ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారు | Roja Slams TDP Leaders In Prakasam District | Sakshi
Sakshi News home page

ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారు

Published Sun, Aug 12 2018 12:54 PM | Last Updated on Sun, Aug 12 2018 2:51 PM

Roja Slams TDP Leaders In Prakasam District - Sakshi

వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు

ప్రకాశం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్‌ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ కుమ్మక్కై విర్రవీగుతున్నారని మండిపడ్డారు.

మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్‌పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయని..అది తట్టుకోలేకే భారతిపై రాద్ధాంతం చేస్తున్నారని తెలియజేశారు. బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ టీడీపీ లోలోపల కుమ్మక్కు అయింది.. వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు..టీడీపీ పెడితే తీసుకున్నారు..ఇదే కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ను ఓడించండి అన్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కౌగిలించుకుంటున్నారు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం చంద్రబాబు అని తీవ్రంగా ఎద్దేవా చేశారు.

పచ్చపత్రికల అండతో టీడీపీ రెచ్చిపోతుందని, భారతిపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. బాబుకు కౌంట్‌డౌన్‌ మొదలైందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా అరెస్ట్‌ చేయలేదు..టీడీపీ నేత సుజానా చౌదరీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన దొంగ..అలాంటి వారు కూడా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement