40 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటున్నానని, తప్పుడు మాటలు వినే మనస్తత్వం తనది కాదని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్‌ఏ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.
'చెప్పుడు మాటలు వినే వాడిని కాదు '
Jul 8 2016 12:33 PM | Updated on Mar 29 2019 9:31 PM
దావణగెరె : 40 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటున్నానని, తప్పుడు మాటలు వినే మనస్తత్వం తనది కాదని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్‌ఏ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. వేరే వారి మాటలు విని తాను పార్టీలో కలహాలు సృష్టిస్తున్నానని తనపై ఇటీవల కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. అలా చెప్పుడు మాటలు వినే నైజం తనదైతే ఇంతవరకు బీజేపీలో కొనసాగి ఉండేవాడిని కాదన్నారు. ఎప్పుడో ఇతర పార్టీల్లోకి వెళ్లి అధికార యోగం అనుభవించేవాడినన్నారు.
ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించుకునే శక్తిని తనకు దేవుడు ఇచ్చాడని, జిల్లాలో పార్టీ ఉనికి, ఎదుగుదలకు అవసరమైన రీతిలో మాత్రమే తాను నడుచుకుంటానన్నారు. పార్టీలో కార్యకర్తలందరినీ గౌరవించి, అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ముందుకు న డిచే స్వభావం తనదని సమర్థించుకున్నారు. ఇటీవల జరిగిన పార్టీ పదాధికారుల ఎంపిక విషయంలో పార్టీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలందరితో చర్చించి, పదాధికారులను ఎంపిక చేయాల్సిందని, ఏకపక్షంగా పదాధికారులను ఎంపిక చేయడం వల్ల భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement