ఢిల్లీ మహిళల భద్రత కోసం ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళల భద్రత కోసం ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నవారు ఆపద సమయంలో ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్‌ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ప్రవేశపెట్టిన మొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ ఇదని చెప్పారు. ఆడియో, వీడియోలను రికార్డు చేయడంతో పాటు ఐదుగురు సన్నిహితులకు సమాచారం అందించేందుకూ ఈ యాప్‌తో వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు.