కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు మరింత ముందుకెళుతోంది. ఆయనపై జూలై 28న అభియోగాలు నమోదు చేయనున్నట్లు మేజిస్టీరియల్ కోర్టు స్పష్టం చేసింది.
భివాండి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు మరింత ముందుకెళుతోంది. ఆయనపై జూలై 28న అభియోగాలు నమోదు చేయనున్నట్లు మేజిస్టీరియల్ కోర్టు స్పష్టం చేసింది. రాజేశ్ కుంతే అనే ఆరెస్సెస్ కార్యకర్త రాహుల్‌పై మార్చి 6, 2014న లోక్ సభ ఎన్నికల సమయంలో పరువు నష్టం కేసు పెట్టారు.
ఈ కేసుకు సంబంధించి రాహుల్‌కు గత ఏడాది నవంబర్‌లో బెయిల్ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరెస్సెస్ కార్యకర్తలే మహాత్మాగాంధీని హత్య చేసినట్లు రాహుల్ ఆరోపించారు. దీంతో ఆయనపై రాజేశ్ తమ పరువుకు భంగం కలిగించారని కేసు పెట్టి కోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణ నేడు ఉండగా రాహుల్ హాజరు కాలేదు. ఆయన తరుపున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. మున్ముందు కూడా రాహుల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ జూలై 28కి కేసు వాయిదా వేసింది.