం చేయడానికైనా రెడీగా ఉండే టాప్ స్టార్ విక్రమ్. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న...

సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయోగం చేయడానికైనా రెడీగా ఉండే టాప్ స్టార్ విక్రమ్. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఐ సినిమా ఫెయిల్యూర్తో.., ఇక విక్రమ్ ప్రయోగాల జోలికి వెల్లడని భావించారు. అయితే అందరిని ఆశ్యర్యపరుస్తూ మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు చియాన్.

ఇటీవల టెన్ ఎన్రదుకుల్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్లో మరోసారి తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీలో హిజ్రాగా నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో హీరోగా కనిపిస్తుండగా విలన్ పాత్రలో హిజ్రాగా నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా అలరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement