అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌ | RSS ideologue comment on BJP UP win | Sakshi

అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌

Mar 12 2017 5:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌ - Sakshi

అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ స్పందించింది.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ స్పందించింది. యూపీలో బీజేపీ భారీ విజయాన్ని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దక్కిన ప్రజామద్దతుగా భావించాలని ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో సైతం అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఈ భారీ విజయాన్ని ఇందుకు ప్రజామోదంగా భావించవచ్చునని ఆయన పీటీఐతో అన్నారు.

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం ఉండేదని, ఆ ఆలయం శకలాలు తవ్వకాల్లో బయటపడ్డాయని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొన్నదని ఆయన అన్నారు. రామమందిరం అంశాన్ని పరిష్కరించడంలో సుప్రీంకోర్టు విఫలమైనపక్షంలో మందిర నిర్మాణం కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement