
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 20 మంది స్టార్ క్యాంపెయినర్లను టీఆర్‌ఎస్ ఎంపిక చేసింది. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జాబితాను అందించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, 11 మంది మంత్రులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్.శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బండ ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ అధినేత రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిలు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. రెండు రోజుల కింద ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చిన జాబితాలో టి.హరీశ్‌రావు పేరు లేదు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ పేరు ఉంది. తాజాగా సోమవారం సమర్పించిన జాబితాలో సంతోష్ స్థానంలో హరీశ్‌రావు పేరు చేర్చడం గమనార్హం.
లోక్‌సభ పార్టీ బాధ్యుల మార్పు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ప్రతి సెగ్మెంట్లకు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. మంత్రులతోపాటు ఒక్కో సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా నియమించారు. నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డిని, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావులకు బాధ్యతలను అప్పగించారు.