‘భూబిల్లు’ కమిటీ గడువు పొడిగింపు! | 'Land Bill'committee deadline extension! | Sakshi
Sakshi News home page

‘భూబిల్లు’ కమిటీ గడువు పొడిగింపు!

Published Tue, Mar 15 2016 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

వివాదాస్పద భూబిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ) నివేదిక సమర్పణకు మళ్లీ గడువు పొడిగించాలని...

నేడు లోక్‌సభలో తీర్మానం
న్యూఢిల్లీ: వివాదాస్పద భూబిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ) నివేదిక సమర్పణకు మళ్లీ  గడువు పొడిగించాలని కోరే అవకాశముంది. చాలా రాష్ట్రాలు భూసేకరణ పరిహారానికి సంబంధించి సమాచారం ఇవ్వనందున వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం వరకు గడువు పొడిగించాలని కోరనుంది. కమిటీ గడువు వచ్చే బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఎస్‌ఎస్ అహ్లూవాలియా(బీజేపీ) మంగళవారం గడువు పొడిగింపు కోరుతూ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది.

దీనిపై కమిటీ సోమవారం సమావేశమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పలువురు కమిటీ సభ్యులు హాజరుకాలేదు. వానాకాల సమావేశాలు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇప్పటికే కమిటీ గడువును ఐదుసార్లు పొడిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement