Visakhapatnam Crime News
-
ఈగల సత్యానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ (సత్యం)ను ఎంవీపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్తేర్‌రాణి అనే మహిళపై దౌర్జన్యానికి దిగడంతోపాటు వేధింపులకు గురిచేసిన నేపథ్యంలో అతనిపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఎస్తేర్‌రాణి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడికి వెళ్లిన ఎంవీపీ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకొని సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో ఈగల సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అక్కడి నుంచి సత్యంను సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎస్తేర్‌రాణి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. శానిటైజర్ తాగడం వల్ల శరీరంలోని అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం ఒంటరిగా ఉంటున్న మహిళ పట్ల ఈగల సత్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలపై టీడీపీ నాయకులకు ఉన్న చిన్నచూపునకు ఈ ఘటన నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి ఎస్తేర్‌రాణిని పరామర్శించారు. వైఎస్సార్సీపీతోపాటు నగరంలోని మహిళా సంఘాలన్నీ అండగా ఉన్నాయంటూ భరోసా కల్పించారు. ఎస్తేర్‌రాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కృపజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఎస్తేర్‌రాణిపై సత్యం ఏ స్థాయిలో దౌర్జన్యానికి దిగాడనేది అర్థమవుతుందన్నారు. నిత్యం ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ, వేధిస్తూ మానసికంగా హింసించాడన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి అండతోనే సత్యం ఇంతగా బరితెగించాడంటూ దుయ్యబట్టారు. మానసికంగా, శారీరకంగా ఎస్తేర్‌రాణిని హింసించిన తీరుపై కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు బాధ కలిగించాయన్నారు. సత్యంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగుచూడకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశ వంటి చట్టాలను ఉపయోగించి సత్యంలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. కార్యక్రమంలో శిరీష, షకీనా, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శశికళ పాల్గొన్నారు. చదవండి: మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం -
గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కంచరపాలెం పోలీసుల స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరివద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ప్యాకెట్లుగా మార్చి గుట్టుగా రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఐదుగురు నిందితులు డిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు రైల్యే ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో వీరిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రవణ్ తెలిపారు. -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అనుచరుల అరాచకాలు ఆగడం లేదు. నడిరోడ్డుపై ఎమ్మెల్యే అనుచరుడు చేసిన దాష్టీకాన్ని తట్టుకోలేక ఓ మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం విశాఖలో చోటు చేసుకుంది. బాధితురాలి కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు. వివరాలు.. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతంలో ఎస్తేరు రాణి అనే మహిళ రోడ్డు పక్కన హోటల్ నడుపుతుంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు అనుచరుడు ఈగల సత్యనారాయణ అనే వ్యక్తి తరచూ సదరు బాధిత మహిళ హోటల్ వెళ్లేడమే కాకుండా.. అక్కడ హోటల్ కొనసాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని బెదిరించేవాడు. అంతేగాక తనతో సన్నిహితంగా ఉండకపోతే లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టు ఎస్తేరు రాణి పై తప్పుడు కేసు పెడతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం కూడా బాధితురాలిని తనతోనే ఉండాలని బెదిరించాడు. అంతేగాక నడి రోడ్డుపైనే ఆమెపై వచక్షణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో జరిగిన ఈ అవమానం తట్టుకోలేక సదరు బాధితురాలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే కింగ్ జార్జీఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె భావనగర్ వార్డులో చికిత్స పొందుతోంది ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలి కొడుకు నరేష్ తన తల్లిపై జరిగిన దౌర్జన్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన ఈగల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేష్ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు..
సాక్షి, విశాఖపట్నం : మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ అనే 13 సంవత్సరాల యువకుడు మొబైల్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించడంతో మొబైల్ విసిరేసిన వంశీ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో ఈ రోజు(బుధవారం) ఉదయం ముడ సర్లోవ పార్క్ ఎదురుగా మామిడి చెట్టుకు వంశీకృష్ణ ఉరిపవేసుకుని విగతా జీవిగా కనిపించాడు. (రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు) మొబైల్ ఆటలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వద్దనే మందలించడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో తన వద్ద ఉంటున్న తమ్ముడు వంశీకృష్ణ ఈ రకంగా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఆన్లైన్ గేమ్‌లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. -
దోపిడి కేసును చేధించిన విశాఖ క్రైం పోలీసులు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన పీఎం పాలెం దోపిడీ కేసును విశాఖ క్రైం పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి 12.50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా విశాఖ క్రైం డీసీసీ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టమని చెప్పారు. అరెస్టు అయిన వారంతా విశాఖకు చెందిన వారేనని, నిందితులపై గతంలో కలకత్త, పంజాగుట్ట, ఆనకాపల్లీ, శ్రీకాకుళం, గోపాలపట్నంలలో ఇలాంటి కేసులే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. పోలీసుల వివరాలు ప్రకారం... విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన కోటేశ్వర రావు కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివసించే అతడి బావ ఏటూరి చిట్టిరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో చిట్టిరాజుకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను బంగారం అవసరమైతే తక్కువ రేటుకి ఇప్పిస్తానని, అయితే అరకేజి కంటే తక్కువ బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చిట్టిరాజు, కోటేశ్వరరావును నమ్మించాడు. ఈ నేపథ్యంలో చిట్టిరాజు, కోటేశ్వర రావులను 20 లక్షల రూపాయలను తీసుకు రమ్మని వారిని చెప్పి దోపిడీ చేయాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమయ్యారు. చివరగా గత నెల ఆగస్ట్ 17న మరోసారి పిఎం పాలెం క్రికెట్ స్టేడియం దగ్గరికి 20 లక్షల రుపాయలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ డబ్బును బయటకు తీసి లెక్కబెడుతుండగా ఇన్నోవా వాహనంలో పోలీస్ సైరన్‌తో వచ్చి వారిని భయపెట్టి 20 లక్షలతో ఉడాయించాడు. ఇక జరిగిన సంఘటనపై బాధితుడు కోటేశ్వర రావు స్థానిక పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోటేశ్వరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు డీసీపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. -
ఉద్యోగం పేరుతో మోసం; కారులో ఎక్కించి..
సాక్షి, విశాఖపట్నం : ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువకుల నుంచి డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది. వివరాలు.. గాజువాకకు చెందిన అగస్త్యన్ అనే వ్యక్తి నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. అయితే ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడం.. తమ డబ్బులు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు అగస్త్యన్‌ను నిలదీశారు. అంతేగాక అతనిని ఇన్నోవా కారులో ఎక్కించి తీసుకెళ్తుండంతో తనను కిడ్నాప్ చేశారని అగస్త్యన్ పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశాఖ డైరీ వద్ద కారును పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు విచారణ చేపట్టారు. (బాధితుడితో పాటు కిడ్నాపర్లూ నేరస్తులే..) కాకినాడ సీఎస్ఐ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్క యువకుడి నుంచి 10 లక్షలు చొప్పున అగస్త్యన్ వసూలు చేసినట్లు పోలీసుల ప్రథమిక విచారణలో తేలింది. మొత్తం 50 లక్షలు పైనే వసూలు చేసినట్లు వెల్లడైంది. ఎంత కాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు అగస్త్యన్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు అన్నారు. కాకినాడ నుంచి విశాఖ వచ్చిన అగస్త్యన్‌కు కారులో వెంబడించి, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఛీటింగ్ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై గాజువాక పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా వల్ల మహిళలకే సమస్యలు:) -
బాధితుడితో పాటు కిడ్నాపర్లూ నేరస్తులే..
దొండపర్తి(విశాఖ దక్షిణం): దొండపర్తి ప్రాంతంలో డీఆర్ఎం కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపునకు పాల్పడిన ఏడుగురిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలిసున్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన, కిడ్నాప్‌కు పాల్పడిన వారందరూ పాత నేరస్తులు కావడం గమనార్హం. నేరచరిత్ర ఉన్నవారిని టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేసినా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరన్న అభిప్రాయంతో నిందితులు తెలివిగా ఈ పంథాను ఎంచుకున్నారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న డాబాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన జామి సురేష్‌ను టార్గెట్ చేసి ఈ నెల 5న డీఆర్ఎం కార్యాలయం వద్ద కిడ్నాప్ చేశారు. పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 72 గంటల్లో కేసును ఛేదించారు. మొత్తం ఏడుగురి నిందితుల్లో పల్లపు ప్రసాద్(35), పారపాతి రామ్‌రెడ్డి(55)లను అదుపులోకి తీసుకున్నట్టు నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ కిడ్నాప్ కేసు వివరాలను సీపీ ఆర్కే మీనా, డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి శుక్రవారం విలేకరుల స మావేశంలో తె లియజేశారు. ఈ నెల 5న డాబాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన జామి సురేష్‌కుమా ర్, అతని స్నేహితుడు ఎ.ఎస్.ఎన్.ఎల్.రాజుతో కలిసి తన కారులో డీఎంఆర్ కార్యాలయంలో వద్ద ఉన్నారు. అదే సమయంలో కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తుపాకులు, కత్తులతో సురేష్, రాజును బెదిరించి వారి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పరవాడ ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ ఇంట్లో బంధించారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని సురేష్‌ను కొట్టి బెదిరించారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో చివరకు రూ.30 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదీ కూడా ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టి ఇస్తానని చెప్పాడు. దీంతో కిడ్నాపర్లు మరుసటి రోజు 6న సీతంపేటలో ఉన్న ఐఐఎఫ్ఎల్ బ్యాంకు వద్దకు సురేష్‌ను తీసుకువచ్చారు. సురేష్.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తేవాలని తన భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే భర్తపై అప్పటికే అనేక కేసులు ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చి ఎందుకని ప్రశ్నించింది. తనను కొందరు కిడ్నాపర్ చేశారని చెప్పడంతో సురేష్ కుమారుడు 100కు కాల్ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న కిడ్నాపర్లు.. సురేష్‌ను అక్కడి నుంచి కారులో తీసుకుపోయారు. నగరంలో ప్రతి చోటా తనిఖీలు నిర్వహిస్తుండడంతో కిడ్నాపర్లు భయపడి సురేష్‌ను పరవాడ ప్రాంతంలోనే వదిలి పరారయ్యారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఈ కిడ్నాప్ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను వివిధ జిల్లాలకు పంపించారు. ఈ క్రమంలో సురేష్‌కుమార్ నగరంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా రైస్‌పుల్లింగ్ పేరుతో అనేక మందిని మోసం చేసిన వ్యవహారాల్లో మొత్తం 6 కేసులు ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారించగా.. అసలు విషయాలు బయటపడ్డాయి. కిడ్నాపర్లలో ఒకరు సురేష్‌కుమార్‌తో పరిచయం ఉన్నట్టు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం ఏడుగురు పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అందులో గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామానికి చెందిన పల్లపు ప్రసాద్(35) ఏ1గా, నగరంలో చినముషిడివాడకు చెందిన పారపాతి రామ్‌రెడ్డి(55) ఏ2గా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన 72 గంటల్లోనే ప్రసాద్‌ను ఒంగోల్లోను, రామ్‌రెడ్డిని నగరంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా కిడ్నాప్ పథక రచన ♦ ఏ1గా ఉన్న ప్రసాద్ కూడా రైస్‌పుల్లింగ్, దొంగ నోట్లు కేసుల్లో నిందితుడు. ♦ గతంలో కొంత మంది ప్రసాద్‌ను ఇదే తరహాలో కిడ్నాప్ చేసి తన నుంచి డబ్బులు దోచుకున్నారు. ♦ దీంతో అదే తరహాలో నేరచరిత్ర కలిగిన వారిని టార్గెట్ చేస్తే పోలీసులకు దొరికే అవకాశం ఉండదని భావించాడు. ♦ దీంతో ఏ2గా ఉన్న రామ్‌రెడ్డికి ప్లాన్‌ను వివరించాడు. ఇద్దరూ కలిసి ఎవరిని కిడ్నాప్ చేయాలన్న విషయంపై పథక రచన చేశారు. ♦ ఇంతలో గత నెల 29న రామ్‌రెడ్డి ద్వారా సురేష్‌కుమార్‌ను ప్రసాద్ నగరంలో ఒక హోటల్ కలిశాడు. దొంగ బంగారం చూపించి ఎవరినైనా మోసం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ♦ ఆ తరువాత ప్రసాద్, రామ్‌రెడ్డి ఇద్దరూ కలిసి సురేష్కుమార్నే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ♦ ఇందుకోసం ఈ నెల 2న వీరికి తెలిసిన మరో వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు చెందిన నలుగురి సహాయం తీసుకున్నారు. ♦ ఈ నెల 4న సరేష్‌ను కిడ్నాప్ చేయడానికి రెక్కీ నిర్వహించారు. ♦ 5న డీఆర్ఎం కార్యాలయం వద్ద ఉన్న సమయంలో సురేష్‌తో పాటు అతని స్నేహితుడిని సైతం కిడ్నాప్ చేశారు. ♦ సంఘటన జరిగిన 72 గంటల్లో పోలీసులు కేసును ఛేదించి ఇద్దరి అరెస్టు చేశారు. ♦ మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు. ♦ వీరు ఈ తరహా కిడ్నాప్‌లు, చేసిన మోసాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసును ఛేదించిన అధికారులకు రివార్డులు కిడ్నాప్ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు అధికారులు, సిబ్బందిని సీపీ మీనా, డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి అభినందించా రు. వారికి రివార్డులు అందజేశారు. ఫోర్త్టౌ న్ సీఐ ప్రేమ్‌కుమార్, క్రైమ్ సీఐలు అవతారం, పి.సూర్యనారాయణ, ఫోర్త్‌టౌన్ ఎస్ఐలు పి.శ్రీనివాసరావు, పి.సూర్యనారాయణ, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్ కె.రమేష్, శివకుమార్, హోంగార్డ్ రమేష్‌కు సీపీ రివార్డులు అందజేశారు. -
విశాఖ దివ్య హత్య కేసులో పురోగతి
-
కూతురిని పూడ్చి పెట్టి.. తల్లి ఆత్మాహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాలు.. పెందుర్తి పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత అనే మహిళ.. తన భర్త, 18 నెలల కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కుంటుంబ కలహాలతో కుసుమలత తన కూతురిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో చిన్నముషిరివాడ వుడా కాలనీ కొండలమీద నుంచి ఓ మహిళ కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కొండ ప్రాంతంలో పాతి పెట్టానని చెప్పింది. ఈ క్రమంలో కొండపైన పోలీసులు గాలిస్తుండగా.. ఎర్ర కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి, తండ్రి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళ ఆత్మహత్య ప్రయత్నం విఫలమవడంతో శరీరం నిండా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరు బాలికలపై బాలురు లైంగికదాడి
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన గోపాలపట్నం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సింహాచలం కొండ దిగువన పైడితల్లమ్మ ఆలయం సమీపంలో మైనర్ బాలికలైన అక్కాచెల్లెళ్లు కుటుంబంతో నివాసముంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు వీరితో స్నేహం నటించి వలలో వేసుకున్నారు. మాయ మాటలు చెప్పి నమ్మించారు. నాలుగైదు రోజుల క్రితం వీరిని సామర్లకోట తీసుకెళ్లారు. అక్కడ వీరితో సన్నిహితంగా మెలిగారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈలోగా తమ ఇద్దరమ్మాయిలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలికలు, బాలురు నర్సీపట్నంలో ఉన్నట్టు గుర్తించారు. బాలికలతో పాటు వీరిని మంగళవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు విచారణలో తేలడంతో మైనర్ బాలురను అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితులలో ఒక మైనర్ బాలుడు గతంలో ఒక కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణం
విశాఖపట్నం, నర్సీపట్నం: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని 22వ వార్డు గంగాధర్ థియేటర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రెడ్డి దేవి(35) వార్డు వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. భర్త నుంచి విడిపోయింది. ఓ టీవీ చానల్ విలేకరిగా పని చేస్తున్న పి.మురళీ(40)తో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తూ పెదబొడ్డేపల్లిలో నివాసం ఉంటు న్నారు. మురళీకి వివాహం జరిగింది. భార్య, బాబు ఉన్నారు. దేవి మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుందనే అనుమానం మురళీకి వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని మంగళవారం దేవి పుట్టింటికి వెళ్లింది. ఈలోపు మురళీ అక్కడకు చేరుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణ పడుతూనే దేవి 100 ఫోన్ చేసి, మురళీ మద్యం తాగి వచ్చి తనను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చే సమయానికి ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మురళీ ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చూసి, మృతి చెందినట్టు గుర్తించారు. ము రళీ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతురాలికి బాబు, పాప ఉన్నారు. బాబు శ్యామ్ వేములపూడి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. పాప హానీ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. వీరిద్దరికి తల్లే సంరక్షులు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ఎవరు చూస్తారంటూ పిల్లలు రోదించడంతో చూసిన వారు కన్నీటి పర్యాంతమయ్యారు. ఏఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ స్వామినాయుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీ కేసు నమోదు చేస్తున్నామని సీఐ స్వామినాయుడు తెలిపారు. -
విషాదం: ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకున్న దంపతులు
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి విహహం చేసుకున్న జంట ఆశలన్నీ కొంత కాలంలోనే ఆవిరైపోయాయి. నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాజువాక పెంటయ్యనగర్‌కు చెందిన నరేంద్రకుమార్, దిల్లేశ్వరి తల్లిదండ్రులకు తెలియకుండా గత జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. ఒంగోలులో వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఆటోనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసే నరేంద్రకుమార్ జీతం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదాలు చేటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన దంపతులు శుక్రవారం ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరిపడా ఆదాయం రావట్లేదని, భవిష్యత్తుపై బెంగతో చనిపోయినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఈ జంట తిరిగి గాజువాకలో నివసిస్తున్నట్లు వారి తల్లిదండ్రులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెప్పపాటులో ఘోరం
హుకుంపేట (అరకులోయ): రెప్పపాటులో ఘోరం జరిగింది. హుకుంపేట మండల కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో సర్వీసు జీపును ఆర్టీసీబస్సు ఢీకొట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వీరిలో హుకుంపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాంబాబు, ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. విశాఖలో జరిగే నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష కోసం హుకుంపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు జీపులో బయలుదేరారు. పాఠశాల నుంచి జీపు బయలుదేరి మెయిన్‌రోడ్డుకు రాగానే ఎదురుగా పాడేరు నుంచి అరకులోయ వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల నుంచి బయలుదేరిన రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం సంభవించడంతో పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. జీపులో ముందు సీట్లో ఉన్న డ్రైవర్ రవి, ఉపాధ్యాయుడు రాంబాబు, హాస్టల్ వర్కర్ మల్లన్న, విద్యార్థి వెంకటరావులకు బలమైన గాయాలు తగలగా, విక్రమ్, అనిల్, రమేష్, సుమన్, సింహాద్రి, నాగరాజు, ఉదయ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యసేవలు కల్పించారు. తలకు, ఇతర చోట్ల గాయాలైన ఐదుగురిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యసేవలు కల్పించారు. బాధితులకు ఎమ్మెల్యే పాల్గుణ పరామర్శ ప్రమాద సమాచారం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ హుకుంపేట మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడు, డ్రైవర్, హస్టల్ వర్కర్లను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కల్పించాలని, తీవ్రంగా గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం ప్రమాదానికి గురైన జీపును ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మండల మాజీ ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు గండేరు చినసత్యం, రమేష్, కూడా రామలింగం, కిల్లో రామకృష్ణ ఉన్నారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయ్‌కుమార్ కూడా ప్రమాదంపై స్పందించారు. ఉపాధ్యాయుడు రా>ంబాబు, విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలకు చర్యలు తీసుకున్నారు. సంఘటనపై ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన బస్, జీపులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్ యత్నం
ప్రేమ పేరుతో వల వేశాడు.. షికారుకు వెళ్దామంటూ ముద్దు ముద్దు మాటలతో మభ్యపెట్టాడు. కానీ అతని మాటల వెనుక.. ముద్దుముచ్చట్ల వెనుక చెరబట్టే కీచక పథకం ఉందన్న విషయం తెలియక గుడ్డిగా అతడిని నమ్మి కైలాసగిరిపైకి వెళ్లిన ఆమెకు ఆ కామాంధుడి విషపు ఆలోచనలు తెలిసొచ్చాయి. ఏకాంతం పేరుతో పొదల్లోకి తీసుకెళ్లి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతగాడికి ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. రాక్షసంగా తన మీద పడిన వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కేకలు వేసింది. ఆమె అదృష్టం బాగుండి ఆ కేకలు అటుగా వెళ్తున్న పికెట్ పోలీసుల చెవిన పడ్డాయి. వెంటనే వారు అక్కడికి చేరుకొని యువతిని రక్షించారు. సామూహిక లైంగిక దాడికి యత్నించిన నలుగురినీ పట్టుకొని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి యువతి మాన, ప్రాణాలను కాపాడిన పోలీసులను నగర పోలీస్ కమిషనర్ మీనా అభినందించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న యువతి(19)ని జోడుగుళ్ళపాలేనికి చెందిన డగోడుపల్లి నరేష్ (17) కొన్నాళ్ళుగా ప్రేమ పేరిట వెంటపడుతూ వస్తున్నాడు. ఓసారి సరదాగా కైలాసగిరి వెళ్దామంటూ ఎప్పటి నుంచో అడుగుతుండటంతో కాదనలేక సరే అంది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఇద్దరూ కలిసి కైలాసగిరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉందామంటూ పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళాడు. వెంట తెచ్చుకున్న మద్యం సేవించాడు. తర్వాత ఒక్కసారిగా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఇంతలో ఆమె ప్రతిఘటించడంతో దగ్గరలోనే ఉన్న ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేశాడు. మల్లె నూకరాజు (17), గలావిల్లి రమణ(23) గరికిన నూకరాజు(18).. అనే ముగ్గురు అక్కడికి వచ్చారు. నలుగురూ సామూహిక అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా వేసిన కేకలు పక్కనే పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వినపడింది. వెంటనే పోలీసులు పొదలోకి వెళ్ళి ఆ యువతిని రక్షించారు. పారిపోతున్న నలుగురు యువకులను వెంటాడి పట్టుకుని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో నరేష్ ఐటీఐ చదువుతుండగా, మల్లె నూకరాజు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. రమణ బైక్ మెకానిక్ కాగా గరికిన నూకరాజు డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిలో నరేష్, మల్లెనూకరాజు మైనర్లు కావడం గమనార్హం. నిందితులు అదుపులో ఉన్నారని, విచారణ చేస్తున్నామని, సమగ్ర వివరాలు గురువారం వెల్లడిస్తామని ఆరిలోవ సీఐ కష్ణ కిషోర్‌కుమార్ చెప్పారు. ఆరిలోవ పోలీసులు భేష్.. సీపీ ఓ యువతి మాన, ప్రాణాలను రక్షించిన ఆరిలోవ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ రంగారెడ్డి అభినందించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకుంటే మద్యం మత్తులో ఉన్న నిందితులు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉండేదన్నారు. ఇటీవల ప్రత్యేకించి కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచామని చెప్పారు. ఫలితంగానే ఓ అవాంఛనీయ ఘటనను అడ్డుకోగలిగామని అన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా విశాఖలో సాగుతున్న డ్రగ్స్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. విశాఖ టుటౌన్ పరిధిలో డాబాగార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్లో నరేంద్ర అలియాస్ విక్కీ విజయవాడ ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్కీ.. తమిళనాడులో ఆర్ఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మధురాయ్‌లో మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. గతంలో విక్కీ డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్‌లో సైతం ఉన్నాడు. ఆ సమయంలో డ్రగ్స్ సరఫరాదారుడు ఆంటోనీతో పరిచయం ఏర్పడి డ్రగ్స్ దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బెంగుళూరు, ముంబయి, గోవా నుంచి గంజాయి తీసుకుని విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిర్థారణకు వచ్చారు. అదుపులోకి తీసుకున్న మిగతా ముగ్గురిలో విక్కీ గర్ల్ ఫ్రెండ్ సీతా అలియాస్ సిరి, విశాఖకు చెందిన చింతలపూడి రాజు, వెన్నెల వెంకటరావు ఉన్నారు. నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితులను విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా ముందు హాజరు పరిచారు. -
కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో..
ఆనందపురం (భీమిలి): రోడ్డు నిర్మాణ కాంట్రాక్టరు నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిర్మాణ పనుల నిమిత్తం పాత రోడ్డుని మూసివేసి, తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. హెచ్చరిక బోర్డులు, రూటు తెలిపే సంకేతాల బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యం వహించడంతో ఏ వాహనం ఎటు వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల వల్ల ప్రమాదం సంభవించి నిండు ప్రాణం బలైంది. స్థానికంగా ఉన్న ప్లై ఓవర్ పక్కన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. తలకు హెల్మెట్ ఉన్నా లారీ చక్రాలు తలపై నుంచి వెళ్లి పోవడంతో తల నుజ్జునుజ్జయిపోయింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తర్లువాడ పంచాయతీ నగరప్పాలెం గ్రామానికి చెందిన బాయిన పైడినాయుడుకు విజయవాడకు చెందిన బిందుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పైడినాయుడు తల్లిదండ్రులు గతంలోనే మరణించారు. బోయిపాలెంలో ఉన్న మీ సేవా కేం ద్రంలో పనిచేసుకుంటూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా ఆదివారం పైడినాయుడు భార్య బిందుతో కలిసి మండలంలోని మెట్టమీదపాలెం గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మధురవాడలో మరో శుభకార్యానికి హాజరు కావాల్సి ఉండడంతో దంపతులిద్దరూ బైక్‌పై బయలుదేరి వెళ్తున్నారు. ఆనందపురం జంక్షన్లో ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పక్క నుంచి జాతీయ రహదారిని చేరుకోవడానికి తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేశారు. కాగా పైడినాయుడు దంపతులు ప్లై ఓవర్ కిందకి చేరుకోవడానికి మోటార్ బైక్‌పై వెళ్తుండగా పెందుర్తి వైపు నుంచి వస్తున్న లారీ జాతీయ రహదారిపైకి చేరుకోవడానికని డ్రైవర్ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా తాత్కాలిక రోడ్డు మలుపు వద్ద ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో బైక్‌ని లారీ ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న బిందు తూలి దూరంగా పడిపోయింది. ఈ సంఘటనలో పైడినాయుడు బురదగా ఉన్న గోతిలో పడిపోగా అతనిపై బైక్ ఉండిపోయింది. దీంతో బైక్‌తోపాటు పైడినాయుడు తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. బిందుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమై పరారైపోతున్న లారీని కొంత మంది స్థానికులు కారుతో వెంబడించి పెద్దిపాలేనికి సమీపంలో పట్టుకున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గణేష్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరిపారు. మిన్నంటిన మృతుడి భార్య రోదన కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో భార్య బిందు రోదించిన తీరు అందరినీ కలచి వేసింది. అయ్యో.. నా భర్త చనిపోయాడు.. నాకు, నా పిల్లలకు దిక్కెవరు అంటూ సంఘటనా స్థలంలోనే రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఈ లోగా సమాచారం అందుకున్న బంధువులు ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ఆమెకు సపర్యలు చేశారు. -
అతి తెలివితో స్టీల్‌ప్లాంట్ సొత్తు చోరీ
ఉక్కునగరం(గాజువాక): రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు స్టీల్‌ప్లాంట్ సొత్తు దొంగల పాలు అవుతూనే ఉంది. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినా దొంగలు విభిన్న పద్ధతుల్లో సొత్తును తరలిస్తూనే ఉన్నారు. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంకు కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్ధతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు. వాటిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో ఏకంగా శరీరానికి చుట్టుకుని రాగిని తరలిస్తుండగా శుక్రవారం ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. స్టీల్‌ప్లాంట్ కోక్ ఓవెన్ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధుల నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేయగా ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకోవడం చూసి సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. రాగి వైరు మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో ప్రాంతంలో కేబుల్ దాచి అక్కడ దాని నుంచి తీగను వేరు చేసి బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చోరీ ఎన్నాళ్ల నుంచి ఎంత మంది చేస్తున్నారు.. ఎంత మంది ఉన్నారు అన్నది సమగ్ర దర్యాప్తు చేస్తే వాటి మూలాలు బయటపడే అవకాశం ఉంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు దీనిని కేవలం ఒక దొంగతనంగా మాత్రం కాకుండా లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): అదనపు కట్న వేధింపులు తాళలేక పాతనగరం పరిధి పంజాకూడలిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... పంజా కూడలిలో నివాసం ఉంటున్న తోట శంకరరావు తన కుమార్తె శ్వేత(31)కు శంకరమఠం రోడ్డులో నివాసముంటున్న పూసర్ల కృష్ణకాంత్‌తో రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో అల్లుడికి రూ.4లక్షల నగదు, 20 తులాల బంగారం, రూ.1.5 లక్షల విలువ గల ఫర్నీచర్, మరో మూడు తులాల బంగారం శ్వేత తల్లిదండ్రులు ఇచ్చారు. అయినప్పటికీ వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్నం కోసం శ్వేత భర్త కృష్ణకాంత్‌తోపాటు అతడి తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులు వేధించసాగారు. తమకు అదనంగా రూ.20 లక్షల నగదుతోపాటు వంద గజాల స్థలం ఇవ్వాలని శ్వేతను వేధించారు. అత్తింటి వారి వేధింపులు తాళలేక శ్వేత తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గత నెల 18న కృష్ణకాంత్ తన భార్య శ్వేతకు విడాకుల నోటీసు పంపాడు. అప్పటి నుంచి మనస్తాపంతో బాధపడుతున్న శ్వేత శనివారం రాత్రి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. శ్వేత తండ్రి శంకరరావు ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహాన్ని విడదీసిన మృత్యువు
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్టణం): వారిద్దరూ స్నేహితులు. రోజూ కలిసే విధులకు వెళ్లొస్తుంటారు. వీరి స్నేహాన్ని చూసి విధికి కన్ను కుట్టునట్టుంది. విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు రూపంలో విడదీసింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాపుతుంగ్లాం చుక్కవానిపాలెంకు చెందిన నీరుజోగి కనకనాయుడు (28), స్నేహితుడు మోహన్ ఇద్దరూ ఎల్అండ్టీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ విధులు ముగించుకుని స్కూటీపై పై ఇంటికి బయటు దేరారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డు నుంచి షీలానగర్ వైపు వస్తుండగా సరిగ్గా టోల్‌గేటు సమీపిస్తుండగా వీరి స్కూటీ రోడ్డు పక్కగా ఉన్న గోతిలోకి వెళ్లింది. దీంతో కనకనాయుడు, మోహన్ ఇరువురూ తూలి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ కనకనాయుడుపై నుంచి దూసుకుపోయింది. ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ మొబైల్, బ్లూ కోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ తరలించారు. మృతుని స్వస్థలం వేపాడ మండలం సింగరయ్య గ్రామం, ఈయనకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్య పరమేశ్వరి ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. క్షతగాత్రుని వివరాలు తెలియాల్సి ఉంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలిసి తుంగ్లాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బైక్ దొంగ దొరికాడు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ వీరయ్య చౌదరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతను హీరోహోండా కంపెనీకి చెందిన వాహనాలను దొంగిలించడంలో సిద్ధహస్తుడు. 2005లో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అక్కడి కంప్యూటర్ను దొంగిలించి చేతివాటాన్ని ప్రదర్శించాడు. దీంతో ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. 2013 నుంచి దొంగతనాలకు అలవాటు పడిన వీరయ్య నగరంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ కలిపి 130 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. అధికారులు వరుస దొంగతనాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరయ్య చౌదరితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ముందు హాజరు పరిచారు. -
పెళ్ళై ఏడాది జరగకముందే..
విశాఖపట్నం, అనకాపల్లిటౌన్: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. తుమ్మపాలలోని తన ఇంట్లో సంధ్యారాణి(26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అత్తింటివారే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని సంధ్యారాణి పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. సంధ్యారాణి తండ్రి వై.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన వాయిబోయిన శ్యామ్‌కు, యలమంచిలికి చెందిన వై.సంధ్యారాణి(26)కి గత ఏడాది డిసెంబర్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సంధ్యారాణి తండ్రి నాగేశ్వరరావు రూ.ఎనిమిది లక్షల నగదు, ఒక వాహనం, సారె, తొమ్మిది తులాల బంగారం కట్నంగా ఇచ్చా రు. రూ.8 లక్షల కట్నంలో రూ.3లక్షలు పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్యామ్ తల్లిదండ్రులకు ఇచ్చారు. మిగిలిన రూ.5 లక్షలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన రూ.5 లక్షలు తీసుకురావాలని ఐదునెలల నుంచి భర్త కుటుంబ సభ్యులు సంధ్యారాణిపై వత్తిడి తెచ్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం ఉదయం సంధ్యారాణి తన తల్లి వెంకటలక్ష్మికి ఫోన్ చేసి, డిపాజిట్ సొమ్ము కోసం చెప్పగా వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో నిర్ణ యం తీసుకుందామని ఆమె కుమార్తెను సముదాయిం చింది. కానీ అప్పటికే మనస్తాపంతో ఉన్న సంధ్యారాణి మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పోలీ సులు సంధ్యారాణి అత్త సత్యవతి, ఆడపడుచు లక్ష్మితోపాటు సంధ్యారాణి భర్త శ్యామ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పెళ్ళై ఏడాది జరగకముందే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడ డం అందర్నీ కలచివేసింది. సంధ్యారాణి పుట్టిం టివారు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే
సాక్షి, విశాఖపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్యే కడతేర్చింది. మద్దిలపాలెంలో గత నెల 18న జరిగిన ఘటనలో చిక్కుముడిని పోలీసులు విప్పారు. మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసినప్పటికీ ఆర్మీ అధికారులు పోస్టుమార్టం రిపోర్టు అడగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న దల్లి సతీష్‌కుమార్ మద్దిలపాలెం పెద్దనుయ్యి ప్రాంతంలో రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. ఆయనకి 2010లో మాజీ ఆర్మీ ఉద్యోగి కూతురైన జ్యోతితో వివాహం జరిగింది. వారికి కృష్ణ ప్రవీణ్, కృష్ణ లిథిక్ అనే ఇద్దరు కుమారులున్నారు. భర్త సతీష్‌కుమార్ ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో జ్యోతి కొద్ది కాలంగా సిమ్మ భరత్(24) అనే యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ విషయం సతీష్‌కుమార్ తల్లి పార్వతి దేవికి తెలియడంతో జ్యోతిని పలుమార్లు మందలించింది. ఈ క్రమంలో జూలై 28న తన భర్త సెలవు పెట్టుకుని వస్తున్నాడని తెలుసుకున్న జ్యోతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. తనను కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారని చెప్పింది. ఇంతలో ఇంటికి వచ్చిన సతీష్‌కుమార్ తన భార్య బాగోతం తెలుసుకుని నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న వేకువజామున సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య జ్యోతి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడితో విషయం వదిలేశారు. అయితే ఆర్మీ అధికారులు పూర్తి వివరాలతో పోస్టుమార్టం నివేదిక కావాలని అడగడంతో అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. మందులో నిద్రమాత్రలు కలిపి... సెలవులకు ఇంటికి వచ్చిన భర్త తన ప్రవర్తనపై ప్రశ్నించిన విషయం భరత్‌కు జ్యోతి తెలియచేయడంతో ఇద్దరూ కలిసి సతీష్‌కుమార్‌ను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ తాగే మందులో నిద్రమాత్రలు కలిపి తరువాత చున్నీతో గొంతు నొక్కి చంపాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే ఆగస్టు 18న సతీష్ తాగే మందులో అతని భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్, భరత్ స్నేహితుడైన గొడ్ల భాస్కర్‌రావు నిద్రమాత్రలు కలిపారు. అనంతరం మత్తులోకి జారిపోయిన సతీష్‌ను చున్నీతో గొంతు నొక్కి చంపేశారు. తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ట్లు నమ్మించేందుకు అతని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి చీరతో ఫ్యానుకు వేలాడదీశారు. ఆగస్టు 19న తెల్లవారి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అత్తమామలకు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంవీపీ పోలీసులకు జ్యోతి ఫిర్యాదు చేసింది. స్థానికులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకపోవడంతో కేసును పూర్తిగా మూసేశారు. ఆగస్టు 23న పోస్ట్‌మార్టం రిపోర్టులన్నీ వివరంగా కావా లని స్థానిక పోలీసులను ఆర్మీ అధికారులు కోరా రు. దీంతో సతీష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా వచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేయడంతో సతీష్‌కుమార్‌ది ఆత్మహత్య కాద ని... హత్యేనని ఎంవీపీ పోలీసులు తేల్చారు. హత్య చేసిన రోజే మృతుడి రెండు ఉంగరాలను భరత్, భాస్కరరావులకు జ్యోతి ఇచ్చేయడంతో వారు వాటిని విక్రయించి జల్సాలు చేశారు. లభించిన సాక్ష్యాల ఆధారంగా సెప్టెంబర్ 9న జ్యోతి, భరత్, భాస్కర్‌రావును మద్దిలపాలెం బస్సు డిపో వద్ద ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో డీసీపీ – 1 రంగారెడ్డి, ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ షణ్ముఖరావు, ఎస్ఐ భాస్కర్‌రావు పాల్గొన్నారు. కేసులోని చిక్కుముడి విప్పిన అధికారులను సీపీ అభినందించారు. -
ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం
సాక్షి, ఆనందపురం (భీమిలి): మండలంలోని కుసులువాడ పంచాయతీ చిన్నయ్యపాలెం వద్ద వివాహితపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నానికి సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన యువకుడితో విజయనగరం బాబామెట్టకు చెందిన యువతికి నాలుగేళ్లు క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇటీవల భర్తతో గొడవ జరగడంతో ఆ వివాహిత విజయనగరంలోని తన కన్నవారి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆగస్టు 27న రాత్రివేళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని నర్సీపట్నంలో బస్సు ఎక్కి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు రాత్రి 11–30 గంటలు ప్రాంతంలో చేరుకుంది. అర్ధరాత్రి కావడంతో మధురువాడలోని తన స్నేహితుల ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకుంది. బస్సు కోసం నిరిక్షిస్తుండగా ఓ ఆటోవాలా వివాహిత వద్దకు వచ్చి ఎక్కడకు వెళ్లాలని అడిగాడు. ఆమె మధురవాడ వెళ్లాలని చెప్పగా అటు వైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను, ఇద్దరు పిల్లలను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో హనుమంతువాక జంక్షన్‌కు చేరుకునే సరికి మధురవాడ వైపు కాకుండా సింహాచలం రూటు వైపు మళ్లించాడు. ఆ విషయం తెలుసుకున్న వివాహిత రూటు మళ్లించిన విషయమై అడగగా ఆటోకు రికార్డులు లేవని, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయని వేరే మార్గంలో తీసుకెళ్తానని నమ్మించాడు. ఈ మేరకు ఆటోను సింహాచలం జంక్షన్, సత్రవు జంక్షన్, నీళ్లకుండీలు జంక్షన్ మీదుగా తీసుకెళ్లి కుసులువాడ పంచాయతీ, చిన్నయ్యపాలెం గ్రామ సమీపంలోని తోటలు వద్ద ఆపివేశాడు. అప్పటికే తాను మోసపోయినట్టు గ్రహించిన వివాహిత ఎదురు తిరగగా ఆటోవాలా ముగ్గురిని చంపుతానని బెదిరించాడు. ముందుగా ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను, రూ.14వేలు నగదు, ఓ పాప వద్ద ఉన్న చెవిరింగులను లాక్కున్నాడు. అనంతరం ఆమెను బలవంతంగా శారీరకంగా అనుభవించి ముగ్గురిని అక్కడే వదిలిపెట్టి ఆటోతో పరారయ్యాడు. లాక్కున్న సెల్ ఫోన్‌ను అతడు అక్కడే మరిచిపోవడంతో బాధితురాలు విజయనగరంలోని తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈ మేరకు బాధితురాలు తెలిపిన ఆనవాళ్లు మేరకు రాత్రివేళ చిన్నయ్యపాలెం వచ్చి తీసుకెళ్లారు. కాగా ముందు భయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొని మొదట ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించగా వారు కమిషనర్ కార్యాలయానికి పంపించారు. అక్కడ విచారించిన సిబ్బంది సంఘటన జరిగిన ప్రాంతం ఆనందపురం పోలీసు స్టేషన్ పరిధిలోనిదని తేల్చి బాధితురాలను పంపించారు. ఈ మేరకు ఆమె నిందితుడు ఆనవాళ్లుతోపాటు ఆటో నంబర్‌తో ఫిర్యాదు చేయగా సీఐ వై.రవి కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం
సాక్షి, రోలుగుంట(విశాఖపట్టణం) : పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఓ యవతి బావిలోకి దూకి అత్యహత్య చేసుకుంది. దీనిపై మృతురాలి తండ్రి మడ్డు రమణ సోమవారం చేసిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి.ఉమామహేశ్వరావు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంటకు చెందిన మడ్డు రమణ, సత్యవేణి దంపతుల కుమార్తె అరుణ(17) కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7వ తేదీన రోలుగుంటలో తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆ సమయంలో మేనమామాను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు...కుమార్తెను కోరారు. అయితే తాను అప్పుడే పెళ్లి చేసుకోనని ఆమె చెప్పింది. మేనమామను పెళ్లి చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టం లేదని తెలిసింది. రాత్రి తల్లిదండ్రులతోనే కలిసి భోజనం చేసి సరదాగా గడిపింది. అదే రోజు రాత్రి గణపతి విగ్రహ ఊరేగింపునకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుమార్తె కోసం తల్లిదండ్రులు గాలించారు. 8వ తేదీన కూడా బావుల వద్ద గాలించారు. కొట్టే వీధిలో గల బావిలో శవమై కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉమాహేశ్వరరావు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి, విచారణ జరిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పాత నోట్లు మార్చే ముఠా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: పాత నోట్లు ఇస్తే, ఆ మొత్తానికి మూడు రెట్లు రెట్టింపు ఇస్తామంటూ ఆశ చూపి మోసానికి పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రద్దయిన పాత నోట్లను మార్చే ఈ ముఠా సభ్యుల నుంచి 500, 1000 రూపాయల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..ఓ వాహనంలో తరలిస్తున్న కోటి 57 వేల విలువైన పాత కరెన్సీతో పాటు, 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి నకిలీ కారు నెంబర్ ప్లేట్లు, వాకీ టాకీలు, డమ్మీ తుపాకీలు, పోలీస్ పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మాట్లాడుతూ ...ఈ ముఠా సభ్యులు పాత నోట్ల కోసం డమ్మీ తుపాకీలు, వాకీ టాకీలు, పోలీస్ స్టిక్కర్లతో బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. నకిలీ, పాత నోట్ల చెలామణిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే విశాఖలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్డి సారించామని ఎస్పీ తెలిపారు. -
మృత్యు పంజా
మృత్యువు పంజా విసింది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురిని బలిగొంది. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువలకు మృతి చెందగా పిడుగు పాటుకు ఓ గిరిజన రైతు మరణించాడు. దీంతో వారికుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాంబిల్లి(యలమంచిలి): రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. బైక్ అదుపు తప్పి కొత్తూరు గ్రామం నేమ్ బోర్డు పోల్‌ను ఢీకొనడంతో కట్టుపాలెంకు చెందిన రావాడ గణేష్(38) అక్కడికక్కడే మృతిచెందగా, అదే గ్రామానికి చెందిన బొల్లం సునీల్(19) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ వి. అరుణ్‌కిరణ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. అచ్యుతాపురం నుంచి యలమంచిలి–గాజువాక రోడ్డుపై కట్టుపాలెంకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో బైక్‌పై వెనుకన కూర్చొన్న గణేష్ వంతెన పైనుంచి కింద పడి మృతిచెందాడు. బైక్ నడుపుతున్న సునీల్‌కు తలకు తీవ్ర గాయమైంది. తొలుత యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం విశాఖ పట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టుఎస్ఐ తెలిపారు. గణేష్‌కు భార్య సింహాచలం, కుమారులు సాయిగణేష్ , యశ్వంత్ ఉన్నారు. సునీల్‌కు వివాహం కాలేదు. సునీల్‌కు తండ్రి నాగేశ్వరరావు, తల్లి నాగమణి ఉన్నారు. మృతుల కుటుంబాలది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. గణేష్, సునీల్ మృతిచెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు ఇక దిక్కెవరంటూ వారు భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పిడుగుపాటుకు గిరిజన రైతు మృతి దేవరాపల్లి(దేవరాపల్లి):తామరబ్బ పంచాయతీ పల్లపుకోడాబు గ్రామంలో పిడుగుపాటుకు ఓ గిరిజన రైతు మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్లపుకోడాబు గ్రామానికి చెందిన సుకురు దేముడు(40) తన పశువుల పాకలలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు పెద్ద శబ్దంతో పిడుగు పడింది. అదే సమయంలో పాక లోపలి నుంచి బయటకు వచ్చిన సుకురు దేముడు పిడుగు ధాటికి కుప్పకూలిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తలి రించారు. అప్పటికే అతను మరణించినట్టు పీహెచ్సీ సిబ్బంది ధ్రువీకరించారు. మృతుడు దేముడికి భార్య పార్వతితో పాటు కుమార్తెలు జ్యోతి, తేజస్విని, కుమారుడు భూపతిరాజు ఉన్నారు. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న దేముడు కొద్ది క్షణాలలోనే విగతజీవిగా మారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోడంతో భార్య పార్వతితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి బంధువులు,కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకుని తామరబ్బ, చింతలపూడి పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు ఆస్పత్రికి తరలివచ్చారు. దేవరాపల్లి ఎస్ఐ పి. నర్సింహమూర్తి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. పిడుగుపాటుకు దేముడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల యువజన అధ్యక్షుడు బూరె బాబురావు, మారేపల్లి మాజీ సర్పంచ్ అవుగడ్డ కోటిపల్లినాయుడు తదితర నాయుకులు పీహెచ్‌సీకి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రాణాలు తీసిన ఈత సరదా గూడెంకొత్తవీధి(పాడేరు):ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఉపాధి నిధులతో చెరువులో తవ్విన గోతిలో మునిగి మృత్యువాత పడి, కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. చెరువులో ఈతకు దిగి, నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ లింగవరం గ్రామానికి చెందిన సాగెని చిన్నారావు (ఉపాధ్యాయుడు), వెంకటలక్ష్మి దంపతుల కొడుకు జానకీ జతిన్(9), కంకిపాటి భూషణం(రైతు), అప్పలనర్సమ్మ కుమారుడు గిరివర్ధన్ (9) సాయంత్రం వరకు తల్లిదండ్రులతో కలిసి పొలంలో పనిచేశారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో తల్లిదండ్రులకు చెప్పకుండా గ్రామ సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లారు.ఆ చెరువును ఆరు నెలల కిందట ఉపాధి హామీ పథకం నిధులతో లోతు చేశారు. ప్రమాదవశాత్తు ఆ గోతుల్లో పడి నీట మునిగి ఇద్దరూ చనిపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లల కోసం అన్వేషించారు. అనుమానం వచ్చి చెరువు వద్దకు వెళ్లి చూడగా జతిన్, గిరివర్ధన్ నీటిలో శవాలై తేలియాడుతూ కనిపించారు. పిల్లల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అంతముందు వరకు తమతో ఉన్న చిన్నారులు అంతలోనే విగతజీవులగా మారడంతో వారు గుండెలవిసేలా రోదించారు. జానకీజతిన్ చింతపల్లి సెయింటాన్స్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు ఇతనికి కార్తీక్ అనే తమ్ముడున్నాడు. గిరివర్ధన్ లింగవరం ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నాడు. ఇతనికి శివకుమార్ అనే అన్నయ్య ఉన్నాడు. వీరి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోమవారం చింతపల్లి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు జీకే వీధి సబ్ ఇన్స్పెక్టర్ అనీష్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నేతలు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జర్రెల సర్పంచ్ విజయకుమారి, కన్వీనర్ పిండి రామకృష్ణ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. -
ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!
మన్యం భయం గుప్పెట్లో చిక్కుకుంది. మావోయిస్టుల ఘాతుకానికి ఇద్దరు గిరిజనులు బలయ్యారు. ఐదేళ్ల క్రితం జరిగిన దాడిలో ఇద్దరు మావోయిస్టుల మృతికి కారకులని భావిస్తున్న వీరిని అర్ధరాత్రి వేళ వచ్చి దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటనతో మన్యం ఉలిక్కిపడింది. గిరిజనం దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. విశాఖపట్నం, చింతపల్లి (పాడేరు): మావోయిస్టులకు భయపడి ఐదేళ్లుగా ఆ గిరిజన కుటుంబాలు వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నాయి. దళ నాయకులు హతమార్చిన సంఘటనలో పాల్గొన్న వారిపై మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఎప్పటి నుంచో నిఘా పెట్టిన తమకు చిక్కకుండా జీవనం సాగిస్తున్న వారికి ఎటువంటి హానీ చేయమని సంకేతాలు పంపారు. గ్రామానికి వచ్చి స్వేచ్ఛగా జీవించాలని అభయమివ్వడంతో 3 నెలలక్రితం భాస్కరరావు కుటుంబం, వారం రోజుల క్రితం సత్తిబాబు కుటుంబం గ్రామానికి వెళ్లి జీవనం ప్రారంభించారు. అదను చూసి మావోయిస్టులు వారిద్దరిని అతి దారుణంగా హత్య చేశారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జి.మాడుగుల మండలానికి చెందిన సింహాచలం అనే వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గురువు. సంజీవరావు సింహాచలానికి శిష్యుడు. ప్రతిఏటా తులసీ మాలలు ధరించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహించేవాడు. 2014 అక్టోబర్‌లో గ్రామంలో మాలధరించిన వారందరిని మాలలు తీసి పూజలు నిర్వహించేందుకు సింహాచలం వీరవరానికి వచ్చాడు.. భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి తిరిగి వెళ్లిపోతుండగా సింహాచలంతో పాటు సంజీవరావు కూడా మావోయిస్టులు తోడ్కొని వెళ్లారు. బలపం సమీపంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు సంజీవరావును అక్కడే హతమార్చి సింహాచలంను కోరుకొండలో నిర్వహించే ప్రజాకోర్టులో హాజరు పరుస్తామని వెంట తీసుకొచ్చారు. సింహాచలాన్ని అదుపులోకి తీసుకుని సంజీవరావును చంపేశామని మావోయిస్టులు వెల్లడించారు. భక్తులు ఒక్కసారిగా ఆగ్రహోద్రులై మావో యిస్టులపై దాడికి దిగారు. వారు కాల్పులు జరిపిన లెక్కచేయకుండా ముగ్గురు మావో యిస్టులను పట్టుకుని చితకబాదారు. కర్రలు, రాళ్లతో కొట్టడంతో శరత్, గణపతి అనే ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రాంతానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు అనే మావోయిస్టు తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ నేప«థ్యంలో మావోయిస్టులు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భావించి గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు గ్రామం విడిచి వెళ్లిపోయాయి. మూడు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా భాస్కరరావు చింతపల్లిలో నివాసం ఉంటూ జీసీసీ డిపోలో తాత్కాలిక అసిస్టెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన సత్తిబాబు తమ్మంగుల పంచాయ తీ చిట్టంగరువు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వీరిని ఎలాగైనా హతమార్చాలనే పగతో రగిలిపోతున్న మావోయిస్టులు గత కొన్నేళ్లుగా సానుభూతిపరుల ద్వారా మీరు వచ్చి గ్రామంలో ప్రశాంతంగా జీవించాలని, తమ నుంచి ఎటువంటి హానీ ఉండబోదని సంకేతాలు పంపినట్లు స్థానికులు చెబుతున్నారు. సర్కారు నుంచి ఎటువంటి సాయం లేకపోవడం వల్ల కూలీ పనులు చేసుకుని జీవించడం కష్టసాధ్యంగా మారడం, మావోయిస్టులు అభయమిచ్చినట్లు సంకేతాలు పంపడంతో వ్యవసాయం చేసుకుని జీవించాలనే లక్ష్యంతో మూడు నెలల క్రితం భాస్కరరావు కుటుంబీకులు వీరవరంలో అడుగుపెట్టారు. వారం రోజుల క్రితం సత్తిబాబు కూడా గ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టాడు. మావోయిస్టులు ఊడగొట్టిన ఇళ్లలో రేకులు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరు గ్రామంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు సుమారు పది మంది బుధవారం అర్ధరాత్రి 40 మంది సానుభూతిపరులతో గ్రామానికి వెళ్లి వారిద్దరిని బయటకు పిలిచారు. భార్యలు తలుపుతీసి బయటకు వచ్చి ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించడంతో ఒక్కసారిగా మావోస్టులు లోపలకు చొరబడి సత్తిబాబు, భాస్కరరావులను బయటకు లాక్కొచ్చారు. కర్రలు, తుపాకులతో చితగ్గొట్టి హతమార్చారు. అడ్డుపడ్డ భార్యలను కూడా కర్రలతో కొట్టి గాయపరిచారు. మావోయిస్టు నేతలు శరత్, గణపతిలను హతమార్చిన సంఘటనలో భాVýæస్వాములైన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించారు. మృతి చెందిన భాస్కర్‌రావుకు ఇద్దరు భార్యలు రంభ, చిన్నమ్మిలకు కోమటి, మోహన్, పార్వతి, కుమారి, శ్రీరామ్ అనే ఐదుగురు పిల్లలున్నారు. కోమటి డిగ్రీ, మోహన్ ఇంటర్ పూర్తి చేసి ఉన్న చదువులతో దూరంగా ఉన్నారు. పార్వతి, కుమారి వంగసారలో 9వ తరగతి, శ్రీరామ్ 7వ తరగతి చదువుతున్నారు. సత్తిబాబుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. కృష్ణవేణి 4వ తరగతి, సాయి 6వ తరగతి చదువుతున్నారు. అన్నదమ్ములిద్దరూ మావోయిస్టుల చేతిలోనే హతం సంజీవరావు, భాస్కరరావు ఇద్దరు అన్నదమ్ములు. 2014లో సంజీవరావును బలపం వద్ద మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన నేప«థ్యంలో మావోయిస్టులపై గిరిజనులు దాడి చేసి హతమార్చిన సంఘటనలో భాస్కరరావు కూడా ఉన్నాడు. దీంతో అతను కూడా వారిచేతిలోనే ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎదిరించే గుండెలను నేలకూల్చా్చరు పెదవాల్తేరు(విశాఖతూర్పు): జిల్లాలోని చింతపల్లి మండలం బలపం పంచాయితీకి చెందిన గిరిజనుడు గెమ్మెలి సంజీవరావును మావోయిస్టులు అతికిరాతకంగా హతమార్చడం పట్ల ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు ప్రశ్నించే గొంతును చంపేశారు– ఎదిరించే గుండెలను నేలకూల్చారంటూ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. కోరుకొండ వద్ద మావోయిస్టులు సంజీవరావును అతికిరాతకంగా మట్టుబెట్టారని వారు వాపోయారు. మావోయిస్టుల దౌర్జన్యాలకు వీరవరం గ్రామం బలయిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. మేము పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, మీరెవరు మమ్మల్ని వెళ్ల్లగొట్టడానికి అని మావోయిస్టులను ఎదిరించిన గెమ్మెలి భాస్కరరావు, పాంగి సత్తిబాబు అమరవీరులయ్యారు. మావోయిస్టుల మాటలు లెక్క చేయకుండా గ్రామంలోనే జీవిస్తున్న నిరుపేద గిరిజన రైతులైన భాస్కరరావు, సత్తిబాబులను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోంచి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకు వెళ్లి మరీ పిల్లలు, మహిళలు చూస్తుండగానే అతికిరాతకంగా మావోయిస్టులు చంపడాన్ని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పీడిత ప్రజల కోసమే పోరాటం, వారి కోసమే మా ఆరాటం అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసే మావోయిస్టులు నిరుపేదలు, కోందు జాతికి చెందిన వెనుకబడిన అడవి బిడ్డలను అతికిరాతకంగా చంపడం హేయమైన చర్య అని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ అ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు అని తరచూ ప్రకటనలు గుప్పించే మావోయిస్టులు ప్రశ్నించే గొంతునే కోసేశారు, ఎదురించే గుండెను నేలకూల్చారని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు , గిరిజన పెద్దలు, గిరిజన సంఘాలు, ఈ హత్యలను ఖండించాలని కోరారు. బిక్కుబిక్కుమంటున్న గిరిజనం బిక్కుబిక్కుమంటూ దిగులుగా కూర్చున్న గిరిజనులు అరకులోయ: విశాఖ ఏజెన్సీ, సరిహద్దు ఒడిశా ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ నేతలు, సభ్యులు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు గిరిజనులు సహకరిస్తున్నారనే అనుమానాలతో గ్రామాలలో ప్రజా కోర్టులు, వెనువెంటనే శిక్షలు విధిస్తున్న మావోయిస్టుల చర్యలతో గిరిజనులు భీతిల్లుతున్నారు. ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒడిశా, ఏపీ పోలీసు యంత్రాంగం ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది.∙ఎన్నికలు కూడా విశాఖ ఏజెన్సీలో ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసుశాఖ ఎంతో కృషి చేసింది. మావోయిస్టుల నుంచి ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండానే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల తరువాత పోలీసు యంత్రాంగం మారుమూల ప్రాంతాలలో మావోయిస్టుల ఏరివేత చర్యలను దాదాపు నిలిపివేసిందనే ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టులు మాత్రం తమ కార్యక్రమాలను ఏవోబీలో చాపకింద నీరులా విస్తృతం చేస్తున్నారు. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టులు అధికంగా సంచరిస్తూ తరచూ గ్రామాలలో ప్రజాకోర్టులు నిర్వహించడం, పోలీసులకు సహకరిస్తున్నారనే అరోపణలతో ∙గిరిజనులను హెచ్చరించడం అవసరమైతే దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఒడిశా పోలీసు బలగాలు కూంబింగ్ చర్యలను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం మావోయిస్టుల సంచారానికి కలిసోస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసు బలగాలు కూడా అవుట్‌పోస్టులలో మకాం ఉన్నా ఏవోబీలో మావోయిస్టులు సంచరిస్తున్నారు. వారోత్సవాలకు పది రోజుల ముందే.. కొయ్యూరు(పాడేరు): మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభానికి పది రోజుల ముందు మావోయిస్టుల తమ ఉనికి చాటారు. వారిపై తిరుగుబాటు చేసిన ఇద్దరు గిరిజనులను హతమార్చారు. గడచిన పదిహేనేళ్లలో మావోల చేతిలో బలైనవారు 123 మంది. తాజాగా ఇద్దరిని హతమార్చడంతో మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల కిందట మావోయిస్టులు పెదబయలు మండలంలో బొంగజంగి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబును చంపేశారు.దీనిపై మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటన మరువక ముందే మావోయిస్టులు హింసకు పాల్పడ్డారు. సత్తిబాబును హతమార్చడంతో గ్రామస్తులు భయపడి కలెక్టర్ వినయ్‌చంద్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు.అక్కడ ఉండలేమని తెలిపారు. తాజా ఘటనతో గిరిజనులు భయపడుతున్నారు. ఏటా మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తారు. పోలీసు ఇన్ఫార్మర్లే టార్గెట్ పోలీసులు, మావోయిస్టుల భయంతో ఇప్పటికే గ్రామాల నుంచి బయటకు వెళ్లకుండా ఇళ్లకే వందల సంఖ్యలో గిరిజనులు పరిమితమయ్యారు. తమ నివాసిత మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు కూడా రాలేని పరిస్థితిలో భయం భయంగానే కొంతమంది గిరిజనులు జీవిస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు, అనుబంధ సంఘాల ప్రతినిధుల లొంగుబాటు,అరెస్ట్‌ల వ్యూహంతో పోలీసుశాఖ పనిచేస్తుండగా,మావోయిస్టు పార్టీ మాత్రం పోలీసు ఇన్పార్మర్ల వ్యవస్థను వెలికి తీస్తోంది. నిర్మానుష్యంగా కోరుకొండ చింతపల్లి: మండలంలోని బలపం పంచాయతీ కోరుకొండ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలకు పాల్పడిన సురక్షిత ప్రాంతమైన కోరుకొండ ప్రాంతానికి వెళ్లి తలదాచుకునే వారు. పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాలంటే గడగడలాడేవారు. ఎటుచూసిన మావోయిస్టుల మందుపాతరలు పోలీసు బలగాలకు స్వాగతం పలికేవి. 2014 అక్టోబర్ నుంచి పరిస్థితులు మారాయి. జి.మాడుగులకు చెందిన ఆధ్యాత్మిక గురువు సింహాచలంను అదుపులోకి తీసుకోవడంతో తిరుగుబాటు చేసిన గెమ్మెలి సంజీవరావును మావోలు హత్య చేయడం, ఆపై భక్తులు మావోలపై దాడి చేసిన ఇద్దర్ని చంపినప్పటి నుంచి మావోయిస్టులు పట్టుకోల్పోయారు. అయితే తాజా ఘటనతో ఇక్కడ నిర్మానుష్య వాతావరణం నెలకొంది. -
కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు
సాక్షి, విశాఖపట్నం : యువతిని మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసి... పెళ్లికి నిరాకరించడంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఒ.వెంకట నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పాల నటరాజు (23) నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. బాధితురాలు (20) అక్కయ్యపాలెం సమీప లక్ష్మీనారాయణపురంలో నివాసం ఉంటోంది. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక ప్రైవేటు కళాశాలలో చిరుద్యోగిగా పనిచేసేది. ఈ నేపథ్యంలో 2014 జనవరి నెలలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరచూ మాట్లాడుకునే వారు. ఇదే అదనుగా నటరాజు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె ఆరు నెలల గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే నిందితుడు ఆమెను కులం పేరుతో దూషిస్తూ, తాను పెళ్లిచేసుకోనంటూ దాటవేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ బి.మోహన్‌రావు, డీఎం మహేష్, సీఐ ఎస్.అప్పలరాజు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 కింద ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమాన విధించారు. అలాగే సెక్షన్ 417 కింద మోసం చేసినందుకు ఏడాది జైలు, రూ.500ల జరిమాన, ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 3(2) కింద ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏక కాలంలో అమలు జరపాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
పని చేస్తున్నసంస్థకే కన్నం
సాక్షి, గాజువాక(విశాఖపట్నం) : ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు అప్పుల పాలై వాటిని తీర్చడానికి తాను పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి రూ.9.42లక్షల నగదు, ఇతర సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్ – 2 డీసీపీ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన బొండాల సంతోష్ (31) ఎంబీఏ చదివాడు. అక్కిరెడ్డిపాలెంలోని సింహపురి ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. 2010లో రూ.6వేల జీతానికి సూపర్వైజర్గా చేరిన సంతోష్ తొమ్మిదేళ్లుగా అక్కడే పని చేస్తుండటంతో క్యాషియర్‌గా ప్రమోట్ చేసి రూ.15వేలు చెల్లిస్తున్నారు. అప్పులు తీర్చేందుకు దొంగావతారం ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లుగా ఆన్లైన్ రమ్మీ, జంగిల్ గేమ్స్ ఆడటానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వ్యసనాలకు కూడా బానిసయ్యాడు. తనకు వచ్చే జీతం చాలకపోవడంతో ఐసీఐసీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో అప్పులు వాడేశాడు. వాటితోపాటు తెలిసిన వారివద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేసి ఆన్లైన్ గేమ్‌లలో పోగొట్టుకున్నాడు. అప్పులను తిరిగి చెల్లించాలని బ్యాంకులు, అప్పులిచ్చిన వారు వస్తారన్న భయంతో తాను పని చేస్తున్న సంస్థలోనే డబ్బులను కాజేయాలని నిర్ణయించుకున్నాడు. తన పథకం ప్రకారం గత నెల 30న రాత్రి విధులు ముగించుకొన్న తరువాత కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో మేనేజర్ డెస్క్‌ను విరగ్గొట్టి అందులో ఉన్న రూ.11 లక్షలను తస్కరించాడు. అప్పటి నుంచి విధులకు కూడా హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తమ కార్యాలయంలో నగదు చోరీకి గురైందని మేనేజర్ వడ్లమూడి సురేష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సౌత్ క్రైం సీఐ ఎం.అవతారం ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంతోష్ చోరీకి పాల్పడినట్లు తేలడంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.9,42,500 నగదుపాతోటు రూ.56,500 విలువైన 18 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్లూటూత్ డివైస్, ఒక సెల్‌ఫోన్, అమెరికన్ టూరిస్టు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో ప్రతిభ చూపిన క్రైం సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో అదనపు క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ టి.పి.ప్రభాకర్, ఎస్ఐలు జి.వెంకటరావు, ఐ.దామోదర్‌రావు, జి.సంతోష్ పాల్గొన్నారు. -
మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!
సాక్షి, భీమిలి(విశాఖపట్నం) : ఏదోలా ఉద్యోగం సంపాదించాలన్న నిరుద్యోగుల బలహీనతను అసరాగా చేసుకొని కొంతమంది తెలివిగా మోసగించిన సంఘటనలు కోకొల్లలు. నమ్మిన వారిని మోసగించడమే కాకుండా తిరిగి వారినే బ్లాక్మెయిల్ చేయబోయి కథ అడ్డం తిరగడంతో బోర్లాపడిన ఘనుడి ఉదంతమింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లాకు చెందిన మట్టా కామరాజు (35) ఇంటర్ వరకూ చదువుకున్నాడు. పీఎం పాలెంలోని విజేత సూపర్ మార్కెట్ సమీపంలోని ది రెసిడెన్సీ నాలుగో అంతస్తులోని ప్లాటులో 11 నెలలుగా కుటుంబంతో నివసిస్తున్నాడు. నిరుద్యోగులను బుట్టలో వేయడానికి ఈ ఏడాది జనవరిలో శ్రీ సంపత్ వినాయక టెక్నాలజీ సెంటర్ పేరుతో జగదాంబ కూడలిలో ఓ సంస్థ ప్రారంభించాడ. తమ సంస్థ జీఎస్టీ లావాదేవీల వ్యవహారాలు చూస్తుందని నమ్మించి పలువురు యువతలను ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. అనంతరం వారికి జీఎస్టీ లావాదేవీలకు సంబంధించి కొద్దిరోజుల పాటు శిక్షణ కూడా ఇప్పించాడు. ఈ క్రమంలోనే జీఎస్టీ కార్యాలయంతో తనకు సంబంధాలు ఉన్నట్టుగా నమ్మించడానికి యువతులను పలుమార్లు అక్కడకు తీసుకెళ్లాడు. ఆరు నెలలుగా పైసా చెల్లించలేదు సంస్థలో చేరిన ఉద్యోగులకు రూ.15 వేలు నుంచి రూ.35 వేలు ఇస్తానని ప్రకటించాడు. అయితే ఆరు నెలలు కావస్తున్నా పనిచేస్తున్న సిబ్బందికి పైసా వేతనమూ ఇవ్వలేదు. ఈ విషయమై నిలదీయడానికి మంగళవారం మధ్యాహ్నం కామరాజు నివసిస్తున్న పీఎం పాలెంలోని నివాసానికి సిబ్బంది అంతా మూకుమ్మడిగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కామరాజు తాను నివసిస్తున్న నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించాడు. దీంతో అపార్టుమెంటువాసులు, స్థానికులు 100 నంబరుకు ఫోన్ చేయడంతో పీఎం పాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తున్న కామరాజును చాకచక్యంగా తాళ్లతో కట్టి కిందకు దించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగంలో చేరి మోసపోయిన వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఎంబీఏ పట్టభద్రలు కావడం విశేషం. 11 నెలలుగా అద్దె ఎగనామం మరోవైపు తాను నివాసముంటున్న ప్లాటు యజమాని గౌతం హర్షకు 11 నెలలుగా అద్దె చెల్లించకుండా కామరాజు ఇబ్బంది పెడుతున్నాడు. గౌతం దువ్వాడలో కుటుంబంతో నివాసముంటున్నారు. అతను అద్దె అడిగినప్పుడల్లా రేపూ మాపూ అంటూ కామరాజు రోజులు గడుపుతున్నాడు. ఈ క్రమంలో అపార్టుమెంటు పైనుంచి దూకేందుకు యత్నించాడన్న విషయం తెలుసుకున్న గౌతం హర్ష తన సోదరి భావన సాయంతో కామరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. మరోవైపు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ నిరుద్యోగ యువతులు పోలీసులకు తమ గోడు వినిపించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి
విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): మండలంలోని బోయపాలెం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ మృతి చెందగా అతని భార్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక పొలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శిద్దాబత్తుల సత్యశ్రీ నగేష్ (55) అనారోగ్యానికి గురికాగా కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం సోమవారం ఉదయం తన భార్య విజయతో కలిసి మోటార్ బైక్‌పై విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి విజయనగరం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో వారు బోయిపాలెం జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా ఆగడంతో నగేష్ తన ద్విచక్ర వాహనానికి బ్రేక్‌లు వేశాడు. దీంతో అదుపుతప్పి భార్య భర్తలు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో నగేష్ తలకు, చేతులకు తీవ్ర గాయాలుకాగా, విజయకు బలమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి రోడ్డుపై పడి ఉన్న ఇద్దరినీ పైకి లేవదీశారు. వెంటనే విజయ ఫోన్లో తమ బంధువులకు సమాచారం అందించింది. పోలీసులు వారిరువురిని 108 వాహనంలో నగరంలోని గీతం ఆస్పత్రికి తరలించగా అక్కడ నగేష్ మృతి చెందారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన విజయ గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆనందపురం సీఐ జి.శంకర రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించి.. విజయనగరంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన శిద్ధాబత్తుల సత్యశ్రీ నగేష్ 1987లో కానిస్టేబుల్‌గా ఎంపికై విజయనగరం జిల్లాలోని పెదమానాపురంలో తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. తర్వాత అన్నవరం, బుదులువలస పోలీస్ స్టేషన్లోను, ట్రాఫిక్ విభాగంలోను పనిచేసిన ఆయన క్రైం విభాగంలో హెచ్‌సీగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు హరి కిరణి, వంశీకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరి కిరణికి వివాహం కాగా వంశీకృష్ణ ఇటీవలే పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. -
చెడుపు ప్రచారంతోనే హత్య
విశాఖపట్నం, కొయ్యూరు(పాడేరు): చెడుపు చేస్తున్నాడని ప్రచారం చేయడమే అతని ప్రాణానికి చేటు తెచ్చింది. నాలుగేళ్లుగా కక్ష పెంచుకున్న నిందితుడు అవకాశం చిక్కగానే నాటుతుపాకీతో కాల్చి హత్య చేశాడు. మండలంలో ఆర్.కొత్తూరు పంచాయతీ మల్లవరం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన హత్యకు చెడుపు ప్రచారమే కారణమని సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన రమణాజీకి చెడుపు ఉందని శ్రీను, అతని తల్లి, మరికొంతమంది కలిసి కొంతకాలం గా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం సోకితే రమణాజీయే కారణమని ప్రచారం చేసేవారు.దీనిపై 2016లో రమణాజీ,శ్రీనులమధ్య ఘర్షణ జరిగింది.దీనిలో శ్రీను గాయపడ్డాడు. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రెండేళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తరువాత రాజీ పడ్డారు. నాటి నుంచి శ్రీనును చంపాలని రమణాజీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.ఆదివారం రాత్రి శ్రీను ఒంటరిగా వస్తున్న సమాచారం తెలుసుకుని నాటుతుపాకీ కాల్చాడు. సమాచారం తెలుసుకున్న నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఆయన వెంట కొయ్యూరు, నర్సీపట్నం సీఐలున్నారు. సోమవారం ఉదయం కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్,ఎస్ఐ అసిరితాత సంఘటన స్థలానికి వెళ్లి, శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రమణాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చెడుపు చేస్తున్నాడని రమణాజీపై శ్రీను తప్పుడు ప్రచారం చేయడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్నారు.ఇదే హత్యకు దారి తీసిందని సీఐ తెలిపారు. -
వివాహిత అదృశ్యం
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఒక వివాహిత అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముస్లిం తాటిచెట్లపాలెంకు చెందిన ఎ.భవాని(22)కి నగరానికి చెందిన జగదీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భర్తతో గొడవ పడి ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిందనుకొని భర్త ఆమె సోదరుడికి ఫోన్ చేశాడు. అక్కడికి రాలేదని చెప్పడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఫోర్తుటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు
సాక్షి, విశాఖపట్నం: ఉన్నత చదువులు చదివే క్రమంలో వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టారు. ఈ క్రమంలో కన్నతల్లే సలహాలు ఇస్తూ... చోరీ సొత్తును భద్రపరుస్తుండడంతో మరింతగా చెలరేగిపోయారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ముగ్గురూ జైలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా బుధవారం వెల్ల డించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఎంపాడ వెంకటరమణ కుమారులు ఎంపాడ చంద్రశేఖర్‌రెడ్డి బీటెక్, ఎంపాడ గోపీనాథ్ రెడ్డి డిప్లమో చదువుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని 2016 నుంచి ఇప్పటి వరకు 51 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ 22, గోపీనాథ్ 11, ఇద్దరూ కలిపి 18 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఈ బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఈ బంగారాన్ని వీరి తల్లి సరోజిని భద్రపరిచేది. మరికొన్ని సందార్భల్లో ఎక్కడైనా ఒంటరి మహిళలు ఉంటే వారి సమాచారాన్ని కుమారులకు చేరవేసేది. మొత్తంగా నగరంలో చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారం అపహరించారు. వీరి నుంచి 1142.50 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారంతోపాటు ఐదు బైక్‌లు అపహరించారని సీపీ తెలిపారు. ఈ దొంగతనాల వ్యవహారంలో మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. 2016 నుంచి 2019 వరకు చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుతూ వచ్చాయని, 2017లో 1727 కేసులు, 2018లో 1261 కేసులు, 2019 ఏప్రిల్ వరకు 261 కేసులు నమోదయ్యాయన్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ప్రభాకర్ బాబు, ఏసీపీ త్రినాథ్‌రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నిందితులు గోపీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి నిందితులపై కేసుల వివరాలివీ నిందితులు చంద్రశేఖర్, గోపీనాథ్‌లపై గాజువాక పోలీస్ స్టేషన్లో 21 కేసులు, దువ్వాడ పీఎస్‌లో 5, ఎంవీపీ పోలీస్ స్టేషన్లో 6, స్టీల్‌ప్లాంట్ పీఎస్‌లో 4, న్యూ పోర్ట్ పీఎస్‌లో 4, కంచరపాలెం పీఎస్‌లో 1, త్రీటౌన్‌లో 2, ఫోర్త్ టౌన్లో 1, మల్కాపురం పీఎస్‌లో 1, పెందుర్తి స్టేషన్లో 2, గోపాలపట్నం స్టేషన్లో 2, అనకాపల్లి స్టేషన్లో 3, మునగపాక స్టేషన్లో 2 కేసులు నమోదయయ్యాయి. ప్రత్యేక బృందానికి అభినందనలు విశాఖ నగరంలో చైన్ స్నాచింగ్స్ తరచూ జరుగుతుండడంతో ప్రత్యేక బృందాన్ని సీపీ ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఇన్స్పెక్టర్ ఎం.అవతారం నాయకత్వం వహించారు. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, వారి తల్లిపై అనుమానం రావడంతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న పరవాడలోని అనూష అపార్ట్‌మెంట్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ అవతారంతోపాటుగా సౌత్ సబ్ డివిజన్ క్రైం విభాగంలో ఎస్సైలు జి.తేజేశ్వరరావు, ఎల్.దామోదర్‌రావు, బి.లూథర్‌బాబు, డి.సూరిబాబు, మిగతా సిబ్బందిని సీపీ మహేష్‌చంద్ర లడ్డా అభినందించారు. -
పెళ్లై రెండేళ్లు గడవక మందే
పీఎం పాలెం(భీమిలి): పెళ్లై రెండేళ్లు గడవక మందే మనస్తాపంతో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రంపాలెం భరత్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ పి.సూర్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా బంటుబిల్లి గ్రామానికి చెందిన లుక్కా శ్రీనివాసరావుకు మచిలీపట్నం కొత్తపేటకు చెందిన వీరరాఘవమ్మతో (25) సుమారు రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి 9 నెలల పాప ఉంది. శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల కిందట చంద్రంపాలెం భరత్‌నగర్‌లోని ఓ గ్రూపు హౌస్‌లో వీరు కాపురంపెట్టారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి భోజనాల సమయంలో భార్యాభర్తల నడుమ చిన్నపాటి వివాదం జరిగింది. దీన్ని అవమానంగా భావించిన వీరరాఘవమ్మ అందరూ నిద్రించిన తరువాత వేరే గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని వేలాడుతున్న భార్యను గమనించిన శ్రీనివాసరావు వెంటనే కిందకు దించి పోలీసులకకు విషయం తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
యాంకర్ రష్మీ కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
అగనంపూడి (గాజువాక): నటి, యాంకర్ రష్మీ ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జాతీయ రహదారి కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రష్మీ అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ...రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక సంఘటన సమయంలో రష్మీతో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ ఎం.ఎ.గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్న పెళ్లి కార్డులు పంచి వస్తూ..
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): మండలం అడుగులుపుట్టు పంచాయతీ తమరడ గ్రామ సమీపంలో మంగళవారం ఆటోబోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గంపరాయి పంచాయతీ సుండ్రుపుట్టు గ్రామానికి చెందిన బొండా శివశంకర్వర ప్రసాద్ వివాహం ఈ నెల 24న జరగనుంది. ఆ వివాహానికి సంబంధించిన కార్డులను అతని తమ్ముడు బొండా సిద్ధేశ్వరరావు(17) ముంచంగిపుట్టు మండలంలో పలు గ్రామాల్లో పంచేందుకు సోమవారం తన సొంత ఆటోలో వెళ్లాడు. అడుగుల పట్టులో జాతర చూసుకుని మంగళవారం ఆటో డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న వ్యాన్ తప్పించే క్రమంలో ఆటోబోల్తాపడింది.దీంతో సిద్ధేశ్వరరావు కిందిపడిపోయాడు. అతని గుండె ఆటో పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటా హుటినా పెదబయలు పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. సొంత ఆటో కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
మృతదేహాలతోపాటు, బైక్‌ను నాలుగు కిలోమీటర్లు..
వారి తీయని స్నేహంలో విధి విషం చిమ్మింది.. కన్నవారి ఆశలను తుంచేస్తూ మృత్యుదేవత వారి ప్రాణాలను హరించేసింది.. లారీ డ్రైవర్ మద్యం మత్తు వారి కలల్ని ఈడ్చుకుపోయింది.. ముక్కచెక్కలైన వారి దేహాలను చూసి చూపరులకు సైతం మనసు వికలమైపోయింది. అత్యంత దారుణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు నూనూగు మీసాల యువకులు మృత్యువాత పడడమే ఒక ఘోరం కాగా.. వారు ప్రమాదానికి గురైన తీరు మరింత బాధాకరంగా మిగిలింది. ఒకే గ్రామం.. ఒకే వీధికి చెందిన కుప్పిన కార్తీక్ (17), రాయి నవీన్ (17), కోరిబిల్లి దుర్గాప్రసాద్ (17)ల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పి.ధర్మవరం గ్రామానికి చెందిన వీరు అడ్డురోడ్డులో ఆదర్శ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం వీరు బైక్‌పై యలమంచిలి వెళ్లేందుకు ధర్మవరం జంక్షన్లో రోడ్డు దాటుతుండగా తుని నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో జోగుతున్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిందన్న విషయాన్ని సైతం గుర్తించలేకపోయాడు. ఈ ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కిలోమీటరు దూరం వెళ్లాక నవీన్ మృతదేహం లారీని వీడి కింద పడిపోయింది. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని బైక్‌తోపాటు లారీ నాలుగు కిలోమీటర్ల దూరం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ విషయం గమనించిన జాతీయ రహదారి సిబ్బంది తమ వాహనంలో లారీని వెంబడించి అడ్డుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్, ఎస్.రాయవరం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు డ్రైవరు ఎస్.కె.బాషాను పోలీసులకు అప్పగించారు. ఛిద్రమైన మృతదేహాలను చూసిపిల్లల తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తీరని గర్భశోకం వారి గుండెలను పిండేసింది. ఎస్.రాయవరం/యలమంచిలి/నక్కపల్లి/: మరణం వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. వారి మధ్య బంధం చూసి విధికి సైతం కన్నుకుట్టింది. పి.ధర్మవరం జంక్షన్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణస్నేహితులను బలిగొంది. విధి ఎంత వికృతమైందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు. కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో కూడా కలిసే పాల్గొనే వారు. చిన్నతనం నుంచి మరణించేవరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. చివరకు తుది శ్వాస కూడా కలిసే వదిలేశారు. విషాదమేమిటంటే ముగ్గురూ వారి ఇంటిలో ఆఖరి సంతానమే. సాయంత్రం వరకు తల్లికి చెప్పలేదు.. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన కుప్పిన కార్తీక్‌ది యలమంచిలి మండలం ఏటికొప్పాక. 40 ఏళ్ల క్రితం వీరి కుటుంబం పి.ధర్మవరానికి పొట్టకూటి కోసం వలస వచ్చింది. తల్లిదండ్రులు బాబూరావు, అప్పలనర్స. వీరికి ముగ్గురు సంతానం. పెద్దకొడుకులు కూలిపనులు చేస్తూ తమ్ముడ్ని చదివిస్తున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. నాలుగేళ్లక్రితం అనా రోగ్యంతో మరణించాడు. తల్లి ప్రస్తుతం అనా రోగ్యంతో బాధపడుతోంది. మందుల కోసం మంగళవారం ఆమె అనకాపల్లి వెళ్లింది. రోడ్డుప్రమాదంలో చిన్నకొడుకు మరణించిన విషయం ఆమెకు సాయంత్రం వరకు చెప్పలేదు. ఆమె షాక్‌కు గురైతే ఏం జరుగుతుందోనన్న భయంతో సాయంత్రం వరకు దాచివుంచారు. చివరకు సాయంత్రం చిన్నకొడుకు మరణ వార్త చేరవేయడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చనిపోయిన వారిలో కొడుకు ఉన్నాడని తెలీదు... పి.ధర్మవరం జంక్షన్లో లారీ ఢీకొని ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న గ్రామస్తులంతా ఘటనాస్థలం వద్దకు పరుగులు తీశారు. వారితో పాటు మరో మృతుడు రాయి నవీన్ తల్లి రోహిణి కూడా ఉంది. అందరూ వెళ్తుంటే తాను కూడా చూసొద్దామని వెళ్లింది. కాని అక్కడ జరిగిన ఘటన తనకు కడుపుకోత మిగులుస్తుందని ఊహించలేదు. చనిపోయిన వారిలో తన కొడుకు ఉన్నాడని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదే ప్రమాదంలో మరణించిన కార్తీక్నకు నవీన్ మేనమామ కొడుకు. వీరి స్వస్థలం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం. 20 ఏళ్లక్రితం పి.ధర్మవరం వలస వచ్చారు. తండ్రి పశువుల వ్యాపారం చేస్తుంటాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. చిన్నకొడుకును చదివిస్తున్నారు. తండ్రి రమణ వ్యక్తిగత పనులపై తుని వెళ్లినట్లు తెలిసింది. కొడుకు మృతదేహాన్ని లారీ ఈడ్చుకుపోయిందన్న విషయం తెలిసి కన్నతల్లి రోడ్డుపై వెతుక్కుంటూ వెళ్లడం స్థానికులను కలిచి వేసింది. చిన్నకొడుకు కావడంతో చదువుకుంటానంటే ఎంతో ఆప్యాయంగా చదివిస్తున్నామని.. ప్రయోజకుడవుతాడనుకుంటే భగవంతుడు తీసుకుపోయాడంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ... తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న కోరిబిల్లి దుర్గాప్రసాద్ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పి.ధర్మవరానికి చెందిన కోరిబిల్లి నాగేశ్వరరావు స్థానికంగానే బార్బర్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దుర్గాప్రసాద్ కూడా తీరిక సమయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కులవృత్తి నేర్చుకుంటున్నాడు. నాగేశ్వరరావుకు ముగ్గురు సంతానం. మృతుడు మూడో కుమారుడు. కులవృత్తి నేర్చుకోరా నాన్నా.. అంటే చదువుకుంటాను, పెద్ద ఉద్యోగాలు చేస్తాను అనే వాడని.. తాము ఎలాగూ ఇదే వృత్తిలో ఉన్నాం... కనీసం వాడయినా చదువుకుంటానంటే చదివించడం మంచిది కదా అని చదివిస్తున్నానని.. విధి తమ కుటుంబానికి అన్యాయం చేస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు కుటుంబం బోరున విలపిస్తోంది. ఆటపాటలు, చదువు సంధ్యల్లో కలిసి మెలిసే.. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు ముగ్గురూ ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు ఒకే పాఠశాలలో, ఒకే కళాశాలలో చదివారు. ఆటల్లో పాల్గొన్నా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ముగ్గురూ కలిసే చేసేవారు. పి.ధర్మవరంలో ఒకేధిలో నివసిస్తున్న వీరి మరణ వార్త తెలిసిన గ్రామస్తులంతా జాతీయ రహదారిపై ధర్మవరం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. వీరి మృతదేహాలను చూసి కంటతడిపెట్టారు. వీరి స్నేహాన్ని చూసి మాకే కళ్లుకుట్టేవని... అంత ప్రాణప్రదంగా ఉండేవారని చుట్టు పక్కల వారు పేర్కొన్నారు. విధి కూడా వీరి స్నేహాన్ని చూసి ఓర్వలేకపోయిందని, ముగ్గురినీ ఒకేసారి పొట్టనపెట్టుకుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేసింది. కన్నీరు మున్నీరైన ధర్మవరం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ధర్మవరం కన్నీరుమున్నీరయింది. ఇదే గ్రామానికి చెంది న ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిన గ్రామస్తులంతా వందలాదిగా ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మరణించగా నవీన్, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలతోపాటు, బైక్‌ను లారీ నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకపోయింది. ఈ ఘటన స్థానికులను గగుర్పాటుకు గురిచేసింది. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
విశాఖపట్నం , పెందుర్తి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి(బైపాస్) పెందుర్తి మండలం పినగాడి కూడలి వద్ద గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు రాజబాబు(33) గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వద్ద ప్రస్తుతం గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చీడికాడ మండలం తంగుడుబిల్లి గ్రామానికి చెందిన కణితి కొండయ్య, రామలక్ష్మి దంపతులకు నాలుగో సంతానం రాజబాబు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే పల్లా వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెందుర్తిలో భార్య శ్రీలక్ష్మితో నివాసం ఉంటున్న రాజబాబు గురువారం సాయంత్రం స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. పినగాడి కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం రాజబాబు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై తుళ్లిపడడంతో తలకు, శరీరానికి తీవ్రగాయాలై అక్కడిక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులోని ఐడీ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది. మూడేళ్ల క్రితం రాజబాబుకు శ్రీలక్ష్మితో వివాహం జరగ్గా ఇటీవలే వీరికి పాప పుట్టి అనారోగ్యంతో మరణించింది. తంగుడుబిల్లిలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు కొండయ్య, రామలక్ష్మితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నయ్య కుటుంబానికి రాజబాబు సంపాదనే ఆధారం. రాజబాబు మరణంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులకుసీపీ పరామర్శ ద్వారకానగర్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రాజబాబు కుటుంబ సభ్యులను కేజీహెచ్ వద్ద గురువారం రాత్రి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా, డీసీపీ రవీంధ్రబాబు, ఏడీసీపీ (ఎస్బీ) శ్రీనివాస్‌రావు పరామర్శించి ఓదార్చారు. మృతదేహం వద్ద సీపీ నివాళులర్పించారు. -
ఆర్థిక ఇబ్బందులే ఉసురు తీశాయా..?
విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): ఇద్దరూ గిరిజనులే..ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్నారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన గడికించుమండలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ గ్రామంతోపాటు రంగశీలలోనూ విషాదం అలుముకుంది. హుకుంపేట ఎస్ఐ బి.నాగకార్తీక్ జంట ఆత్మహత్య సంఘటను దారి తీసిన వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని రంగశీల పంచాయతీ ఇరుకువలసకు చెందిన కొర్రా రామచంద్రరావు(21)సర్వీసు జీపులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే మండలం గడికించుమండకు చెందిన రేణుక(20)ను ప్రేమించి పెద్దల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరునెలల క్రితం రేణుక తన తల్లి వద్ద రూ.లక్షన్నర అప్పుచేసి భర్త రాంచంద్రరావుకు ఇచ్చింది. ఈ సొమ్ముతో జీపు కొనుగోలు చేసి సొంతంగా నడుపుకుని జీవించాలని భావించారు. రాంచంద్రరావు జీపు కొనుగోలు చేయకుండా ఆ డబ్బును దుబారా చేశాడు. ఓ క్రిమినల్ కేసులోనూ ఇరుక్కున్నాడు. పట్టుకెళ్లిన డబ్బులివ్వాలని అత్త ఒత్తిడి చేసేది. నగదు విషయమై భార్య రేణుక పలు సందర్భాల్లో అతడ్ని నిలదీసేది. తరచూ గొడవలు పడేవారు. అలాగే కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో గడికించుమండలోని అత్తవారింటికి రామచంద్రరావు రావడం మానేశాడు. ఇలా దంపతుల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో రేణుకను కలిసేందుకు శనివారం రాత్రి 12గంటల సమయంలో రామచంద్రరావు గడికించుమండ వెళ్లాడు. దంపతుల మధ్య తగాదా చోటుచేసుకుంది. అనంతరం భార్య రేణుకను బైక్‌పై ఎక్కించుకుని రామచంద్రరావు వెళ్లిపోయాడు. ఇద్దరూ ఇరుకువలస వెళ్లిపోయి ఉంటారని అంతా భావించారు. ఆదివారం ఉదయానికి గడికించుమండ సమీపంలోని పంట భూముల వద్ద తాగునీటి బావి సమీపంలో రేణుక చున్నీ,సెల్ఫోన్లు కనిపించాయి. అనుమానం వచ్చిన గ్రామస్తులు హుకుంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నాగకార్తీక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గిరిజనులు కర్రల సాయంతో బావిలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. శనివారం రాత్రే ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ నాగకార్తీక్ కుటుంబీకులను ఆరా తీయగా ఆర్థిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'పొగ'బట్టింది
విశాఖపట్నం, జి.మాడుగుల(పాడేరు): కుమార్తె చదువు, ఆరోగ్యం,యోగక్షేమాలు గురించి తెలుసుకోడానికి వచ్చిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. చలి నుంచి రక్షణ కోసం గదిలో పెట్టిన నిప్పుల కుంపటి ఆ కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. అందరికీ ఊపిరాకుండా చేసి ఒకరిని బలిగొంది. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటన మండలంలోని ఉరుము గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జి.మాడుగుల పంచాయతీఉరుము గ్రామానికి చెందిన కొటారి సింహచలం, శ్వేతకుమారి (శాంతి)(35) దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె ప్రియదర్శిని పాడేరు గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది. చిన్నకుమార్తె సౌజన్య, కొడుకు శ్రీరామ్‌లను తీసుకుని ఉపాధి కోసం ఏలూరు సమీపంలోని గంగన్నపాలేం వెళ్లారు. అక్కడ కోళ్లఫారంలో పనికి కుదిరారు. గురుకులంలో చదువుతున్న ప్రియదర్శిని చూడటానికి మంగళవారం తల్లి శ్వేతకుమారి చినపాప సౌజన్యతో కలిసి పాడేరు వచ్చింది. అనంతరం తల్లీకూతుర్లు స్వగ్రామం ఉరుము వెళ్లారు. బంధువు కొటారి చిన్నతల్లి ఇంటిలో రాత్రికి పాపతో కలిసి శ్వేతకుమారి నిద్రపోయింది. వీరితో ఇంటియజమాని చిన్నతల్లి, తూబే లింగమ్మ, కొటారి చిట్టమ్మలు ఒకే గదిలో పడుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వెచ్చదనం కోసం గదిలో నిప్పుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. తలుపులు, కిటికీలు మూసేసి నిద్రలోకి జారుకున్నారు. నిప్పుల కుంపటి పొగ గదినిండా అలముకుంది. దాని ధాటికి గురై అంతా అపస్మారకస్థితికి చేరారు. బుధవారం ఉదయం 8గంటల వరకు ఇంటిలోని వారు ఎవరూ నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చి పొరుగింటివారు బలంగా తలుపులు, కిటికీలు తెరిచి చూడగా ఐదుగురూ నురగలు కక్కుతూ కనిపించారు. ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా శ్వేతకుమారి చనిపోయి ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని జి.మాడుగుల పీహెచ్‌సీకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పాడేరు ఏరియా అస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ పాడేరు సమన్వమకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మత్స్యరాస వరహాలరాజు పరిశీలించారు. మృతి కారణాలను తెలసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శేతకుమారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కలకలం రేపిన ఆత్మహత్యాయత్నాలు
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాంతంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్యకు యత్నించడం... వారిలో యువతి మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. తమ ప్రేమ ఫలించదనే వేదనతోనే ఆత్మహత్యకు యత్నించామని యువకుడు చెబుతుంటే... తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 49వ వార్డు మల్కాపురం, క్రాంతినగర్ ప్రాంతంలో దేవి(22) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతంలో దేవి ఇంటికి సమీపాన అనుదీప్(24)అలియాస్ అరవింద్ అనే యువకుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9:15గంటలకు దేవి తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. అనుమానంతో గదిలోకి వెళ్లిన దేవి తల్లిదండ్రులు ఫ్యాన్ హుక్కు వేలాడుతున్న దేవిని కిందకు దించి స్థానిక సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని స్థానిక వైద్యులు నిర్థారించడంతో మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై భిన్న వాదనలు మరోవైపు 9:40 గంటల సమయంలో తన ఇంటిలో అనుదీప్ ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబ సభ్యులు గుర్తించి రక్షించారని పోలీసులకు సదరు యువకుడు చెబుతున్నాడు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, యువతి ఇంటిలో ప్రేమ విషయం తెలియడంతో వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని... అందువల్లే ఆత్మహత్యకు యత్నించామని అనుదీప్ పోలీసులకు చెబుతున్నాడు. అయితే అతని మెడపైగానీ, ఎక్కడా ఆత్మహత్యకు యత్నించిన ఆనవాళ్లు లేవని... అసలు వారిద్దరి మధ్య ప్రేమే లేదని... ప్రేమ పేరుతో దేవిని అనుదీప్ కొంత కాలంగా వేధిస్తున్నాడని... దీనిపై ఓ లేఖ కూడా దేవి రాసిందని ఆమె చిన్నాన్న మహాత్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువకుడి తల్లిదండ్రులను విచారిస్తున్న సీఐ భాస్కర్‌రావు నిజంగా వారిద్దరూ ప్రేమించుకుంటే ఒకేచోట ఆత్మహత్యకు యత్నించాలి కదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవి ఆత్మహత్య చేసుకోవడంతో తామంతా అతడిపై దాడి చేస్తామన్న భయంతో అనుదీప్ ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఫిర్యాదు మేరకు అనుదీప్‌ను, అతని తల్లిదండ్రులను మల్కాపురం పోలీసులు విచారించారు. అనంతరం సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ లంకా భాస్కర్‌రావు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. -
72 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం): గంజాయిని తరలిస్తూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కిల్లీబడ్డీని ఢీ కొంది. ఆ కారు నుంచి 72 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.కె.వి.వి. ప్రసాద్ వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం పాడేరు నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న కారులో గంజాయి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాడుగుల మండలం ముకుందపురం నుంచి టాస్క్‌పోర్స్ పోలీసులు ఆ కారును వెంబడిస్తూ వచ్చారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు కారును వేగంగా నడిపారు. వడ్డాది నాలుగురోడ్ల జంక్షన్లో ఎదురుగా వస్తున్న వాహనా న్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్క న ఉన్న కిల్లీషాపును ఢీ కొట్టారు. స్థానికులు గుమిగూడడంతో వారు ముందుక వెళ్లలేకపోయారు. పోలీసులు వచ్చి కారులో కేరళ రాష్ట్రం బల్టర్ జిల్లా మాలాపురానికి చెందిన నిందితులు మహామ్మద్ స్వలిహి, రఫీక్ పత్తార్, సలియన్ తామస్‌ను అరెస్టు చేశారు. 36 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ మూడు లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సీఐ కె.కామేశ్వరరావు,ఎస్సైలు ఎస్.ధర్మారావు, రాజ్యలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కిల్లీషాపు పూర్తిగా ధ్వంసమైంది. సంఘటన జరిగిన సమయంలో పాన్‌షాపు తెరిచి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కిల్లీబడ్డీ యజమానికి రూ. 40 వేల నష్టం జరిగింది. -
అడవివరంలో పట్టపగలే భారీ చోరీ
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): అడవివరంలో గురువారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారిని ఆనుకుని పాత గోశాలకి సమీపంలో ఉన్న చందన హిల్స్ వీధిలో నివసిస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 40 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు అపహరించుకుని పోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఆటోనగర్‌లో ఉన్న సాహువాలా సిలెండర్స్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న కనుమూరి సాంబమూర్తిరాజు అడవివరంలోని చందన హిల్స్ వీధిలో సొంత ఇంట్లో భార్య ఉమాదేవి, కూతురుతో ఉంటున్నారు. సాంమమూర్తిరాజు గురువారం ఉదయం కంపెనీకి వెళ్లగా, కూతురు కళాశాలకి వెళ్లింది. భార్య ఉమాదేవి ఇంటికి తాళం వేసి ఉదయం 10 గంటల సమయంలో సింహగిరిపై జరిగిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాల కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 12.30గంటల సమయంలో ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తాళం తీసి తలుçపు తొయ్యగా అది రాలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికీ రాకపోవడం, లోపల నుంచి వెలుగు వస్తుండటంతో వెనుక వైపుకి వెళ్లి చూశారు. వెనుక వైపున ఉన్న ద్వారం పూర్తిగా తెరిచి ఉండడంతో లోపలకి వెళ్లి చూడగా కింది బెడ్రూమ్, పై అంతస్తులోని బెడ్రూముల్లోని బీరువాల్లోని దుస్తులు చిందవరవదగా పడేసి ఉన్నాయి. బీరువాలోని నగలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, నార్త్ ఏసీపీ ఫల్గుణరావు, గోపాలపట్నం సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ తమ్మినాయుడు, పెందుర్తి ఎస్ఐ జి.డి.బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలు సభ్యులు తనిఖీలు చేశారు. ఇంటి వెనుక వైపు గ్రిల్, తలుపు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడినట్టు డీసీపీ తెలిపారు. ఎంతమేరకు బంగారం, నగదు పోయాయో లెక్క వేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
120 కేజీల గంజాయి పట్టివేత
మల్కాపురం(విశాఖ పశ్చిమ): పారిశ్రామిక ప్రాతంలో గం జాయి తరలిస్తున్న వారిని మల్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు ద్వారా తీసుకువచ్చిన గంజాయిని ఓ ఇంటి వద్ద డంప్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పంచదార్ల రమణ అనే వ్యక్తి 47వ వార్డు ఎక్స్సర్వీస్మెన్కాలనీలో ఓ ఇంట్లో మూడు నెలల క్రి తం అద్దెకు దిగాడు. ఇతను జీకేవీధికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నాడు. రమణ అత్తమామలకు చింతపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. ఆ సమీపాన పండిస్తున్న గంజాయిని రమణ తక్కువ ధరకు కొనుగోలు చేసి, గతంలో పరిచయం ఉన్న తమిళనాడు, మధురై ప్రాంతాలకు చెందిని ఐదుగురు (నగరంలో ఈ ఐదుగురు నివాసముంటున్నారు) సాయంతో కేజీ రూ.12వేలు చొప్పున విక్రయిస్తుం టాడని, ఈ మేరకు గురువారం అర్ధరాత్రి రెండు కార్లలో చింతపల్లి నుంచి తీసుకువచ్చిన 120 కిలోల గంజాయిని డంప్ చేశారు... అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన ఎస్బీ పోలీసులు, మల్కాపురం పోలీ సుల సాయంతో అర్ధరాత్రి రమణ ఇంటిపై దాడి చెయ్యగా గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలించిన రమణతో పాటు ఐదుగురు తమిళనాడు ప్రాంత వాసులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు. -
చోరీ ముఠాల ఆటకట్టు
సాక్షి, విశాఖపట్నం: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల నుంచి రూ.కోటికి పైగా విలువైన సొత్తును విశాఖ నగర పోలీసులు రికవరీ చేశారు. ఇందులో 609 గ్రాముల బంగారం, 1564 గ్రాముల వెండి, ఒక కారు, మూడు పెద్ద లారీలు, 2 మోటారు సైకిళ్లు, మూడు సెల్ఫోన్లు ఉన్నాయి. మొత్తం 40 కేసులను ఛేదించి 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో పేరుమోసిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు ఉన్నారు. ఈ వివరాలను కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ♦ గుజరాత్‌లోని దోహాద్ జిల్లాకు చెందిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు మడియ కంజి, మందోడ్ సుబలబాయి, సత్రబాయి రుమాల్ బాయిలు నగర పరిధిలోని గాజువాక, దువ్వాడ, పీఎం పాలెం, ఆరిలోవ, భీమిలితో పాటు నెల్లూరు, తిరుపతి, ఖమ్మంలలో చోరీలకు పాల్పడ్డారు. వీరిపై 2010 నుంచి 20 కేసులున్నాయి. సౌత్ డివిజన్ క్రైం సీఐ కె.పైడపునాయుడు నేతృత్వంలో ఎస్ఐ సూరిబాబు, పోలీస్ సిబ్బంది షీలానగర్ వద్ద వీరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత సొత్తును దాహోద్‌లో రికవరీ చేయాల్సి ఉందని సీపీ తెలిపారు. ♦ షీలానగర్ ఎంకేఎం గ్రాండ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రిటైర్డ్ డాక్టర్ కుమారరత్నం, అతని భార్య దేవిపై కత్తితో దాడి చేసి నగదు, సెల్ఫోన్లను దొంగిలించిన కేసులో విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన మామిడి సూరప్పడును అరెస్టు చేశారు. అతడి నుంచి ఒక సెల్‌ఫోన్, రూ.వెయ్యి నగదు రికవరీ చేశారు. సూరప్పడు గతంలో షీలానగర్‌లోని తులసి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడని, చెడు అలవాట్లతో దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. లారీల చోరుల అరెస్టు లారీలను దొంగిలించిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పారు. గతంలో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తూ వ్యసనాలకు అలవాటుపడిన తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన పూడి జోగిబాబు అగనంపూడిలో ఉండేవాడు. అతనితోపాటు అతని సోదరుడి కుమారుడు వనం రాజు, అతని వద్ద పనిచేసే లారీ డ్రైవర్ డేరంగుల ప్రసాద్‌లు కలిసి ఇనుపలోడును గమ్యానికి చేర్చకుండా సరకును అమ్ముకున్న కేసులో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన వీరు గాజువాక ఆటోనగర్‌లో రూ.90 లక్షలు విలువ చేసే మూడు ట్రాలర్ లారీలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్నారు. వీరితో పాటు కొనుగోలు చేసిన పాయకరావుపేటకు చెందిన గురుబెల్లి సూర్యనాగేశ్వరరావును అగనంపూడి వద్ద క్రైం ఇన్స్పెక్టర్ పైడపునాయుడు బృందం అరెస్టు చేసిందని చెప్పారు. వీరి నుంచి మూడు ట్రాలర్ లారీలు, ఒక ట్రాక్టరు, 12 లారీ టైర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ♦ మరో కేసులో హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి జి.శివకృష్ణను అరెస్టు చేశామని సీపీ తెలిపారు. ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణస్తున్న శివకృష్ణను గస్తీలో ఉన్న ఎస్ఐ జీడీబాబు ఆరా తీశారన్నారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతనిపై 9 దొంగతనం కేసులున్నట్టు నిర్థారణ అయిందన్నారు. అతని నుంచి 504 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి వస్తువులు కొనుగోలు చేసిన తుమ్మూరి వీరభద్రరావును కూడా అరెస్ట్ చేశామన్నారు. ఒక స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.20.48లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్.కిరణ్, విజయ, వసంతకుమార్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 4.45 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు. ఈ కేసులను ఛేదించిన సీఐ పైడపునాయుడితో పాటు పోలీసు సిబ్బందిని సీపీ లడ్డా అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో క్రైం డీసీపీ దామోదర్, శాంతిభద్రతల డీసీపీ రవీంద్రనాథ్‌బాబు, ఏడీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీలు ఫల్గుణరావు, వై.గోవిందరావు, క్రైం సీఐ పైడపునాయుడు పాల్గొన్నారు. -
మృత్యు లారీ
విశాఖపట్నం, తగరపువలస(భీమిలి): సంగివలస–పాండ్రంగి రహదారిలో భీమిలి మండలం తాటితూరు పంచాయితీ కళ్లాల వద్ద ఆదివారం సాయంత్రం ఇటుకల లారీ బోల్తా పడి న ప్రమాదంలో పాదచారి కర్రోతు పైడయ్య(48) దుర్మరణం పాలయ్యాడు. అదే ప్రమాదంలో డైవ ర్ సహా మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సా క్షులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయితీ సామియ్యవలస నుంచి ఇటుకల లోడుతో సంగివలస వైపు వస్తున్న క్వారీ లారీ తాటితూరు కళ్లాల సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. అ సమయంలో సామియ్యవలసకే చెందిన కర్రోతు పైడయ్య తగరపువలస సంత నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. లారీ బోల్తా పడడంతో వెనుక చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడని స్థానికులు తెలిపారు. అయితే మరో కథ నం ప్రకారం... అదే లారీలో ఇటుకలపై కూర్చు న్న పైడయ్య లారీ అదుపు తప్పిన వెంటనే రక్షిం చుకునేందుకు గెంతే ప్రయత్నంలో వెనుక టైర్ల కిం ద చిక్కుకుపోయినట్టు తెలిపారు. ఇదే ప్రమాదంలో భోగాపురం మండలం ఉప్పాడపేటకు చెందిన లారీ కూలీ లు పట్నాల రమణ, సాడి కృష్ణ, డ్రైవ ర్ రామారావు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిం చారు. ఇటుకల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పుకోవడం వల్లే గాయాలతో బయట పడ్డారని... లేదంటే ఇటుకల మధ్య సజీవ సమాధి అయ్యేవారని స్థానికులు తెలిపారు. ఈ లారీ ఆనందపురానికి చెందిన దొంతల నాగరాజుదని తెలిపా రు. వ్యవసాయకూలీ అయిన పైడయ్యకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు అప్పలరాజు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె శాంతి కి ఇంకా వివాహం కావాల్సి ఉండగా కుమారుడు అప్పలరాజు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపారు. పైడయ్య మృతితో సామియ్యవలసకు చెందిన పలువురు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గోస్తనీ నదీ తీరం దుఃఖసాగరమయింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలిచివేశాయి. సంఘటనా స్థలానికి భీమిలి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది చేరుకుని టైర్ల కింద చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన పిళ్లా కీర్తి పద్మావతి(19)ని బక్కన్నపాలెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మహేష్‌కు ఇచ్చి సుమారు 7 నెలల కిందట వివాహం చేశారు. ఆమె కడుపు నొప్పి, నడుము నొప్పితో దీర్ఘకాలంగా బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో వారందరూ దిగువ పోర్షన్లోని గదులలో నిద్రపోతుండగా పై అంతస్తులో నిర్మించిన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
తీరని శోకం
విశాఖపట్నం, ఎస్.రాయవరం(పాయకరావుపేట): నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకుల మృతి మిస్టరీగా మారింది. అన్నవరం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకుల మృతి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగల్చగా, ఎలా మృతి చెందారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ గ్రామంలో తిరిగా రు. మిత్రులతో క్రికెట్ ఆడి సంతోషంగా గడిపారు. ఆ రాత్రి గడిచి సోమవారం తెల్లారుతుండగానే విషాద వార్త గ్రామస్తుల కంట కన్నీ రు పెట్టించింది. కోటవురట్ల మండలం అన్నవరం గ్రా మానికి చెందిన పైల లక్ష్మీనా రాయణ(20), బోళెం వాసు(22) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మండలంలోని నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలు పడి ఉండడాన్ని సోమవారం గుర్తించా రు. పట్టాలకు మధ్యలో మృతదేహాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుని స్టేషన్లో రైలు ఎక్కి ఇద్దరూ విశాఖపట్నం వెళుతుండగా నర్సీ పట్నం రోడ్డు రైల్వే స్టేషన్ దాటాక ప్రమాదశాత్తూ జారిపడ్డారా? లేక ఎవరైనా రైలు లో నుంచి నెట్టేశారా అన్నది ప్రశ్నార్ధకం. లేకపోతే ఒకరు జారిపోతుండగా రక్షించబోయి మరో యువకుడు కూడా ప్రమాదానికి గురయ్యాడా? ఇవన్నీ అంతుపట్ట ని ప్రశ్నలు. గ్రామస్తులు, మిత్రుల కథ నం మేరకు ఇరువురు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని తెలుస్తోంది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామనే తప న ఇద్దరిలో ఉండేదంటున్నారు. ఉద్యోగ ప్రయత్నంలోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తమవుతోంది. పైల సత్తిబా బు, వరహాలమ్మకు ఒక కుమార్తె, కుమారుడు కాగా లక్ష్మీనారాయణ కుటుంబం లో చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే అందొస్తాడని తల్లిదండ్రలు కలలు కన్నారు. వారి ఆశలను హరి స్తూ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మరో యువకుడు బోళెం వాసు దంపతులు పాత్రుడు, సత్యవతులకు ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టాడు. నిరుపేద కుటుంబం కావడంతో కష్టపడి డిప్లమా చదివించారు. ఉద్యోగంలో స్థిరపడితే కష్టాలు తీరిపోతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు డ్రిప్ ఇరిగేషన్లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణవార్త ఆ తల్లిదండ్రుల గుండెల్లో విషాదం నింపింది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామస్తులు కావడంతో అన్నవరంలో విషాదం అలుముకుంది. రెండిళ్ల వద్ద స్థానికులు గుమిగూడారు. కాగా తుని రైల్వే ఎస్ఐ ఎస్.కె.అబ్దుల్‌మరూఫ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రేవ్ పార్టీ గుడారాల తొలగింపు
విశాఖపట్నం, చింతపల్లి(పాడేరు): మండలంలోని తాజంగి సమీపంలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ప్రాంతంపై ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించారు. ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి ప్రాంతానికి శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని విశాఖపట్నం, హైదరాబాద్, చోడవరం ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు అత్యంత రహస్యంగా అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి భారీ ఎత్తున రేవ్‌పార్టీ నిర్వహించి చుట్టుపక్కల వారికి నిద్రలేకుండా పెద్ద శబ్దాలతో ఐటెమ్ సాంగ్స్, అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ వార్త ఆదివారం పత్రికల్లో ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి రేవ్‌పార్టీ నిర్వహణపై ఆరా తీశారు. నిర్వహణ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాలను తొలగించారు. -
పాల కోసం వెళుతూ మృత్యువు పాలు
విశాఖపట్నం, చోడవరం జోన్ : పాలప్యాకెట్ల కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు దీంతో రాయపురాజు పేటలో విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాయపురాజుపేటకు చెందిన ఆళ్ల నర్సింగరావు(27) శుక్రవారం ఉదయం పాల పేకెట్టు కోసం తన ద్విచక్రవాహనంపైన వెంకన్నపాలెం వెళ్తుండగా నర్సాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న విశాఖ డెయిరీ పాల లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో నర్సింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. తల్లి కాసులమ్మతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నర్సింగరావు తండ్రి గంగయ్య చిన్నతనంలోనే మృతి చెందగా తల్లి కాసులమ్మ వ్యవసాయ కూలి చేస్తూ నర్సింగరావును, ఇద్దరు కుమార్తెలను పోషించింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. ప్రస్తుతం నర్సింగరావు అనకాపల్లిలోని ఒక ప్రయివేటు స్టీల్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నర్సింగరావు మృతి చెందడంతో తల్లి కాసులమ్మ ఇక తనను పోషించేవారు ఎవరున్నారని తనకు తలకొరివి పెడతాడనుకున్న కొడుకు చనిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. పండగపూట ప్రమాదం జరగడంతో రాయపురాజు పేటలో విషాదం అలము కుంది. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
విశాఖపట్నం∙, భీమునిపట్నం: బే వాచ్ పార్కు నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పదకొండేళ్లకే బాలుడికి నూరేళ్లు నిండిపోవడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అనుమతి లేకుండా గైరావీల్ ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణ లేకుండా బే వాచ్ పార్కు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కె.నగరపాలెం పంచాయతీ చిన మంగమారిపేటకు చెందిన మైలిపల్లి శివదేవాస్(11) రమాద్రి వద్ద ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి మైలిపల్లి శ్రీనివాస్ కూలి పనులు చేస్తుండగా తల్లి దేవి భీమిలి బీచ్ రోడ్డులోని తొట్లకొండ ఎదరుగా ఉన్న బే వాచ్ పార్కులో పని చేస్తుంది. బుధవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లితో కలిసి శివదేవాస్ పార్కుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌తో తిరిగే గైరా వీల్ ఉంది. అందులో పిల్లలు కూర్చుంటే కిందకు మీదకు తిరుగుతుంది. బాలుడి తల్లి పనిలో ఉండగా శివదేవాస్ దానిపైకి ఎక్కి తిరగడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోవడంతో దాని రాడ్డుకు తల బలంగా తగలడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి తల్లి దేవి తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరైంది. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన బాలుడు పెద్ద కొడుకు. చిన్నవాడు జగన్ మూడో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే... ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న బే వాచ్ పార్కులో గైరా వీల్ నిర్వహించడానికి అనుమతి ఉండాలి. అలాగే దీన్ని తిప్పడానికి అనుభవం ఉన్న ఆపరేటర్ ఉండాలి. అయితే దీనికి అనుమతిగానీ ఆపరేటర్‌గానీ లేరని తెలిసింది. ముఖ్యంగా దీని వద్దకు పిల్లలు వెళ్లకుండా తప్పనిసరిగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శివదేవాస్ దానిపైకి ఎక్కినా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాలుడు చనిపోయినా నిర్వహకులు పెద్దగా స్పందించ లేదు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై లైంగిక దాడి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న 13 మంది పోలీసు సిబ్బందికి లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30తేదీలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేసును ఈనెల 30కి వాయిదా వేశారు. 2008 ఆగస్టు 21న కొంతమంది గ్రేహౌండ్ పోలీసులు తనిఖీల నెపంతో విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమైన జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కొంతమంది గిరిజన మహిళలపై లైంగికి దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసు పలు మలుపులు తిరిగి చివరికి విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విచారణకు వచ్చింది. గిరిజన మహిళల అభ్యర్థన మేరకు హైకోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. అయితే పోలీసులు తమకు సంబంధం లేదని, ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ఫోర్స్‌నిక్ డిపార్టుమెంట్ జారీ చేసిన ఒక లేఖను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు జరపాలని ప్రాసిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 13 మంది పోలీసులకు పరీక్షలు నిర్వహించాలని ఆ రిపోర్టును ఈనెల 30లోపు కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. -
ప్రేమికుడే చంపేశాడు..!
సాక్షి,చోడవరం(విశాఖపట్టణం): మండలంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని పద్మావతి(17) హత్య కేసులో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, జువైనల్‌హోంకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ కేవీ రమణ మీడియాకు తెలిపారు. ప్రియుడు రాజాప్రసన్నకుమార్ తన స్నేహితులు శ్రీనివాస్, సాయిశంకర్లతో కలసి పథకం ప్రకారం ఈ హత్య చేశాడని ఆయన చెప్పారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. పద్మావతి, ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజా ప్రసన్నకుమార్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు గర్భవతి అయిన విషయం తెలుసుకున్న రాజాప్రసన్నకుమార్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి పద్మావతి నిరాకరించడంతో ప్రియుడు రాజాప్రసన్నకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల సహకారంతో చోడవరం శివారులోని ఫారెస్టు డిపో సమీపంలోకి పద్మావతిని తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201,376,379, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. -
ప్రేమికుడి ఘాతుకం
విశాఖపట్నం, చోడవరం టౌన్: చోడవరం శివారు లక్ష్మీపురం రోడ్డులోని ఫారెస్టు డిపో సమీపంలో బుధవారం వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య సంఘటన పట్టణంతో పాటు మండలంలో సంచలనమైంది. దీపావళి పండుగ పూట అంతటా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిని పద్మావతిని ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజు ప్రేమిస్తున్నాడు. అతడే స్నేహితుల సాయంతో హత్య చేసి ఉంటాడని అంతా అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం కోటవీధికి చెందిన పిల్లల ఈశ్వరరావు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె పిల్లల పద్మావతి (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఎదురింటిలో ఉంటున్న మైనర్ బాలునితో ప్రేమలో పడింది. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి రాజు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సంఘటన స్థలంలో మృతదేహం వద్ద పోలీసులు, స్థానికులు ఆ తరువాత అంతా పార్టీ చేసుకున్నారు. బుధవారం ఫారెస్టు డిపో సమీపంలో బాలిక హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యచేశాక పెట్రోలు పోసి తగులబెట్టడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అక్కడ ఆనవాళ్లు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం వద్ద నుంచి పక్కనే ఉన్న తోటలు, ఖాళీ స్థలాల్లో తిరిగి సమీపంలో ఉన్న ఒక చర్చి వద్దకు వెళ్లి నిలిచిపోయాయి. కాగా, ఇంటిలో మంగళవారం రాత్రి పడుకున్న కుమార్తె తెల్లవారే సరికి కనిపించక పోవడంతో ఈశ్వరరావు, లక్ష్మీ దంపతులు చుట్టుపక్కల వెతుకుతున్న సమయంలో ఎవరో బాలిక హత్యకు గురైనట్లు గ్రామస్తులు చెప్పుకోవడంతో అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్లారు. సంఘటన స్థలంలోని ఆనవాళ్లు ప్రకారం తమ కుమార్తెవే అని గుర్తించారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అనకాపల్లి తరలించి విచారిస్తున్నారు. గురువారం అనకాపల్లి డీఎస్పీ వెంకటరమణ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను దోషులుగా ఇంకా నిర్ధారించలేదని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
నిప్పురవ్వ పడిందని కత్తితో దాడి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): బాణసంచా నిప్పు రవ్వ పడిందన్న నెపంతో ఒక యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. ఎంవీపీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజా లారిపేట కాలనీలో దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి యువకులు రోడ్లపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో అక్కడి ఆటోడ్రైవర్ చందనాల దాసు(30) కాల్చిన బాణసంచాకి సం బంధించిన నిప్పు రవ్వలు సమీపంంలోనే ఉన్న మదుపాన శ్రీనివాస్‌పై పడ్డాయి. దీంతో ఆగ్రహించిన శ్రీను తన వద్ద ఉన్న కత్తితో దాసు కడుపులో పొడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాసుని హుటాహుటిన 108అంబులెన్సులో కేజీ హెచ్‌కి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ఇద్ద రు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరి గింది. పది రోజుల క్రితం నిందితుడు శ్రీను సోదరుడు రాజుకి జ్వరం రావడంతో దాసు తండ్రి సత్తయ్య చేతబడి చేశాడంటూ అతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీను పాత గొడవ మనసులో ఉంచుకునే బాణసంచా నెపంతో దాడి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దాసు సోదరుడు పోలారావు ఫిర్యాదు మేరకు ఎంవీపీ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఐ.గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనులకు ప్రాణ సంకటం
విశాఖ సిటీ, సీలేరు: ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. తూటాల శబ్దాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఆధిపత్యం కోసం ఓవైపు మావోయిస్టులు చెలరేగుతుండగా.. మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో పోలీసులు వేటాడుతున్నారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను లివిటిపుట్టులో మావోయిస్టులు మట్టుబెట్టినప్పటి నుంచి సరిహద్దు ప్రాంతం రావణ కాష్టంలా మారిపోయింది. ఖాకీల బూట్ల చప్పుళ్లతో, తుపాకీ మోతలతో ఏజెన్సీ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. ఖాకీల నీడలోనే ఏవోబీ పరిధిలో ఉన్న గ్రామాలున్నాయి. లివిటిపుట్టు ఘటన తర్వాత.. దెబ్బకు దెబ్బ తీసేందుకు పోలీసులు సరిహద్దుల్లోనే మాటువేసి ఉన్నారు. గత నెల 12వ తేదీన ఏవోబీ కటాఫ్ ఏరియాలోని ఆండ్రవల్లి పంచాయితీ కేంద్ర అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ఉదయ్ భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ మీనాను హతమార్చిన పోలీసులు.. మరో ముగ్గురు మహిళా దళసభ్యుల్ని, ఓ మిలీషియా సభ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం ఏడు గంటలకే తుపాకీ మోతలతో చెంద్రుపల్లి అటవీ ప్రాంతం దద్దరిల్లింది. చంద్రుపల్లిలో మావోయిస్టులున్నారన్న సమాచారం తెలుసుకున్న ఒడిశా రాష్ట్ర సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో.. ముగ్గురు మావోయిస్టులతోపాటు ఇద్దరు గిరిజనులు మరణించారు. ప్రజాప్రతినిధుల్ని మావోయిస్టులు హతమార్చిన తర్వాత.. పోలీసు యంత్రాంగం ఏవోబీలో పట్టుకోల్పోయిందనే అంతా అనుకున్న నేపథ్యంలో.. తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసి వరుస ఎన్కౌంటర్లతో చెలరేగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌తో సరిహద్దుల్లో తమ ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందనే సంకేతాల్ని పోలీస్ బలగాలు మావోయిస్టులకు పంపించినట్లయింది. అయితే మావోయిస్టులు కూడా.. అదను చూసి ఎదురు దాడి చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా సరిహద్దు వాతావరణం కనిపిస్తోంది. నలిగిపోతున్న ఆదివాసీలు లివిటిపుట్టు ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో.. ఆదివాసీలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. మావోయిస్టులు ఓవైపు.. పోలీసు బలగాలు మరోవైపు.. గిరిపుత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎవరికి సహాయం చేసినా.. రెండో వర్గం విరుచుకుపడుతుండటంతో.. నోరు మెదపలేని పరిస్థితి, కాలు కదపని దుస్థితిలో భయం భయంగా గడుపుతున్నారు. ఎదురు కాల్పులు జరిగినప్పుడు పోలీసులు చనిపోయినా, మావోలు చనిపోయినా.. ఇరువర్గాలూ గిరిజనుల్నే టార్గెట్ చేస్తున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న హడావిడి జరిగినా.. బలవుతున్నది గిరిజనులేనన్నది తాజా ఘటనతో మరోమారు స్పష్టమైంది. దీనికి చంద్రుపల్లి ఘటనే ఉదాహరణ. సోమవారం ఉదయం అటవీ ప్రాంతానికి వచ్చిన కలిమెల దళం సభ్యులు.. తమకు అల్పాహారం కోసం కావాల్సిన నీటిని, సామగ్రిని పంపించాలంటూ గ్రామస్థులకు కబురు పెట్టారు. ప్రతి ఇంటిలోని ఓ మగ మనిషి రావాలని మావోయిస్టులు ఆదేశించారు. దీంతో చేసేది లేక ఏడుగురు గిరిజనులు వారికి కావాల్సిన పదార్థాలు తీసుకొని వెళ్లగా.. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు అమాయక గిరిజనులు బలయ్యారు. ఉలిక్కిపడ్డ ఏవోబీ సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా పప్పులూరు పంచాయతీ చంద్రుపల్లి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా ఆంధ్రా–ఒడిశా సరి హద్దులో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌తో రెండు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. చంద్రుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీరా ఆధ్వర్యంలో సంఘటన స్థలం నుంచి 3 కిలోమీటర్ల వరకు కొండమార్గంలో మోసుకుని రోడ్డుమార్గానికి తీసుకువచ్చి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ట్రాక్టర్లో తీసుకువచ్చారు. పప్పులూరు పంచాయ తీ వద్ద పోలీసు వాహనంలో భద్రతా బలగాలతో మల్కన్‌గిరి జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందడంతో వారిని గిరిజన గ్రామాల మధ్య తరలిస్తే ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అడవిమార్గంలో తీసుకువచ్చారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీరా ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం తెల్లవారుజాము 7 గంటలకు ఈ కాల్పులు జరగ్గా వైర్లెస్ సెట్ ద్వారా ఎస్పీకి తెలియజేశారు. దీంతో ఎస్పీ, ఇద్దరు ఎస్ఐలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సాయంత్రం 4.30 గంటల వరకు ఎస్పీ నిఘా పెట్టి అనంతరం మృతదేహాలను తరలించారు. తప్పించుకున్న అగ్రనేత రణదేవ్ మల్కన్‌గిరి జిల్లా కలిమెల దళం గత కొంత కాలంగా మల్క న్గిరి ప్రాంతంలో సంచరిస్తుంది. అగ్రనేత రణదేవ్(డిసిఎం) అసిస్టెంట్ కమాండెంట్‌తోపాటు మరో ఆరుగురు దళంగా ఉన్నారు. చంద్రుపల్లి గ్రామంలో వచ్చిన ఏడుగురు గుంపుగా ఒకే దగ్గర ఉండి టిఫిన్ వండుతున్న సమయంలో కాల్పుల జరిపారు. ఈ సమయంలో అగ్రనేత రణదేవ్ త్రుటిలో తప్పించుకుని సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రణదేవ్‌ను పట్టుకునేందుకు అయిదేళ్లుగా మావోయిస్టు ప్రభా విత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు. రణదేవ్ మీద లక్ష రివార్డు ఉంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పప్పులూరు పంచాయతీ మూడు కొండల మధ్య నివాసం ఉంటున్న చంద్రుపల్లి గ్రామస్తులు ఎన్కౌంటర్ జరగడంతో భయాందోళనలో పక్క గ్రామాలకు వెళ్లిపోయారు. -
నవ వధువు అదృశ్యం
విశాఖపట్నం, కె.కోటపాడు(మాడుగుల): నవవధువు అదృశ్యంపై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎ.కోడూరు ఏఎస్ఐ వీరభద్రరావు ఆదివారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన పట్నాల వీర్రాజు కుమార్తె సత్యవేణిని కొరువాడ గ్రామానికి చెందిన ములసాల ప్రసాద్‌కు ఇచ్చి గత నెల 18న వివాహం చేశారు. అయితే శనివారం సత్యవేణి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి పట్నాల కామేశ్వరి ఎ.కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ వీరభద్రరావు తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
విశాఖ, రోలుగుంట(చోడవరం): మండలంలో ఎంకే పట్నం శివారు సింగరాజుపేట సమీపంలో పెదపేట కూడలి వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని కొంతమంది ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన చింతల అప్పలనాయుడు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం శివారు సింగరాజుపేట సమీపంలో పెదపేట కూడలి దగ్గర గల తాటికొండ పార్వతికి చెందిన 71/1 సర్వే నంబర్లో గల సుమారు ఏడు ఎకరాల జామతోటను, గొలుగొండ మండలంలో గింజర్తికి చెందిన సుమారు ఆరు ఎకరాల జామతోటను ఆరు సంవత్సరాలుగా కౌలుకి చేస్తున్నాడు. తన కుమారుల్లో పెద్ద కుమారుడు సత్తిబాబుకు రోలుగుంట మండలం సింగరాజుపేట సమీపంలో గల జామతోటను, గొలుగొండ మండలం గింజర్తి గ్రామంలో గల జామ తోటను చిన్న కుమారుడు నానాజీ (30)కి అప్పగించాడు. వాటి ఫలసాయంతో వ్యాపారం చేస్తూ జోవనోపాధి పొందుతున్నా రు. సత్తిబాబు తన తమ్ముడు నానాజీకి కబురు చేసి, తాను ఊరు వెళ్తున్నానని తోట వద్ద కాపలాకు రావాలని కోరాడు. దీంతో నానాజీ బుధవారం సాయంత్రం 4 గంటలకు అన్న చూస్తున్న జామతోట వద్దకు వచ్చాడు. ఆ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఫోన్లో మాట్లాడుకున్నారు. పని ముగించుకుని గురువారం సత్తిబాబు జామతోట వద్దకు వెళ్లగా నానాజీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తలపై ఆయుధాలతో దాడి చేయడంతో మృతి చెందినట్టు గుర్తించి, తీవ్ర ఆందోళన చెంది, వెంటనే తన తండ్రికి కబురు చేశాడు. మృతుడి తల్లిదండ్రులు, భార్య ఇక్కడకు వచ్చి నానాజీ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తన రెండవ కుమారుడు చనిపోయిన విషయాన్ని అప్పలనాయుడు గురవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ సీహెచ్ హరికృష్ణ ... ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నర్సీపట్నం సీఐ రేవతమ్మకు తెలియజేసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీంచారు. స్థానికులను, మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహన్ని తరలించారు. మాకు దిక్కెవరు... నానాజీ మృతి విషయం తెలిసిన మర్రిపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మనిగిపోయారు. మృతుడికి భార్య, మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భర్త మరణంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు, తన కుమార్తెకు దిక్కు ఎవరని ఆమె రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. -
నగరంలో చైన్ స్నాచర్ల అలజడి
అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరంలో చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. డాబా గార్డెన్స్, మురళీనగర్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకునిపోయి పోలీసులకు సవాల్ విసిరారు. ముఖ్యంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, నగర పోలీస్ కమిషనరేట్‌కు మధ్యన చైన్‌స్నాచర్లు గురువారం ఉదయం అలజడి సృష్టించడం అందరినీ విస్మయపరిచింది. నిత్యం రద్దీగా ఉండే డాబాగార్డెన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం, బర్మాక్యాంపునకు చెందిన ఉండ్రాజనవరపు అన్నపూర్ణ డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎన్.ఆర్ స్కూల్లో గత 12 సంవత్సరాలుగా టీచరుగా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం 8.10గంటల సమయంలో ఆమె ఆటోలో స్కూలుకి బయలుదేరారు. డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎఫ్.ఖాన్ షాపు వద్ద ఆటో దిగి రోడ్డు దాటి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వీధిలో నుంచి ఎం.ఎన్.ఆర్ స్కూలుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆమె అదే వీధిలో గల పయనీర్ షూ షాప్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుగా వచ్చి ఆమె మెడలో గల తులమున్నర చైన్ తెంపుకుని పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె తేరుకునేలోపు దుండగులు ఆర్కే ఫ్యామిలీ షాపు వైపు వెళ్లిపోయారు. వారిలో వాహనం నడుపుతున్న వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి ఉండగా, వెనుక కూర్చున్న మరొక వ్యక్తి సాధారణంగా ఉన్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఈస్ట్ క్రైం సీఐ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని పయనీర్ చెప్పుల దుకాణం, ఇతర ఫర్నీచర్ షాపుల్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండుగులు ప్రయాణిస్తున్న వాహనం వివరాలు సేకరించారు. బాధతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినవారే.! గత నెలలో సుజాతనగర్, గోపాలపట్నం, బాలయ్యశాస్త్రి లే అవుట్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన వారే ప్రస్తుతం మహిళల మెడలోని చైన్లు తెంపుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాహనం నంబరు సీసీ కెమెరా దృశ్యాల్లో అస్పష్టంగా ఉందని తెలిపారు. దుండుగులు వాడిన వాహనం హోండా యూనికార్న్‌గా గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చి వెళ్తుండగా... ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ వైభవ వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకునిపోయారు. మురళీనగర్‌కు చెందిన లక్ష్మీ కొండమ్మ(45) గురువారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక వైభవ వేంకటేవ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆలయానికి సమీపంలోనే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెల తాడు తెంపుకునిపోయారు. జరిగిన ఘటనపై కంచరపాలెం నేర విభాగం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్ఐ కుమార్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారులపై ‘గంజాయి’ పంజా
గంజాయి వ్యాపారుల దందా పరాకాష్టకు చేరింది. కారులో సరకును దాచిన విషయం బయటపడుతుందన్న భయంతో వేగంగా కారును వెనక్కుతిప్పడంతో.. కొయ్యూరు మండలం గదబపాలెం ప్రాథమిక పాఠశాలలోకి దూసుకుపోయింది. దీంతో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేశారు. అదృష్టవశాత్తూ గోడ అడ్డుగా నిలవడంతో చిన్నారులకు పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం , కొయ్యూరు: బడి అప్పుడే మొదలైంది. విద్యార్థులు పుస్తకాలు చేతబట్టి ఉపాధ్యాయుడి పాఠాలు వింటున్నారు. అంతలోనే పెద్ద శబ్దం. పాఠశాల గోడను ఢీకొట్టి లోనికి దూసుకొచ్చిన కారు విధ్వంసం సృష్టించింది. కారు రివర్స్‌గేర్ వేసి లాగించడంతో పాఠశాల వెనక గోడ పడిపోయింది. గోడను ఆనుకుని ఉన్న ఏడుగురు విద్యార్థులపై గోడపెచ్చులు పడిపోయాయి. వారికి గాయాలు కావడంతో వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు స్వల్పం కావడంతో ప్రాథమిక చికిత్స చేసి పాఠశాలకు తరలించారు. ఇదీ అసలు విషయం.. చింతపల్లి ప్రాంతం నుంచి కారులో గంజాయి తరలిపోతున్నట్టు నర్సీపట్నం పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. పోలీసులు మాటు వేసిన సమాచారాం గంజాయి స్మగ్లర్లకు తెలిసిపోవడంతో నర్సీపట్నం వెళ్లకుండా కారును కొయ్యూరు మండలం మర్రిపాలెం నుంచి గదబపాలెం వరకు తీసుకువచ్చారు. అదే సమయంలో గంజాయి కారు గొలుగొండ వైపు వస్తున్నట్టుగా సమాచారం రావడంతో గొలుగొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి కారును ఎక్కడో దాచిన వ్యక్తులు బుధవారం ఉదయం గదబపాలెం పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. గ్రామస్తులకు అనుమానం వచ్చి కారు వద్దకు బయలుదేరారు. దీనిని గమనించిన స్మగ్లర్లు వెంటనే కారును తీయాలని భావించి రివర్స్‌గేర్ వేశారు. దీంతో పాఠశాల భవనం గోడ పడిపోయింది. గ్రామస్తులు దగ్గరకు వస్తే పట్టుకుంటారన్న భయంతో కారును వదిలిపెట్టి పారిపోయారు. ఆ కారు మరింత వెనక్కు వచ్చి ఉంటే విద్యార్థులను ఢీకొట్టి పెను ప్రమాదం జరిగివుండేది. బీభత్సం.. గందరగోళం హఠాత్తుగా ఈ విధ్వంసం చోటు చేసుకోవడంతో అందరూ పరుగులు తీశారు. స్థానికుల కథనం ప్రకారం గదబపాలెం పాఠశాల వద్దకు బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఏపీ31 బీఎస్ 3814 నెంబర్ కలిగిన కారు వచ్చింది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు రివర్స్‌గేర్ వేయడంతో వెనకనున్న పాఠశాల గోడను ఢీకొట్టింది. దీంతో గోడ పడిపోయింది. గోడను ఆనుకుని ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో దుండగులు కారును అక్కడ వదిలి పారిపోయారు. స్థానికులు సమాచారం ఎంఈవో బోడంనాయుడుకు అందించడంతో ఆయన హుటాహుటిన పాఠశాలకు వచ్చారు. గాయపడిన విద్యార్థులను వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తరువాత సమాచారం కొయ్యూరు పోలీసులకు అందజేశారు. పాఠశాల గోడను ఢీకొట్టి దుండగులు వదిలేసిన కారులో గంజాయి ఉన్నట్టుగా సమాచారం వచ్చిందని కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ బుధవారం సాయంత్రం తెలిపారు. దీనిపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయాలని ఎస్ఐను ఆదేశించామన్నారు. కారు ఎవరిది.. దానిని తీసుకువచ్చిన వ్యక్తులు ఎవరన్నది విచారణలో తేలుతుందన్నారు. -
చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్
విశాఖ క్రైం: వరుస దొంగతనాలతో నగర ప్రజలను హడలెత్తిస్తున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. చెడ్డీ బనియన్ ముఠాతో పాటు పలు చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 750 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 లక్షల విలువ గల 31 టన్నుల ఐరాన్ రాడ్స్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం విలేకర్లతో సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసుల అదుపులో నలుగురు చెడ్డీ ముఠా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా నగర శివారు ప్రాంతాలలో రాత్రి పూట ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఈ గ్యాంగ్‌ను పట్టుకుని, వారి వద్ద నుంచి 265 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో దాహోద్ జిల్లా సహద గ్రామానికి చెందిన రామబాద్రియ, కిషన్ బాద్రియ, రావొజి బాద్రియ, గనవ భారత్‌సింగ్ అరెస్టయిన వారిలో ఉన్నారు. గాజువాకలో.. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట ఇంటి తలుపులు బద్దలకొట్టి చోరీ చేసిన కేసులో తాటిచెట్లపాలేనికి చెందిన అడపాక జీవరత్నం(అలియాస్ జపనీ)ని అరెస్ట్ చేసి, ఆయన నుంచి రూ.46వేను విలువ గల బంగారం, మరో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ♦ మరో 10 కేసులను ఛేదించి రూ.56.35 లక్షలు విలువ గల చోరీ సొత్తును రికవరీ చేశారు. ♦ అలాగే జీడిపిక్కల బస్తాలు దొంగతనం కేసులో 9 మంది అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.27.5 లక్షల విలువైన 250 జీడిపిక్కల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ♦ ఇంటి దొంగతనం కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.68 వేలు రికవరీ చేశారు. ♦ మరో కేసుల్లో దేవాడ కనకప్రసాద్, మంతినగురు నాయుడుతోపాటు మరో ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 31 టన్నుల ఐరాన్ రాడ్స్‌ను రికవరీ చేశారు. ఎండేటి గంగపై 100 కేసులు కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ఎండేటి గంగ, ఆమె తల్లి ఎండేటి మంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కేసులకు సంబంధించి 36 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎండేటి గంగపై 100 కేసులు ఉన్నాయి. కంచరపాలెం బర్మా క్యాంపులో నివాసం ఉండేవారు. ఇటీవల విజయవాడలోని సింగ్‌నగర్‌కు మకాం మార్చారు. గతంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఇళ్లల్లో చోరీ కేసుల్లో అరెస్ట్ చేశారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీసీ షీట్ ఉంది. అలాగే వీరిపై నాన్ బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తం అన్ని కేసుల్లో నిందితుల నుంచి 750 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండి, రూ.8వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ జోన్–2(క్రైం) పాల్గుణరావు, సీఐలు ఎన్.సాయి, పైడిపునాయుడు, ఎస్ఐ జె.డి.బాబు పాల్గొన్నారు. -
ఐటీఐ విద్యార్థి బలవన్మరణం
పీఎంపాలెం(భీమిలి): చదువు పట్ల నిర్లక్షం చేయొద్దని తండ్రి చెప్పడంతో అవమానంగా భావించిన ఓ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతానికి చెందిన కొండపల్లి లక్ష్మణ ఇక్కడి ఇక్కడి ఆర్‌హెచ్‌కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కిరణ్ (18)ఉన్నారు. కిరణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఐటీఐలో చదువుతున్నాడు. చదువు పట్ల నిర్లక్ష్యం చేయొద్దని, బోలెడు ఫీజులు చెల్లించి చదివిస్తున్నామని మంగళవారం రాత్రి తండ్రి లక్ష్మణ కిరణ్‌ను మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన కిరణ్ అందరూ నిద్రపోయిన తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలపడ్డాడు. బుధవారం ఉదయం ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా మృతిచెందడంపై అంతా తల్లడిల్లిపోయారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు పంపించామని, తండ్రి లక్ష్మణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. -
ఓ కారు... నాలుగు నంబర్లు
పెదబయలు(అరకులోయ): ముంచంగిపుట్టలో నాలుగు వేర్వేరు నంబర్లతో తిరుగుతున్న ఓ కారును పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఈ కారును ఆపగా అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారని ఎస్ఐ అరుణ్‌కిరణ్ తెలిపారు. కారును తనిఖీ చేసి, స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఏపీ, మహారాష్ట్రకు చెందిన నాలుగు నంబర్ప్లేట్లతో ఈ కారు తిరుగుతున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ 31బి 9229, మహారాష్ట్ర 20బీసీ 2794తో పాటు మరో రెండు నంబర్ ప్లేట్లు ఈ కారులో ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. ఈ కారు గంజాయి స్మగ్లర్లదా? లేక ఇతర పనులకు ఉపయోగిస్తున్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు కావాలా... రూ.12 లక్షలు కావాలా..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఎవరైనా హఠాత్తుగా ఫోన్ చేసి నీకు టాటా సఫారీ కారు కావాలా... పన్నెండు లక్షలు నగదు కావాలా... అని అడిగితే ఏమంటారు... ముందూ వెనుకా ఆలోచించకుండా కచ్చితంగా ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. అలాగే ఓ యువకుడు అపరచితుని ఫోన్ ఉచ్చులో పడి వేల రూపాయలు నష్టపోయి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నం లక్ష్మీనగర్‌కు చెందిన కుప్పా ఆనంద్ అనే యువకుడు సమోసాలు అమ్ముకుని కుటుంబానికి దన్నుగా ఉంటున్నాడు. ఆ యువకుడు సంపాదనలో కొంత మొత్తాన్ని బ్యాంకులో భద్రపరచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం షాప్‌క్లూస్ షాపింగ్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆ యువకుడికి ఫోన్ వచ్చింది. అప్పటికే ఆ యాప్ ద్వారా పలు రకాల సామగ్రి కొంటుండడంతో ఆ యువకుడు తనకు వచ్చిన ఫోన్‌ని అనుమానించలేదు. మీరు ఇంత వరకూ కొనుగోలు చేసిన వాటికి సబంధించి మీకు కారు డ్రా పలికింది. మీకు టాటా సఫారీ కారు కావాలా..? లేక రూ.12లక్షలు నగదు కావాలా..? అని అడగడంతో ఆనంద్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తర్వాత అదే నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. మీకు కావాల్సిన డబ్బులు అంత మొత్తంలో విడుదల చేయాలంటే ముందుగా పన్నులు చెల్లించాలని చెప్పడంతో నిజమేనని నమ్మేసిన ఆనంద్ తన బ్యాంకు అకౌంట్ నుంచి వారు సూచించిన రెండు అకౌంట్ నంబర్లకు రూ28,600లు బదిలీ చేశాడు. తర్వాత అనుమానం వచ్చి ఆనంద్ సంబంధిత షాప్‌క్లూస్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే తాము అలాంటి డ్రాలు తీయడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ యువకుడు కళ్లు తేలేసేశాడు. తాను దారుణంగా మోసపోయానంటూ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ సీఐ పైడియ్య ఎదుట వాపోయాడు. మోసగాడు ఫోన్ ప్రకారం ట్రూ కాలర్ పరిశీలిస్తే లక్కీ డ్రా కాంటెస్ట్ అని చూపుతోంది. ఫోన్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లుగా, అకౌంట్ నంబర్లు ఢిల్లీకి చెందినవిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మూడో వార్డు రవీంద్రనగర్ ప్రాంతం ఎస్.ఐ.జి.నగర్లో మల్లేటి వెంకటలక్ష్మి అలియాస్ సంతోషి(27), రాజు కుటుంబం నివాసముంటోంది. సూమారు ఐదేళ్ల కిందట ఎస్.ఐ.జి.నగరానికి చెందిన రాజుకు, సింహాచలం ప్రాంతం ప్రహ్లాదపురానికి చెందిన వెంకటలక్ష్మికి వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. రాజు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహం రాజు పనికి వెళ్లిన సమయంలో వెంకటలక్ష్మి ఇంటి లోపల నుంచి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమెతో పాటు పక్కనే ఉన్న ఏడాది కుమార్తె కొంతసేపటికి ఏడవడంతో ఏం జరిగిందో తెలియని చుట్టుపక్కల వారు తలుపులు పగలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఆమె చీరతో ఉరి వేసుకొని కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆరిలోవ సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు పాపారావు, శ్యామలరావు, సిబ్బంది అక్కడకు చేరుకొన్నారు. వెంకటలక్ష్మి ఉరి వేసుకొన్న తీరు పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా తన కుమార్తెను భర్త రాజు, అత్త సీతమ్మ, బావ శ్రీనివాస్, తోటికోడలు కాశీ ఉరివేసి చంపేశారంటూ మృతురాలి తల్లి సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను నడిరోడ్డుపై హతమార్చిన భర్త
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను నడిరోడ్డుపై పాశవికంగా హత్యచేశాడు. ఒకటో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ పరిధి 26వ వార్డు పండావీధిలో వడిసెల మోహన్‌రావు, భార్య నాగమణి, పిల్లలు దుర్గారావు (13), హంసిక (11)లతో కలిసి జీవిస్తున్నాడు. వీరిరువురు 2004లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. మోహన్‌రావు టౌన్ కొత్తరోడ్డులో ట్రాన్స్‌పోర్టు కలాసీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో భార్య నాగమణి మూడేళ్లుగా సిరి పురం ఉడా భవనంలో ఉన్న ఫుడ్ ఎక్స్ దుకాణంలో పండావీధికి చెందిన కొందరు మహిళలతో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఇద్దరి మధ్య నాలుగైదు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తాము నివసించే ఇంటికి సమీపంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పిల్లలను తీసుకుని నాగమణి వెళ్లిపోయింది. అదే సమయంలో మోహన్‌రావు సెల్ కనిపించకుండా పోయింది. అనంతరం అది భార్య నాగమణి వద్ద దొరికింది. అయితే తన ఫోన్లో తాను వేసిన సిమ్‌కు బదులు మరొక సిమ్ ఉండడంతో తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని మోహన్‌రావు అనుమానించాడు. ఈ విషయంపై రెండు సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నాగమణిని భర్త వద్దకు పంపారు. అప్పటికి తగువు చల్లబడ్డా తరువాతి కాలాంలో మరలా మనస్పర్థలు బయలు దేరాయి. నడిరోడ్డుపై పాశవికంగా పొడిచి... ఈ నెల 25న రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో మోహన్‌రావు తన భార్యను చంపేస్తానని బెదిరించడంతో భయపడిన నాగమణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాగమణి పనిచేస్తున్న ఫుడ్ఎక్స్కు ఈ నెల 27న (శనివారం) రాత్రి మోహన్‌రావు వెళ్లాడు. భార్య వచ్చేవరకూ ఎదురు చూసి నాగమణితో పాటు అక్కడ పనిచేస్తున్న పండావీధికి చెందిన మహిళలతో పాటుగా ఆటోలో పాత నవరంగ్ థియేటర్ వద్దకు చేరుకున్నాడు. సుమారు 11.30 గంటలకు ఆటో దిగిన తరువాత భార్యను తనతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తూనే తన వద్ద దాచుకున్న కత్తితో దాడిచేసి ఛాతీ, కడుపు వంటి సున్ని త ప్రాంతాల్లో 8 వరకూ పోట్లు పోడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తమకు సమీపంలో జరిగిన దారుణాన్ని వారితో పాటు వచ్చిన మహిళలు చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో పడి నాగమణి ఘటనా స్థలంలోనే మరణించింది. అయితే మోహన్‌రావు తల్లి అప్పలనర్సమ్మ ప్రోద్బలం వల్లనే భార్యను క్షణికావేశంలో హత్య చేశాడన్న ఆరోపణ ఆ ప్రాంతంలో బలంగా విని పిస్తోంది. సమాచారం అందుకున్న ఒకటో పట్ట ణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీ సుకున్న పోలీసులు ఏసీపీ రంగరాజు ఆధ్వర్యం లో సీఐ ఉమాకాంత్ బృందం విచారిస్తున్నారు. -
వేధింపుల కేసులో బాక్సర్‌కు జైలుశిక్ష
విశాఖపట్నం, పీఎంపాలెం(భీమిలి): బాక్సింగ్ క్రీడలో పతకాలు తీసుకు వచ్చిన యువకుడు కట్టుకున్న భార్యకు ప్రేమాభిమానాలు కనబరచడంలో విఫలమయ్యాడు. వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భర్త గొప్ప క్రీడాకారుడని ఎంతో మురిసిపోయిన యువతికి నరకం చూపించాడు. కట్న పిశాచిలా మారాడు. అమ్మాయి తరఫువారు ఎంతగా ప్రాధేయ పడినా.. అడిగినప్పుడల్లా కానులు సమర్పించినా మనసు కరగలేదు. బాక్సర్ అయిన భర్త పెట్టే హింసలు తాళలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిది. కేసును విచారించిన భీమిలి న్యాయ స్థానం నేరం రుజువవడంతో వీరోతి సంతోష్‌కుమార్ అనే అంతర్జాతీయ బాక్సర్తో పాటు ఇదే కేసులో మరో ముగ్గురు కుటుంబసభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ. 2500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ. కె.లక్ష్మణమూర్తి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట సాయిమాధవ్నగర్కు చెందిన వీరోతి సంతోష్‌కుమార్ (27)అంతర్జాతీయ స్థాయి బాక్సర్. ఆసియాడ్‌లో పతకాలు సాధించాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.అతని క్రీడా ప్రతిభను కేంద్రప్రభుత్వం గుర్తించి ఆర్మీ లో సుబేదార్ హోదా ఉద్యోగం ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మధురవాడకు చెందిన వి.మారుతీ ప్రసాద్ తన కుమార్తె మణిరత్నానికి బాక్సర్ సంతోష్ కుమార్‌కు 2014 డిసెంబరు 12న వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. వధువు కన్నవారు ఉన్నంతలో కట్నకానుకలు, కారు సమర్పించారు. అయినా సంతోష్‌కుమార్‌కు అతని తండ్రి విశ్వనాథంకు కట్నం దాహం తీరలేదు. నిత్యం అదనపు కట్నం కోసం వేధించేవారు. సూటి పోటి మాటలతో హింసించేవారు. పండగలు, పబ్బాలకు కన్నవారింటికి పంపించేవారు కాదు.నరకం చూపించేవారు. కుమార్తెకు పెట్టే హింసలు చూసి కన్నవారు అక్కున చేర్చుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు 2016 ఆగస్టే 23న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం భీమిలి కోర్టులో చార్జిషీటు దాకలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో భీమునిపట్నం 16వ అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ బాక్సింగ్ క్రీడాకారుడు సంతోషకుమార్, అతని తల్లిదండ్రులు విశ్వనా«థం,ఈశ్వరమ్మతో పాటు సోదరుడు భాను అప్పలగణేష్(అలియాస్ గణేష్‌ల)కు వరకట్న నిషేధ చట్టం కింద, 498 కింద ఏడాది జైలుశిక్ష, రూ. 2500లు వంతున జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారని సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. -
ఆన్లైన్లో మోసం
ఏయూ క్యాంపస్(విశా ఖ తూర్పు): భారీ ఆఫర్లతో ముంచెత్తారు. వాటిని నిజమని నమ్మిన ప్రజలు ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేశారు. తీరా చేతికి వచ్చిన కొరియర్‌ను తెరిచి చూస్తే పనికిరాని వస్తువులు దర్శనమిచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగి చంద్రాన శశికాంత్‌కు ఈ సంఘటన ఎదురైంది. కొద్ది రోజుల క్రితం పేటీఎం మాల్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ప్రకటనలు జారీ చేశారు. దీనిని చూసిన శశికాంత్ శామ్సంగ్ బ్లూటూత్ పరికరం ఆన్లైన్లో కొనుగోలు చేశారు. గురువారం సాయంత్రం వచ్చిన కొరియర్‌ను తెరిచి చూడగా అందులో పనికిరాకుండా, వినియోగించిన, నాసిరకం బ్లూ టూత్ పరికరం దర్శనమిచ్చింది. దీంతో తాను మోసపోయానని, దీనిపై సదరు సంస్థకు ఫిర్యాదు చేస్తానని శశికాంత్ “సాక్షి’కి తెలిపారు. ఇటువంటి చర్యలతో వీటిపై నమ్మకం పోతుందని, భవిష్యత్‌లో కొనుగోలు చేయాలంటే భయం వేస్తుందన్నారు. -
తండ్రీకొడుకుల దారుణ హత్య ఆపై దహనం
డుంబ్రిగుడ(అరకులోయ): చెరువు తవ్వే విషయంలో ఏర్పడిన వివాదం తండ్రీకొడుకుల హత్యకు దారితీసింది. వైద్యం కోసం బైక్‌పై వెళ్తున్న వారిద్దర్నీ కొసిగుడ గ్రామస్తులు కొందరు బుధవారం రాత్రి కర్రలతో దారుణంగా కొట్టి హత్య చేయడమే కాకుండా, మృతదేహాలను దహనం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొర్రాయి పంచాయతీ కొసిగుడ గ్రామంలో నాలుగు సెంట్ల భూమిలో చెరువు తవ్వేందుకు ఉపాధి హామీ పథకం కింద గ్రామస్తులు అనుమతి పొందారు. ఆ భూమి గోపాల్పేరు మీద ఉందని, గ్రామస్తులు దరఖాస్తు చేయడంతో చెరువు తవ్వడానికి అనుమతి ఇచ్చామని వీఆర్పీ ప్రకాష్ తెలిపారు. అయితే పక్క స్థలంలో ఒక సెంటులో ఇప్పటికే గ్రామానికి చెందిన చెందిన తండ్రీకొడుకులైన గెమ్మెలి మోహన్‌రావు(45),కుమారుడు గెమ్మెలి అప్పారావు(26)లు కొండచీపుళ్ల పంట వేశారు. వారికి భూమి లేకపోవడంతో స్థానిక అధికారుల అనుమతితో ఈ పంట వేశారు. బుధవారం ఆ గ్రామస్తులు చెరువు తవ్వకాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ భూమిలో కొండచీపుళ్ల పంట ఉంది , అది పాడైపోతుందని మోహనరావు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వివాదం జరగడంతో గ్రామస్తులు కొందరు అతనిపై కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న కొడుకు గెమ్మెలి అప్పారావు వచ్చి అడ్డుకోబోయాడు. అతన్ని కూడా కొట్టారు.దీంతో వారిద్దరు ఇంటికి వెళ్లిపోయారు. గాయలపాలైన మోహన్‌రావును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అప్పారావు బైక్ మీద బయలుదేరాడు. అయితే వారు గ్రామం విడిచి వెళ్లడానికి అంగీకరించని స్థానికులు మళ్లీ గొడవ పడ్డారు. తండ్రీకొడుకులపై కర్రలతోదాడి చేశారు. దీంతో వారిద్దరూ మృతి చెందినట్టు మృతుడు మోహనరావు భార్య కన్నమ్మ తెలిపింది. అనంతరం వారి మృతదేహాలను గ్రామస్తులు దహనం చేశారని చెప్పింది. నాపైనా హత్యా యత్నం నా భర్త, పెద్ద కుమారుడిని దారుణంగా కొట్టి చంపిన గ్రామస్తులు నన్ను కూడా కొట్టి చంపేం దుకు యత్నించారని కన్నమ్మ తెలిపింది. నాకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా రు. అందులో అప్పారావు పెద్ద కుమారుడని చెప్పింది. భర్తని, కుమారుడిని దారుణంగా హత్య చేసిన వారు తమను కూడా కర్రలతో కొట్టారని వారి నుంచి తప్పించుకుని పరుగులు తీసి రాత్రికిరాత్రికి అరకులోయ మండలం పనకగుడ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నామని తెలిపింది. డుంబ్రిగుడ మండల పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వారు వెంటనే స్పందించి ఉంటే కనీసం చివరిచూపు చూసేందుకు మృతదేహాలైనా ఉండేవని తెలిపింది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో గ్రామస్తులు మృతదేహాలను దహనం చేశారని చెప్పింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె వేడుకుంది. పథకం ప్రకారమే .. ఈ హత్యలు పథకం ప్రకారం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని గురువారం అరకు సీఐ కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రీ కొడుకులపై అదే గ్రామానికి చెందిన 12 మంది దాడి చేసినట్టు చెప్పారు. నిందితుల్లో డొంబు,అర్జున్త్రినాథ్ అనే వ్యక్తులు ముందుగా దాడిచేసినట్టు నిర్ధారించారు. 12 మందినీ అదుపులో తీసుకుని విచారణ చేస్తామని చెప్పారు. గెమ్మెలి మోహన్‌రావు, గెమ్మెలి అప్పారావుకు గ్రామస్తులకు మధ్య భూ తగాదాలు ఉండేవని, ఆ నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగిన ఉంటాయని తెలిపారు.నిందితులు పరారీలో ఉన్నారని, వారి అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు. -
అయ్యో.. ఎంత ఘోరం
విశాఖ క్రైం: విధి చాలా కర్కషంగా కాటేస్తుంది. అనూహ్యంగా మృత్యు ఒడిలోకి లాక్కుపోతుంది. అటువంటి ఘోరమే ద్వారకానగర్ కూడలికి సమీపంలో ఏఎన్నార్ షాపింగ్ మాల్ ఎదుట బుధవారం జరిగింది. డివైడర్ దాటుతుండగా తూలి వెనక్కు పడిన యువకుడిపై నుంచి బస్సు వెళ్లిపోయిన దుర్ఘటనలో ఆ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆనందపురం మండలం బాకురుపాలెం ప్రాంతానికి చెందిన లండా అరుణకుమార్(18) ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షల కోసం స్వస్థలం నుంచి బస్సులో వచ్చి ద్వారకానగర్‌లోని వికాస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నాడు. రోజూ మాదిరిగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి వెళ్లడానికి ఆర్టీసీ కాం ప్లెక్స్‌లో దిగాడు. స్నే హితుడు రావడం ఆలస్యం కావడంతో ఒక్కడే నడుచుకుంటూ ద్వారకానగర్ ట్రాఫిక్ సిగ్నల్ కూడలి దగ్గరకు చేరుకున్నాడు. సరిగ్గా ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా డివైడర్‌ను దాటడానికి ఒక అడుగు వేశారు. రెండో కాలు వేసేలోపు తూలి వెనక్కు పడిపోయాడు. అదే సమయంలో ఆ మార్గంలో కాంప్లెక్స్ నుంచి గాజువాక వెళ్తున్న ఆర్టీసీ బస్సు (38 వై) ఏపీ31 టిఎఫ్ 3336) రావడంతో దాని కింద పడిపోయాడు. దీంతో తల వెనుక భాగం నుజ్జయి తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ద్వారకా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజు వెంటనే సమీపంలోని కళా ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్ ఐ కాంతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలు సుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వదినతో వివాహేతర సంబంధం.. యువకుడి హత్య
విశాఖపట్నం, పెదబయలు(అరకులోయ): మండలంలోని పెదకోడాపల్లి గ్రామ సమీపంలో గ్రామానికి చెందిన మండి అనీల్‌కుమార్(30)అనే యువకుడి గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. దీనికి సబం« దించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం పెదకోడాపల్లికి చెందిన మండి అనీల్‌కుమార్ కొన్నేళ్ల పాటు పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు(నర్సరీ పక్కన) తన అన్న వదినలు మండి రామకృష్ణ, అమ్మలు ఇంట్లో నివాసం ఉన్నాడు. గత ఏడాది భారీగా ఖర్చు చేసి అనీల్‌కుమార్‌కు అన్న వదినలు వివాహం చేశారు. ఏడాది పాప కూడా ఉంది. ఇటీవల కుటుంబ గొడవల వల్ల అవి తగ్గేంత వరకు కుమార్తెతో సహా తన భార్య కుమారిని అనీల్‌కుమార్ ఆమె పుట్టింటికి పంపాడు. పెదకోడాపల్లి గ్రామంలో ఉన్న వరుసకు మేనబావ అయిన కొమ్మ గోపాల్‌రావు ఇంట్లో నెల రోజులుగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం నుంచి ఇంటికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటాడని అనుకున్నామని గోపాల్‌రావు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సమీ పంలోని ప్రాథమిక పాఠశాల వరండాలో ఎవరో పడుకుని ఉన్నారని మంగళవారం ఉదయం స్థానిక పిల్లలు సమాచారం అందించారని కొమ్మ గోపాల్‌రావు తెలిపాడు. వెళ్లి చూడగా రక్తం మడుగులో అనిల్‌కుమార్ మృతి చెంది ఉన్నాడని చెప్పా రు. తన అల్లుడ్ని దారుణంగా హత్య చేసిన నింది తుల్ని పట్టుకుని ఉరి తీయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పెడకోడాపల్లి, కుమ్మరిపుట్టులో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పథకం ప్రకారం హత్య అనీల్‌కుమార్ హత్య పథకం ప్రకారం జరిగినట్టు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఐదు క్వార్టర్ ఎంసీ బాటిళ్లు, నాలుగు బీరుబాటిళ్లు, మరో మద్యం బాటిల్ సంఘటన స్థలానికి సమీపంలో ఉన్నా యి. హత్య జరిగిన సమయంలో అక్కడ ఐదుగురు మద్యం తాగినట్టు డిస్పోజబుల్ గ్లాసుల బట్టీ తెలుస్తోంది. అనీల్‌కుమార్‌ను కూడా పూట గా మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేసి ఉంటారనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధమే కారణమా? వరుసకు వదిన అయిన మహిళతో ఇతనికి వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. కుటుంబ గొడవలు, ఇతర కారణాల వల్ల నెల రోజుల క్రితం ఇతని అన్నయ్య,వదిన మండి రామకృష్ణ,అమ్మలు కలిసి అనీల్‌కుమార్‌పై పాడేరు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి అనీల్‌కుమార్ తన భార్య కుమారి, పాపను పుట్టింటికి పంపి తన మేనమామ ఊరు పెదకోడాపల్లిలో ఉంటున్నా డు. అయితే అనీల్‌కోసం రామకృష్ణ ఐదు సార్లు ఫోన్ చేశాడని గోపాల్‌రావు తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా హత్య జరిగిందా? లేద ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం మృతదేహాన్ని పాడేరు తరలించి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. పాడేరు సీఐ అప్పలనాయుడు, పెదబయలు ఎస్ఐ రామకృష్ణారావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘొల్లుమన్న జి.వెంకటాపురం
విశాఖపట్నం, మాకవరపాలెం : ఒకే గ్రామంలో ఏడుగురు మరణించడం ఆ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించడం తీవ్ర విషాదాన్ని నింపింది. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో జీ వెంకటాపురం గ్రామం గొల్లుమంది. సోమవారం కాకినాడలో గృహ ప్రవేశ కార్యక్రమానికి టాటా మేజిక్ ఆటోలో వెళ్లి వస్తుండగా చేబ్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీ వెంకటాపురం గ్రామానికి చెందిన సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు జీ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్(34), కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన నాగరాజు(42) మృతి చెందడం ఈ రెండు గ్రామాల ప్రజలను కలచివేసింది. కూలి పనులే ఆధారం.. జీ.వెంకటాపురం గ్రామం సమీపంలో నిర్మించిన అన్‌రాక్ రిఫనరీ కోసం ఇక్కడి భూములు సేకరించారు. మృతులంతా ఈ భూ సేకరణలో భూములు కోల్పోయిన వారే. దీంతో పదేళ్లుగా వీరంతా కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సబ్బవరపు నూకరత్నం భర్త అప్పనాయుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తల్లులకు దూరమైన పిల్లలు... ప్రమాదంలో ఒకే గ్రామంలో ఏడుగురు మహిళలు మృతి చెందడంతో వారి పిల్లలు తల్లులకు దూరమయ్యారు. వరహాలమ్మకు ఒక కూతురు, కొడుకు ఉండగా కుమార్తెకు వివాహం చేసింది. ఇక మహాలక్ష్మి భర్త మరణించాడు. ఉన్న ఒక కూతురుకి వివాహం చేసినా ఆమెను భర్త వదిలేయడంతో మహాలక్ష్మి కూలి పనులు చేస్తూ కూతురు, మనుమరాలిని పోషిస్తోంది. పైల లక్ష్మి ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసింది. అచ్చియ్యమ్మ ఒక కూతురికి వివాహం చేసింది. కొడుకు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. గవిరెడ్డి రాముకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు వికలాంగురాలు, రాము వృద్ధ తల్లిదండ్రులు కూడా ఈమె వద్దే ఉంటున్నారు. ఇక వీరి బాగోగులు చూసుకునే వారెవరంటూ స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పైడితల్లికి కూతురికి వివాహం చేయగా, కొడుకు చదువుకుంటున్నాడు. వారికి దిక్కెవరో... ఆటో డ్రైవర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఈ చిన్నారులకు దిక్కెవరోనని స్థానికులు కన్నీటిపర్వంతమయ్యారు. నూకరత్నంకు కూడా ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. వీరు చదువుకుంటున్నారు. వీరు కూడా తల్లిలేని పిల్లలయ్యారు. దీంతో గ్రామస్థులంతా మృతుల ఇళ్ల వద్దకు చేరుకుని విలపించారు. తల్లులను కోల్పోయిన పిల్లలను ఓదార్చారు. మృతదేహాలు ఎప్పుడు గ్రామానికి చేరుకుంటాయోనని ఎదరుచూస్తున్నారు. -
టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
విశాఖపట్నం, పిఠాపురం, గొల్లప్రోలు: ‘‘మా ఇంటి వీరభద్రుని సంబరం.. మీరందరూ తప్పని సరిగా రావాలి’’ అని చెప్పగానే వారందరూ ఎంతో సంతోషపడ్డారు. ఓ వాహనాన్ని పురమాయించుకుని మరీ బయల్దేరారు. ఇక బంధువుల ఇంట సంబరం వేడుకలో ఆనందంగా గడిపారు. భోజనాలు పూర్తి చేసుకుని వెళ్లొస్తామంటూ వీడ్కోలు చెప్పారు. అయితే అవే వారి చివరి వీడ్కోలని ఎవరూ ఊహించలేదు. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. కాకినాడకు చెందిన కె.అప్పారావుకు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి.వెంకటాపురానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వారు కాకినాడలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేసుకున్నారు. అప్పారావు తన భార్య తరఫు బంధువులను శుభకార్యానికి భోజనాలకు పిలిచారు. దీంతో ఆమె బంధువులు 18 మంది టాటా మేజిక్ వాహనాన్ని పురమాయించుకుని అక్కడి నుంచి బయల్దేరి కాకినాడ చేరుకున్నారు. వీరందరూ కూలీలే. చాలా కాలం తర్వాత తమ ఇంటి ఆడపడుచును చూస్తున్నామనే సంతోషంలో వారందరూ ఉన్నారు. వీరభద్రుని సంబరాన్ని తిలకించారు. భోజనాలు కూడా పూర్తి చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం 16 మంది తిరిగి అదే వాహనంలో బయల్దేరారు. వారు వెళుతున్న వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో ఓ టిప్పర్ ఢీకొట్టింది. మట్టి లోడుతో వెళుతున్న ఈ టిప్పర్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి అదే దారిలో వెళుతున్న మేజిక్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ఇద్దరూ మృత్యుంజయులు బంధువుల ఇంటికి వ్యాన్‌లో బయలు దేరింది 18 మంది అయితే కాకినాడలో బంధువుల ఇంటి వద్ద కార్యక్రమం పూర్తయ్యాక బయల్దేరిన వారు 16 మందే. మిగిలిన ఇద్దరూ తాము కాకినాడలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పి వారు ఆగిపోయారు. ఆ ఇద్దరు అక్కడ ఆగకుండా వ్యాన్‌లో ఎక్కి ఉంటే వారు కూడా ప్రమాదానికి గురయ్యేవారని క్షతగాత్రులు చెబుతున్నారు. కదిలిన పోలీసు యంత్రాంగం కాకినాడ డీఎస్పీ రవి వర్మ, పిఠాపురం సీఐ అప్పారావు, పిఠాపురం పట్టణ, గొల్లప్రోలు, పిఠాపురం రూరల్, కొత్తపల్లి ఎస్సైలు శోభన్‌కుమార్, శివకృష్ణ, మూర్తి, కృష్ణమాచారి ఇతర పోలీసు సిబ్బంది క్షతగాత్రులను తమ పోలీసు వాహనాలలో పిఠాపురం ఆస్పత్రికి తరలించి అనంతరం 108 వాహనాల్లో కాకినాడ తరలించారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి 216 జాతీయ రహదారి కాంట్రాక్ట సంస్థపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్బీ డీఎస్పీ మురళీమోహన్, త్రీటౌన్ సీఐ దుర్గారావుతో పాటు డీటీసీ సిరి ఆనంద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇలా వచ్చి.. అలా మృత్యుఒడికి! కాకినాడ: ఇంట్లో జరిగే వేడుకకు పది మందిని పిలిచి ఎంతో సంతోషంతో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిమిషాల వ్యవధిలోనే తమ ఇంట జరిగిన శుభకార్యక్రమానికి వచ్చివారు మృత్యు ఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంటిలో పెనువిషాదాన్ని నింపింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన ఘటన కాకినాడ డ్రైవర్స్ కాలనీలోని కుంచే అప్పారావు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. అప్పారావు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేసుకున్నారు. సోమవారం వీరభద్రుని సంబరం, భోజనాలు ఏర్పాటు చేసుకుని కొంత మంది బంధువులను పిలుచుకున్నారు. ఇందు కోసం తన అత్తగారి వైపు బంధువులైన విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని జి.వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిని ఆహ్వానించారు. వారందరూ ఉదయం 10.30 గంటల సమయంలో కాకినాడ చేరుకుని పట్టుమని అర్ధగంట కూడా గడవకముందే అంతే వేగంగా తిరుగు ప్రయాణమై.. గమ్యం చేరకుండా మృత్యుఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంట ఆవేదనను మిగిల్చింది. వచ్చినంత వేగంగా తిరుగు ప్రయాణమై మృత్యుఒడికి చేరారంటూ కుంచే అప్పారావు ‘సాక్షి’ వద్ద తన ఆవేదన వెళ్లగక్కారు. ఇదే వాహనంలో వెళ్లాల్సిన మరో ఇద్దరు ఇక్కడ ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆ వాహనంలో ప్రయాణించకపోవడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని బంధువులు చెబుతున్నారు. -
సవతి తల్లే నరరూపరాక్షసిలా మారి..
సాక్షి, విశాఖపట్నం : సంచలనం సృష్టించిన దువ్వాడ చిన్నారి అలేఖ్య హత్యకేసు మిస్టరీ వీడింది. సవతి తల్లే అలేఖ్యను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి అలేఖ్య పట్ల తండ్రి కృష్ణ చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకే సవతి తల్లి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చిన్నారిని ఇంటి గోడకు బలంగా కొట్టి అంతమొందించినట్లు సవతి తల్లి దుర్గ విచారణలో తెలిపింది. అసలేం జరిగింది... దువ్వాడ సెక్టార్ 1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాచబత్తుని కృష్ణ, మొదటి భార్య మీనాక్షి రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది. అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది. వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. కృష్ణ, రాజుల తీరుపై స్థానికంగా విచారించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పాప ఉంటున్న ఇంటి వద్ద నుంచి కృష్ణ తోడల్లుడు రాజు ఇంటి వరకు వెళ్లి ఆగింది. గోడ దూకి పాపను చంపి పడేసిన స్థలం వద్దకు వెళ్లి తరువాత రాజు పక్కింటి వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్లి పాప ఇంటికి చేరుకుంది. దీంతో చిన్నారి తండ్రి కృష్ణ, తోడల్లుడు రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వదిలించుకునేందుకే అంతమొందించారా? అన్న కోణంలో.. ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య మీనాక్షి, కుమార్తె అలేఖ్య అడ్డు తొలగించుకోడానికి కృష్ణ, ఆయన తోడల్లుడు కలిసి ప్రణాళిక రచించి ఉంటారని పోలీ సులు అనుమా నం వ్యక్తం చేశారు. ప్రణాళికలో భాగంగా ముందు చిన్నారిని అంతమొందిస్తే మీనాక్షి భయంతో ఇక్కడి నుంచి బరంపురం వెళ్లిపోయేలా చేయాలని భావించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని భావించారు. అలాగే కృష్ణ రెండో భార్య దుర్గ పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీశారు. ఇప్పటికే దుర్గను స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి విచారించారు. దుర్గకు నాలుగు నెలల పాప ఉంది. పాప తండ్రి కృష్ణ, అతని తోడల్లుడు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. -
పెళ్లికి ప్రియుడు నిరాకరించాడని..
విశాఖపట్నం, సబ్బవరం(పెందుర్తి): తనను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఓ యువతి పురుగులు మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇరువర్గాల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాయనమ్మపాలెంన కు చెందిన గెంజి కుమారి (23), రావులమ్మపాలెంనకు చెందిన షేక్ రెహమాన్ (23) క్లాస్ మేట్లు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లగా సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. ఏడోతరగతి నుంచే వీరిద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే కుమారిని పెళ్లి చేసుకుంటానని తుదవరకు నమ్మించి ఇటీవలే నిరాకరించడంతో ఇరువర్గాల పెద్దలు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఆమెతో తాను కలిసి తిరిగిన మాట వాస్తవమేనని, కోపిష్టి అని, పెళ్లిచేసుకునేది లేదని రెహమాన్ తెగేసి చెప్పేశాడు. ఇలా రెండుమూడుసార్లు పెద్దలు పంచా యితీ పెట్టినా ఫలితం దక్కలేదు. మంగళవారం కూడా కౌన్సెలింగ్ జరిగింది. రెహమాన్ పెళ్లి ఊసెత్తకపోవడంతో విసు గు చెందిన కుమారి పంచాయితీ జరిపిన చోటే తన వెంట తెచ్చుకున్న పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో 108వా హనంలో కేజీహెచ్‌కు పంపించారు. రెహమాన్ లంకెలపాలెంలో బీటెక్ చదువుతున్నాడు. కుమారి ఇటీవలే బీఈడీ పూర్తి చేసింది. కుమారి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె తల్లి సోములమ్మ బోరున విలపిస్తోంది. గతంలోనూ వివా దం పోలీస్‌స్టేషన్‌కు చేరినా లిఖితపూర్వక ఫిర్యా దు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మంగళవారం నాటి ఘటనపైనా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ఎన్. ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
చిన్నారిని చిదిమేశారు
విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): మానవత్వం మంటగలిసింది. కర్కశత్వం పురులువిప్పింది. రాక్షసత్వం మూడేళ్ల పసిమొగ్గను చిదిమేసింది. కుటుంబ కలహాలకు చిన్నారి బలైపోయిన దారుణ ఘటన దువ్వాడ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హృదయవిదారకరమైన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ సెక్టార్ – 1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాచబత్తుని కృష్ణ, మొదటి భార్య మీనాక్షి రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది. అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది. వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. కృష్ణ, రాజుల తీరుపై స్థానికంగా విచారించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పాప ఉంటున్న ఇంటి వద్ద నుంచి కృష్ణ తోడల్లుడు రాజు ఇంటి వరకు వెళ్లి ఆగింది. గోడ దూకి పాపను చంపి పడేసిన స్థలం వద్దకు వెళ్లి తరువాత రాజు పక్కింటి వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్లి పాప ఇంటికి చేరుకుంది. దీంతో చిన్నారి తండ్రి కృష్ణ, తోడల్లుడు రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వదిలించుకునేందుకే అంతమొందించారా..? ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య మీనాక్షి, కుమార్తె అలేఖ్య అడ్డు తొలగించుకోడానికి కృష్ణ, ఆయన తోడల్లుడు కలిసి ప్రణాళిక రచించి ఉంటారని పోలీ సులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా ముందు చిన్నారిని అంతమొందిస్తే మీనాక్షి భయంతో ఇక్కడి నుంచి బరంపురం వెళ్లిపోయేలా చేయాలని భావించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. అలాగే కృష్ణ రెండో భార్య దుర్గ పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దుర్గను స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి విచారించారు. దుర్గకు నాలుగు నెలల పాప ఉంది. పాప తండ్రి కృష్ణ, అతని తోడల్లుడు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలేఖ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెడ్డీ గ్యాంగ్ హల్చల్
విశాఖ క్రైం/పీఎంపాలెం(భీమిలి): నగర శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. ఈ నెల 6వ తేదీన భీమిలి మండలం సంగివలసలో చోరీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులే అని.. ఘటన జరిగిన తీరును బట్టి పోలీసులు నిర్ధరించుకున్నారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి 5వ వార్డులోని పనోరమా హిల్స్ 66 నంబర్ విల్లా సమీపంలో ఈ గ్యాంగ్ సభ్యులు సంచరించినట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న లక్ష్మీనారాయణకు చెందిన ఈ విల్లాలో చోరీ చేయడానికి చెడ్డీ గ్యాంగ్ తీవ్రంగా యత్నించి విఫలమైంది. ఈ విషయమై ఆయన పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేసినట్టు నార్త్ జోన్ నేర విభాగం సీఐ ఆర్. సత్యనారాయణ తెలిపారు. పీఎంపాలెం, ఆనందపురం, పద్మనాభం, భీమిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా.. రాత్రి 7 గంటల తరువాత పనోరమా హిల్స్, పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. పైగా దసరా సెలవులు. చాలా మంది స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో చెడ్డీ గ్యాంగ్ ఇలాంటి ప్రాంతాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణలో హల్చల్ చేసిన ఈ గ్యాంగ్ దృష్టి విశాఖపై పడటంతో శివారు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కాగా.. చెడ్డీ గ్యాంగ్‌కు నగరంలో ఎవరైనా ఆశ్రయం కల్పిస్తున్నారా అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నా రు. దసరా పండగా నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలను ఈ గ్యాంగ్ ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై క్రైం డీసీపీ దామోదర్‌ను వివరణ కోరగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే చెడ్డీ గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని స్పష్టం చేశారు. వారు ఎక్కడ నుంచి వచ్చారన్న కోణంలో సీసీ ఫుటేజ్‌ల ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, క్రైం పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ కోసం విస్తృత తనిఖీలు గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నగరంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. శివారు ప్రాంతాలైన గోపాలపట్నం, కొత్తపాలెం, గోశాల, వేపగుంట మార్గాల్లో ఎస్ఐ జీడీబాబు ఆధ్వర్యంలో ఏఎస్ఐ గోవిందమ్మ, హెచ్‌సీ మేడిది శ్యామ్యూల్ తదితరులు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ సభ్యులు చోరీకి పాల్పడేటప్పుడు ఎవరికీ చిక్కకుండా చెడ్డీ, తలపాగా, లుంగీ, బనియన్లు ధరిస్తారు. గ్యాంగ్ సభ్యులు తెల్లపంచి కప్పుకుని, చెప్పులు చేతులో పట్టుకుని అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతుంటారు. హిందీలో మాట్లాడతారు. నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే కొళ్లగొట్టడం వీరి ప్రత్యేకత. సుడిగాలిలా వచ్చి క్షణాలలో చేతికి అందిన కాడికి దోచుకుని పరారవుతారు. నగర శివారులో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– కె.లక్ష్మణమూర్తి, సీఐ, పీఎంపాలెం పోలీస్ స్టేషన్ -
బెట్టింగులు.. అప్పులు.. ఆపై దోపిడీ బాట
విశాఖ క్రైం: బంగారం వ్యాపారిపై పక్కాగా రెక్కీ నిర్వహించి... అదునుచూసి కంట్లో కారం జల్లి నగదు, బంగారం దోచుకుపోయిన ముఠాలోని పది మంది నిందితులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 598.67 గ్రాముల బంగారం, రూ.15.79 లక్షల నగదు, ఒక ఫిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. దొండపర్తి డీఆర్ఎం కార్యాలయం రోడ్డులో సెప్టెంబర్ 23న వేకువజామున 4.45 గంటల సమయంలో బంగారం వ్యాపారిని ఫిస్టల్తో బెదిరించి... కంట్లో కారం జల్లి అతని వద్ద నుంచి 1200 గ్రాముల బంగారం, రూ.42 లక్షల నగదు ఓ ముఠా దోచుకుపోయిన ఘటన తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో నగరంలో సంచలనం రేపింది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల విజువల్స్‌తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అప్పులు తీర్చుకునేందుకు దోపిడీబాట మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన గోగాడ గోవింద్ గతంలో నగరంలోని రెండు బంగారు దుకాణాల్లో కొంతకాలం పనిచేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ సుమారు రూ.5.5లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా బంగారం వ్యాపారి రమేష్‌పై గోవింద్ దృష్టి సారించాడు. విశాఖ నగరంలోని శ్రీనగర్‌లో సాయి ఫ్యారడైజ్ అపార్టుమెంట్ ఐదో అంతస్తులో నివసిస్తున్న రమేష్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురులో ఉంటూ వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చి వెళ్తుంటాడు. రమేష్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వర్రి సురేష్‌తో తనకున్న స్నేహాన్ని వినియోగించుకుని ఎప్పటికప్పుడు రమేష్ కదలికలను గోవింద్ తెలుసుకునేవాడు. ఆ క్రమంలో గతంలో రెండుసార్లు చోరీకి యత్నించి విఫలమయ్యాడు. చివరకు ఓ ముఠాను తయారు చేయాలని భావించి ఖరగ్‌పూర్‌కు చెంది నగరంలో స్థిరపడిన సాది హరిబాబు అలియాస్ పికిరితో మాట్లాడి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా నగరంలోని కొందరితో ముఠా ఏర్పాటు చేయడంతోపాటు ఖరగ్‌పూర్ నుంచి మరో ఐదుగురిని తీసుకొచ్చే బాధ్యతను పికిరికి అప్పగించాడు. ఫిస్టల్తో బెదిరించి... కంట్లో కారంజల్లి దోపిడీకి ముందు రోజు సెప్టెంబర్ 22న ఖరగ్‌పూర్ నుంచి చేరుకున్న ఐదుగురితో కలిసి మొత్తం 15 మంది నిందితులూ కలిసి వ్యాపారి రమేష్ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ మరుసటి రోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో కొందరు నిందితులు మూడు బైక్‌లపై రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు రమేష్ బైక్‌పై వెళ్తుండగా సాయికిరణ్, చిన్నతో పాటు మరో ఐదుగురు వెంబడించారు. దొండపర్తి ఫ్లైవర్ వంతెన వద్దకు చేరుకునేసరికి ఒక్కసారిగా ముట్టడించారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసి ఉన్న ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు ఫిస్టల్తో బెదిరించడంతో చిన్న అనే వ్యక్తి రమేష్ కంట్లో కారం జల్డాడు. వెంటనే రమేష్ చేతిలోని సూటు కేసు, బ్యాగ్‌లో ఉన్న బంగారంతో ప్రధాన నిందితుడు గోవింద్, మిగిలిన వారంతా పరారయ్యారు. అనంతరం ఒకచోటకు చేరుకున్నక బంగారం, నగదు పంచుకున్నారు. ఖరగ్‌పూర్‌కు చెందిన ముఠా సభ్యులు తమకు వచ్చిన వాటాలో నుంచి రూ.2.3లక్షలతోపాటు ఫిస్టల్ను తమను నగరానికి తీసుకొచ్చిన సాది హరిబాబుకు ఇచ్చి వెళ్లిపోయారు. తేరుకున్న రమేష్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. అదేవిధంగా కానిస్టేబుల్ రమేష్‌రెడ్డి సేకరించిన కీలక ఆధారాలతో పది మంది నిందితులను ద్వారకానగర్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పట్టుబడితే మరికొంత బంగారం, నగదు రకవరీ చేసే అవకాశం ఉంది. నిందితులను పట్టుకోవడంతో చురుగ్గా వ్యవహరించిన రమేష్‌రెడ్డితోపాటు ఇతర సిబ్బందిని సీసీ అభినందించి రివార్డులు అందించారు. సమావేశంలో క్రైం డీసీపీ దామోదర్, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ గోవింద్రావు, సీఐ కృష్ణారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు 10 మంది నిందితుల అరెస్ట్ మద్దిలపాలెంకు చెందిన గోగాడ గోవింద్రావు(అలియాస్ గోగు, విందు), కొయిలాడ సాయికిరణ్ (అలియాస్ రాజా, రెబల్), సాది హరిబాబు, మానాపురం మురళీకృష్ణ, పాలా భాస్కర్ (అలియాస్ భాషా), కొండపు ఢిల్లేశ్వరరావు (అలియాస్ ఢిల్లీ), కండ్రపు సౌమిత్,(అలియాస్ గోవింద్, ఆలియాస్ గోవి), సాలిపేటకు చెందిన సూర హరిదీక్షిత్రావు, తోటాడ లోకేష్, పశ్చిమ బెంగాల్ రాష్టం, ఖరగ్‌పూర్‌కు చెందిన మొద్దు తారకేశ్వరరావు(అలియాస్ చిన్నా)లను అరెస్ట్ చేశారు. ఖరగ్‌పూర్‌కు చెందిన మనోజ్‌దాస్, గణశ్యామ్, సుమీర్దాస్, గేదం సూరజ్‌కుమార్, రాకేష్ మండా పరారీలో ఉన్నారు. -
లంకెలపాలెంలో హత్య
విశాఖపట్నం, పరవాడ(పెందుర్తి): మంత్రిపాలేనికి చెందిన షేక్ మదీన(40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి లంకెలపాలెం ఐసీఐసీఐ బ్యాంకు వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో పడేసి పరారయ్యారు. ఈ మేరకు మృతుడి అన్న హుస్సేన్ పరవాడ పోలీసులకు సోమవారం పిర్యాదు చేశాడు. హత్యకు సంబంధించి సీఐ బీసీహెచ్.స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... మంత్రిపాలెం గ్రామానికి చెందిన షేక్ మదీన రోలర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. ఈయన ఖాళీ సమయంలో మటన్ షాపుల్లో పనిచేస్తుంటాడు. డొంకాడకు చెందిన నీలం వకీల్ అనే వ్యక్తికి చెందిన రేబాక గ్రామంలోని మటన్ దుకాణంలో పనిచేసేందుకు ఆదివారం ఉదయం యజమానితో కలిసి మదీన వెళ్లాడు. అనంతరం ఆదివారం సాయంత్రం దుకాణంలో పనులు ముగించుకొని రేబాక నుంచి యజమాని వకీల్, మదీన ఆటోలో బయలుదేరారు. లంకెలపాలెం కూడలిలో రాత్రి 8.40 గంటల ప్రాంతంలో మదీన ఆటో దిగాడు. అనంతరం వకీల్ అదే ఆటోలో డొంకాడ వెళ్లిపోయాడు. లంకెలపాలెంలో ఆటో దిగిన మదీన రాత్రి ఇంటికి రాకపోవడంతో అతడి భార్య వకీల్కు ఫోన్ చేసి భర్త ఆచూకీ అడిగింది. మదీనను ఆదివారం రాత్రి లంకెలపాలెంలో దించి తాను ఇంటికి వచ్చానని వకీల్ ఆమెకు బదులిచ్చాడు. వివాహేతర సంబంధమే కారణమా..? సోమవారం ఉదయం లంకెలపాలెంలోని ఐసీఐసీఐ బ్యాంకు వెనుక భాగం తుప్పల్లో మదీన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతుడి అన్నయ్య ఫిర్యాదు మేరకు పరవాడ సీఐ స్వామినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మదీన ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమవడంతోపాటు శరీరం, చేతులపై తీవ్ర గాయాలున్నాయి. పీక నులిమినట్లు ఆనవాళ్లు లభిచాయి. హత్యోదంతం వెలుగులోకి రావడంతో సంఘటన స్థలాన్ని గాజువాక ఏసీపీ రంగరాజు, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ సీఐలు కిశోర్, లక్ష్మి సందర్శించారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. ఇదిలావుండగా తన తమ్ముడి హత్యకు డొంకాడ కాలనీ మినమడక గ్రామానికి చెందిన కె.కొండలరావే కారకుడిని మృతుడి అన్నయ్య హుస్సేన్ అనుమానం వ్యక్తం చేశాడు. తన తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్న కొండలరావు మదీనాను అడ్డు తొలగించుకోవడానికి యత్నిస్తున్నాడని... ఈ క్రమంలో ఆదివారం రేబాక నుంచి వచ్చిన షేక్ మదీనతో మద్యం తాగించి, హత్య చేసి తుప్పల్లో పడేసి ఉంటాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడని సీఐ స్వామినాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మరోవైపు అనుమానితుడు కొండలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
అమ్మవారి సన్నిధిలో లంచావతారం
దేవుడి దగ్గరకో.. దేవత దగ్గరకో వెళ్లి కోరికలు కోరుతాం.. దక్షిణలు సమర్పిస్తాం.. కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటాం..తానూ దేవుడినని ఫీలయ్యాడేమో గానీ.. సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలోనే ఓ అధికార దేవుడు తన కోసమే ఓ హుండీ పెట్టేశాడు.. లంచాల దక్షిణలు అందులో వేయాలని తన కింది ఉద్యోగులనే ఆదేశించాడు..అసలు దేవుడు దక్షిణలు సమర్పించకపోయినా.. మనసారా ప్రార్థిస్తే భక్తులను కాపాడతాడు, కోరికలు తీరుస్తాడు..కానీ ఈ అధికార దేవుడు మాత్రం తన కింద పనిచేసే వారే అయినా.. తన సహోద్యోగులన్న స్పృహ కూడా లేకుండా పీఆర్సీ బకాయిలు కావాలంటే లంచాల దక్షిణలు సమర్పించాల్సిందేనని పీక మీద కత్తి పెట్టాడు.. మీటింగ్ పెట్టి మరీ రేట్లు ఫిక్స్ చేశాడు. కొంతమంది గత్యంతరం లేక అతని హుండీలో దక్షిణలు వేసేశారు. అయితే కొద్దిమంది మాత్రం సహనం నశించి.. ఏసీబీకి ఉప్పందించారు. వారు వల పన్నారు. రూ.60 వేల లంచం తీసుకుంటుండగా సదరు లంచావతారాన్ని.. అతని తాబేదారు రికార్డు అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. ఆ లంచావతారమే పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ఈవో సత్యనారాయణ. కాగా గతంలోనూ పోలమాంబ దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అప్పటి ఈవో మూర్తిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖ క్రైం: దేవుడి సన్నిధిలో చిన్న తప్పు చెయ్యడానికి కూడా భయపడుతున్న రోజుల్లో... కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ దేవాలయంలోనే లంచాల హుండీ తెరిచేశాడు. ఆ అమ్మవారి హుండీలో భక్తులు దక్షిణ వేయకపోయినా.... ఈయన హుండీలో ఆలయ ఉద్యోగులు మాత్రం లంచాల సొమ్ము జమ చేయాల్సిందే. లేకుంటే మాత్రం ఉద్యోగుల పరిస్థితి ఊహించుకోలేం. ఎక్కడెక్కడ ఆమ్యామ్యాలు దొరికే ఛాన్స్ ఉంటే అక్కడ పట్టుబట్టి మరీ పైసలు పిండుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈయనకు రైట్ హ్యాండ్‌గా రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివ వ్యవహరిస్తూ గుడిలోనే చక్రం తిప్పేవారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బందికి న్యాయంగా దక్కాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం భారీగా లంచం డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకూ వాటాలివ్వాలని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేశారు. సొమ్ము వసూలు చేసే బాధ్యతను రికార్డ్ అసిస్టెంట్‌కు అప్పగించేశారు. వీరిద్దరూ కలిసి ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు... ఇంకా ఎవరు బాకీ ఉన్నారనే జాబితానే తయారు చేసేసుకుని సిబ్బందిని వేధించుకు తింటున్నారు. వీరి వేధింపులు భరించలేని ఓ అర్చకుడు, వాచ్మెన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సంప్రదించడంతో... లంచావతారులను ఏసీబీ అధికారులు గుడిలోనే రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో ధర నిర్ణయించేసి... ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలియజేసిన వివరాల ప్రకారం... దేవస్థాన ఉద్యోగులకు 2015 పీఆర్సీ అమలు చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 27న ఉద్యోగులు, సిబ్బందితో ఈవో సమావేశం ఏర్పాటు చేశారు. పీఆర్సీ బకాయిలు రావాలంటే అర్చకులు రూ.30 వేలు, సన్నాయిమేళం, వాచ్మెన్, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమని సిబ్బంది మొరపెట్టుకోగా.. రూ.5వేలు తగ్గించి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొందరు కొద్దిరోజుల కిందట రూ.1.45లక్షలు సమర్పించేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అర్చకుడు శ్రీనివాస్ చక్రవర్తి, వాచ్మెన్ ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈవో సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్ శివపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం ఉద్యోగుల నుంచి తీసుకున్న లంచం సొమ్ము రూ.60వేలు ఈవో చాంబర్లో రికార్డ్ అసిస్టెంట్ శివ లెక్కిస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, మూర్తి, ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈవో సత్యనారాయణతో పాటు రికార్డు అసిస్టెంట్ శివని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అవినీతి వసూళ్లకు సంబంధించి లంచావతారులు ఇద్దరూ నిర్వహిస్తున్న ఓ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. 11 మంది నుంచి లంచాలు వసూలు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ అర్చకులు, ఇతర సిబ్బంది ఈవోకు డబ్బులు అందించే ముందు తమను సంప్రదించారని, ఇద్దరు అర్చకులు రూ.50 వేలు, ఓ వాచ్మెన్ రూ.10వేలు లంచం గురువారం ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన లంచాన్ని ఈవో చాంబర్లో రికార్డు అసిస్టెంట్ లెక్కపెడుతుండగా పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఈవో ఇప్పటికే చాలా మంది నుంచి సొమ్ము సేకరించారని, ఇంకా ఇవ్వాల్సిన వారి వివరాలు పుస్తకంలో రాసుకున్నారని తెలిపారు. సుమారు రూ.1.45లక్షలను ఉద్యోగులు కొద్దిరోజుల కిందట ఈవోకి ఇచ్చారని... అందులో నుంచి రూ.1.20లక్షలను రాజమండ్రిలో ఉంటున్న రీజినల్ జాయింట్ కమిషనర్‌కు చెల్లించినట్లు ఈవో అంగీకరించారని, మొత్తం 11 మంది ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకున్నారని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 7 – ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్ది అప్పలరెడ్డి ఇంట్లో రూ.38వేలు స్వాధీనం కరకచెట్టు పోలమాంబ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పెదవాల్తేరుకు చెందిన మద్ది అప్పలరెడ్డి ఇంట్లో అవినీతి సోమ్ము రూ.38 వేలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలమాంబ ఆలయంలో రెండోసారి ఏసీబీ దాడి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పెదవాల్తేరులో గల శ్రీ కరకచెట్టు పోలమాంబఅమ్మవారి దేవస్థానంలో విధులు నిర్వర్తించే కార్యనిర్వహణాధికారులు వారి తీరు మార్చుకోవడం లేదు. లంచాలు రుచి మరిగి సిబ్బంధిని వేధిస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆలయానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ దేవస్థానంలో 2016వ సంవత్సరంలో ఈఓ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన సత్యనారాయణ తాజాగా ఏసీబీకి చిక్కారు. ఈయ న నర్సీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన మరో ఐదు దేవస్థానాలకు ఇన్‌ఛార్జి ఈఓగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ 2016లో 2015 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని సర్కులర్ జారీ చేశారు. ఇదే ఆ శాఖలోని ఈవోలు, ఇతర ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిపిస్తోం దనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు ఈవోలు ఏసీబీకి చిక్కి సస్పెండ్ కావడం భక్తులను విస్మయపరుస్తోంది. -
రుషికొండ తీరంలో మృత్యుఘోష
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): సహజ అందాలకు నిలయమైన రుషికొండ తీరంలో మృత్యఘోష వినిపిస్తోంది. అమాయకులైన విద్యార్థులు, పర్యాటకులను రాకాసి అలలు కాటేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం... అధికారులు నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఆరేళ్లలో పది మంది దుర్మరణం పాలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో విహార యాత్రకై వచ్చి సముద్రంలోకి దిగి భీకర అలల తాకిడితో మృత్యు ఒడికి చేరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేయరాదంటూ పోలీసులు నామమాత్రంగా హెచ్చరిస్తుండడం ప్రమదాలకు కారణమవుతోంది. ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు శాశ్వత చర్యలు నేటికీ చేపట్టకపోవడం శోచనీయం. తాజాగా ఆదివారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను అలలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సముద్రంలోకి దిగి స్నానాలు చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు పవన్‌కుమార్, హరికుమార్, వంశీని రాకాసి అలలు లాగేయగా... వీరిలో వంశీని లైఫ్‌గార్డులు జి.రాజేష్, కె.రాజు, జి.రాజ్‌కుమార్, సీహెచ్.మురళీ సకాలంలో కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాకాసి అలలకు బలైపోయిన పవన్‌కుమార్ మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తున్నట్టు పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. హరికుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలానికి ఆరిలోవ సీఐ తిరుపతిరావు చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2012లో సాయిప్రియ రిస్సార్ట్స్ వెనుక తీరంలో గీతం వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 2014లో ఆరిలోవకు చెందిన ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. 2016లో ద్వారకానగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ భీకర అలలకు గురై గల్లంతయ్యారు. అనంతరం మూడు రోజుల తర్వాత వీరి మృతదేహాలు తీరానికి చేరాయి. ఇలా ఏడాదికి కనీసం ఇద్దరు లేక ముగ్గురి ప్రాణాలు పోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూరని మృతుల తల్లిదండ్రులు, పర్యాటకులు విమర్శిస్తున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్‌గా జె.పూర్ణచంద్రరావు ఉన్న సమయంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం పోలీసులు, మెరైన్ పోలీసులు, మరోవైపు లైఫగార్డుల పర్యవేక్షణ ఉండేది. ముఖ్యంగా సముద్రంలో దిగి స్నానం చేసే పర్యాటకులను పరిశీలిస్తూ లైఫ్‌గార్డులు హెచ్చరించేవారు. అనంతరకాలంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాగే ఆరిలోవ, పీఎంపాలెం పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్క కానిస్టేబుల్ కూడా తీరంలో పహారా కాయడం లేదు. నామమాత్రంగా మెరైన్ పోలీస్‌లు ఒకరిద్దరు వాచ్ టవర్ వద్ద కాలక్షేపంగా కూర్చుంటున్నారు. తీరంలో స్నానాలు చేసే పర్యాటకులను హెచ్చరించేవారే లేకుండాపోయారు. ఈ కారణంగానే విహారయాత్రకని వచ్చి రుషికొండ తీరానికి బలైపోతున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దొంగల పని పట్టారు
విశాఖ క్రైం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో నిందితులను విశాఖ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, నగదు, తొమ్మిది ద్విచక్రవాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం విలేకరులలో సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెళ్లిళ్ల మోసగాడి అరెస్టు నగరానికి చెందిన ఓ మహిళ మ్యారేజ్ బ్యూరోలో వివాహం నిమిత్తం వివరాలు నమోదు చేసుకుంది. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఉంటున్న మాచర్ల శ్యామ్మోహన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి మానేశాడు. తాను ఏసీబీ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని నకిలీ పత్రాలతో అదే మ్యారేజ్ బ్యూరోలో వివరాలు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. బెంగళూరులో కాపురం పెడదామని, ఏసీలు తదితర సామగ్రి పంపించమని ఆమెను కోరాడు. ఈ విధంగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌నని చెప్పి పలువురు మహిళలను మోసం చేసి సుమారు రూ.7.5 లక్షల వరకు కాజేశాడు. శ్యామ్‌కు గతంలో పెళ్లి అయ్యింది. భార్య, పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకొని మోసపోయానని నిర్ధారించుకున్న మహిళ విశాఖ పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని పట్టుకొని రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు నుంచి రూ.7.2 లక్షల డ్రా గాజువాక దయాల్‌నగర్‌లో ఉంటున్న గొట్టివాడ తరుణ్‌కుమార్‌కు చెందిన ఎస్బీఐ అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో పలుమార్లు రూ.7.2 లక్షలు విత్‌డ్రా చేశాడు. ఈ మేరకు అతడు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం సీఐ గోపినాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పెదగంట్యాడకు చెందిన కాకినాడ రమణరావు(ఫిర్యాదు మేనమామ)గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.లక్ష నగదు రెండు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ♦ దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుధీర్ అనే వ్యక్తి వద్ద కడిమి నాగేశ్వరరావు కారు అద్దెకు తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆ కారును పశ్చిమ గోదావరి జిల్లాలో విక్రయించేశాడు. దీనిపై సుధీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. ♦ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బెజ్‌కృష్ణ హోటల్ దరి సిరి ఇన్ఫోటెక్ సంస్థలో రెడ్డి సందీప్ అనే యువకుడు ఐదు మోనిటర్లు దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులుమోనిటర్లను బ్యాగ్‌లో పట్టుకొని వెళ్తున్న సందీప్‌ను ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మోనిటర్లను స్వాధీనం చేసుకున్నారు. ♦ నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్న చెర్ల సతీష్, అనురుద్ధీన్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ దొంగిలించారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ మల్కాపురంలో ప్రాంతంలో నంద వెంకటరామరాజు, గణేష్‌కుమార్ ఎనిమిది ద్విచక్రవాహనాలను దొంగిలించారు. దీనిపై బాధితులు మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేస్తున్నారు. ♦ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోలో వెళ్తున్న ఒక మహిళా బ్యాగ్‌లో రూ.75 వేలు చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాపు చేపట్టారు. ఆటోలో ఆమె పక్కన కూర్చున్న జ్యోతి అనే మహిళ బ్యాగ్ కట్ చేసి డబ్బులు అపహరించినట్లు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. ఆమె వద్ద రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. ♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రలో మళ్ల శ్రీనివాసరావు జేబు నుంచి రూ.1.2 లక్షలను దొంగలు అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోర్ల పోలిరాజు, చుక్క బంగారురాజు, దాసరి అప్పలరాజును అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేశారు. ♦ 15 రోజుల క్రితం షేక్ నజీమ్ అనే వ్యక్తిని అనిట్స్ కళాశాల వద్దకు రమ్మని చెప్పిన నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించి మూడు తులాల బంగారం చైన్, ఉంగరం లాక్కొన్నారు. దీనిపై బాధితుడు భీమిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులు అవినాష్‌రెడ్డి, వేముల వీర వెంకటశివగణేష్, బయ్యి గణేష్, దాలిబోయిన రాజాను అరెస్టు చేశారు. బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ♦ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో యలమశెట్టి మహేష్‌బాబు, దొంగల ముత్యాలనాయుడు ఐదు ద్విచక్రవాహ¯నాలు దొంగలించారు. అలాగే ఓఎల్ఎక్స్లో ఒక వ్యక్తి బైక్ యాడ్ పెట్టాడు. ఇది చూసిన ముత్యాలనాయుడు టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి వాహనంతో పారిపోయాడు. ఈ రెండింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వాహనం, 57 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, సీఐలు రాజులునాయుడు, గోపినాథ్, పైడిపునాయుడు పాల్గొన్నారు. ఈ కేసుల్లో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా రివార్డులు ప్రకటించారు. -
మంటలు రేపిన మారణకాండ
ఒక ప్రతీకారేచ్ఛ మారణకాండ సృష్టించింది.. ఆ మారణకాండకు నిరసనగా ఆగ్రహజ్వాల రగిలింది. అందాల అరకును అట్టుడికించింది.. మొత్తం మన్యాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది.నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పంజా విసిరారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తూటాలకు నేలకొరిగారు. స్థానికులు, నేతల అనుచరుల్లో అలజడిని, ఆగ్రహాన్ని రేపిన ఈ ఘటన.. అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడికి, దహనానికి పురిగొల్పింది. అనూహ్యంగా జరిగిన మారణకాండ, దాడులు, విధ్వంసాలతో అరుకులోయ చివురుటాకులా వణికిపోయింది. ఈ మొత్తం ఘటనలో కిడారి, సివేరిల మృతదేహాలు నాలుగు గంటల పాటు సంఘటన స్థలంలోనూ.. మరో నాలుగు గంటలు వారి వాహనాల్లోనూ అనాథల్లా మిగిలిపోవడం స్థానికులను కలచివేసింది. సాక్షి విశాఖపట్నం/పాడేరు రూరల్/అరుకులోయ: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. అధికారపార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ప్రజాప్రతినిధి సీవేరిసోమను కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో జరిగిన ఈ ఘటనతో ఏవోబీ ఉలిక్కిపడింది. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం 12.20గంటల సమయంలో మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. వీరిద్దరినీ అతి దగ్గరగా కాల్చిచంపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డుంబ్రిగుడ మండలం లివిటి పుట్టు వద్ద మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. అరకు నుంచి డుంబ్రిగుడ, గుంటసీమ రోడ్డు మీదుగా కండ్రుం పంచాయతీకి కార్యకర్తలు, అనుచరులు సహా మూడు వాహనాల్లో బయలు దేరిన కిడారివాహనాల్ని ముందుగానే మాటువేసిన40 మంది మహిళలు సహా 70 మంది సాయుధదళం కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అడ్డగించి మార్గమధ్యంలోనే మట్టుబెట్టారు. ఉదయం 11 గంటలక వరకూ అరకులోనే ఉన్న కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి లివిటి పుట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. గ్రామ సమీపంలో మార్గమధ్యంలో వాహనాలపై ఒక్కసారిగా మావోలు అడ్డగించారు. ఎమ్మెల్యే గన్మెన్ల వద్ద నుంచి తుపాకీలు, సెల్ఫోన్లు లాక్కొని వారిని దూరంగా పంపించేశారు. అనంతరం వారంతా చూస్తుండగానే చూస్తుండగానే ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సోమకు చేతులు కట్టికొద్ది దూరం ముందుకు తీసుకువెళ్ళి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద నిలిపివేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యే కిడారితో కొద్ది సేపు చర్చించారు. గూడ క్వారీ పర్యావరణాన్ని దెబ్బదీస్తున్నందున మూసెయ్యాలని గతంలో పలు మార్లు హెచ్చరించినా ఎందుకు నడిపిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో వణికిపోయిన కిడారి.. ఈ ఒక్కసారికీ క్షమించాలంటూ వేడుకున్నా.. మావోలు వినిపించుకోకుండా కాల్చిచంపారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమ ఈ దృశ్యాన్ని చూసి భీతావహుడై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా మట్టు బెట్టారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారు. అట్టుడికిన అరకు ఘటనతో అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు తరలివచ్చారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘాతుకం అంటూ సీఐపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నా ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతదేహాల తరలింపులోనూ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. అంతటా విషాదం పాడేరు: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మావోయిస్టుల తూటాలకు బలవ్వడంతో మన్యమంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ వార్త అంతటా దావానంలా వ్యాపించింది. వారి బంధువులు, అభిమానులు, వివిధ గిరిజన వర్గాలు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనూహ్య మరణం పట్ల తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. పాడేరులోని సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద, సతీమణి పరమేశ్వరి స్వగ్రామమైన పట్టణంలోని గొందూరు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటం ఉంచి బంధువులు నివాళి అర్పించారు. పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. కొందరు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. కుగ్రామం నుంచి ప్రభుత్వ విప్ వరకు పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుది ఓ కుగ్రామం. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ నడిమివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటలో ఉండేవారు. చిన్నప్పుడే పెళ్లయింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యాపారం పట్ల మక్కువ చూపేవారు.1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణకు మంచి నమ్మకస్తుడిగా ఉండేవారు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. వైఎస్సార్ మరణం తరువాత వైఎస్సార్సీపీ అరకు సమన్వయకర్తగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్ 28న టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పు.. అరకులోయ: ఇదే సమయంలో రెండు మృతదేహాలు వాహనాల్లో ఈ స్టేషన్ల వద్దకు వచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఒక్కసారిగా పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. వీరంతా రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ రెండు స్టేషన్లకు పక్కనే విద్యుత్ ట్రాన్స్పార్మర్లు ఉండడంతో ముందుస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగుతున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసులు వెనుక నుంచి వచ్చి ఒక భవనంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను తీసుకుని బయటకు వచ్చారు. లేకుంటే తుపాకులు కూడా కాలిపోయే పరిస్థితి ఉండేది. సీఆర్పీఎఫ్ ముట్టడిలో అరకు.. రూరల్ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అంత అరకులోయలోని పరిస్థితిని సమీక్షించారు. దీంతో జిల్లాలోని అందుబాటులో ఉన్న సీఎర్పీఎఫ్ బలగాలను అరకులోయ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు. బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అరకులోయలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద సీఆర్పీఎఫ్ దళాలు పహరా కాస్తున్నాయి. అరకులోయలోనే పోస్టుమార్టం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాల పోస్టుమార్టానికి అరకులోయ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాట్లు చేస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మెయిన్ గేట్ నుంచి మార్చురీ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నాం 3 గంటలకే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారితో పాటు సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకురానివ్వకుండా అభిమానులు, ప్రజలు అడ్డుకోవడంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని డాక్టర్ అర్జున్ ‘సాక్షి’కి తెలిపారు. -
అత్యాశే ఆసరాగా...
విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): అమాయకత్వం అనుకోవాలో.. గడుసుతనం అనుకోవాలో తెలీదు. నిత్యం ఎక్కడో ఒక చోట మాయ మాటలతో మోసాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా, యువత, మహిళల్లో చైతన్యం రావడం లేదు. ఫోన్ ద్వారానో, మెసేజ్‌లు, మెయిల్ మెసేజ్‌లు ద్వారానో మీకు లక్కీ డిప్ పలికిందనో, డ్రా పలికింది.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయనో రకరకాలుగా మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నా, నేటికీ అవివేకంగా మోసపోతూనే ఉన్నారు. అత్యాశకు పోయి వేలకు వేలు డబ్బులు మూల్యంగా చెల్లించుకోవల్సి వస్తుంది. తాజాగా అగనంపూడికి చెందిన పది మంది ఇదే తరహా మోసానికి గురై లబోదిబో అంటున్నారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ బిజినెస్‌లో భాగంగా ఫోన్ నంబర్లు డ్రా తీయగా మీ నంబర్ డ్రాలో పలికిందని, రూ.15 వేల విలువైన సెల్‌ఫోన్‌కు కేవలం పదిశాతం అంటే రూ.15 వందలు చెల్లిస్తే మీ స్వంతమని ఫోన్లో స్వీట్ వాయిస్ వినపడుతుండడంతో నిజమేనని నమ్మి పోస్టాఫీసు ద్వారా పదిమంది డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లిం చిన ఐదు రోజుల్లో చెల్లింపుదారుల పేరుతో పార్శిల్ ఇంటికి వస్తుంది. ప్యాకెట్‌ను తెరిచి చూస్తే ఫోన్ స్థానంలో ఇటుకలు, చెక్కముక్కలు, నిరోధ్ ప్యాకెట్లు, దేవుని ఫొటోలతో ఉన్న సీడీలు, ఇత్తడి రేకులు, గో ళీలు ఇలా రకరకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అవాక్కవ్వడం తప్ప చేసేది లేక లోలోనే మధనపడుతున్నారు. వెంటనే సదరు నంబర్‌కు ఫోన్ చేస్తే ఏముంది ఫోన్ స్విచ్ ఆ‹ఫ్ చేసి ఉందనో, అందుబాటులో లేదనో, మనుగడలో లేదనో సమాధానం వస్తుండడంతో మోసాన్ని గ్రహిస్తున్నారు. అత్యాశకు పోవడం వల్ల రూ.15 వందలు పోయాయని మింగలేక కక్కలేక లబోదిబోమంటున్నారు. -
అనుకోని ఆపద.. అంతా బూడిద
విశాఖపట్నం, గాజువాక: తెలతెలవారుతుండగానే గాజువాక ఉలిక్కిపడింది. నిద్ర నుంచి తేరుకోకముందే ఎగసి పడుతున్న మంటలు, అగ్నిమాపక శకటాల హారన్లతో గాజువాక వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గాజువాక మెయిన్రోడ్లోని శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒకింత దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక మెయిన్ రోడ్‌లోని కన్య, శ్రీకన్య కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు థియేటర్లు కాలి బూడిదయ్యాయి. ఒకే భవనంలో మూడు సినిమా థియేటర్లు కొనసాగుతున్న విషయం తెలిసిం దే. పై అంతస్తులో చోటు చేసుకున్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆధునిక పరికరాలతో కూడిన శ్రీకన్య (స్క్రీన్–2), హెవెన్ (స్క్రీన్–3)లకు చెందిన ప్రొజెక్టర్లు, సినిమా తెరలు, ఏసీ యూనిట్లు, కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. థియేటర్ స్లాబుపై ఏర్పాటు చేసిన సెల్ టవర్లు కూడా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక శకటాలతో ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైరింజన్లు వచ్చేలోపే సర్వం ఆహుతి సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీకన్య థియేటర్ స్క్రీన్కు సమీపంలో గల ఒక బల్బు పేలింది. ఆ సమయంలో ఎలక్ట్రికల్ బోర్డు నుంచి దట్టమైన పొగ మొదలైంది. దీన్ని గమనించిన స్వీపర్ చిట్టెమ్మ ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన ఫిర్యాదుతో తొలుత పెదగంట్యాడ అగ్నిమాపక శకటంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే భారీస్థాయిలో మంటలు ఎగసి పడుతుండటంతో హెచ్‌పీసీఎల్, హిందూస్తాన్ షిప్‌యార్డు, కోరమాండల్, విశాఖ స్టీల్‌ప్లాంట్, గాజువాక ఆటోనగర్లకు చెందిన ఫైరింజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే థియేటర్లు పూర్తిగా దగ్ధమై కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎంత నష్టపోయామన్న విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. తమ ఇంజినీర్లు వచ్చి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని థియేటర్ మేనేజర్ రమణబాబు అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక అధికారులకు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే వివిధ విభాగాల కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర డీసీపీ ఫకీరప్ప, సౌత్ జోన్ ఇన్‌ఛార్జి ఏసీపీరంగరాజు, గాజువాక సీఐ కె.రామారావు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, రెవెన్యూ అధికారులు ఇక్కడిపరిస్థితిని సమీ క్షించారు. మంటలను అదుపు చేయడానికి దగ్గరుండి ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఫోరెన్సిక్ అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రమాదంపై లోతైన విచారణ చేపడతామని డీసీపీ ఫకీరప్ప తెలిపారు. పని చేయని ఫైర్ టెండర్లు థియేటర్లో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఫైర్ టెండర్లు సమయానికి పని చేయలేదు. అవి పని చేసి ఉంటే కొంతమేరకైనా ఆస్తిని పరిరక్షించుకొనే వీలుండేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. కావాల్సినంత నీరు, ప్రతి ఫ్లోర్‌కు పైప్లైన్లు ఉన్నప్పటికీ నీరు పంపాల్సిన వాల్వు తెరుచుకోలేదు. వారం రోజుల క్రితం ఇక్కడ మాక్ డ్రిల్ చేసినట్టు కూడా సిబ్బంది చెబుతున్నారు. మాక్‌డ్రిల్‌లో పని చేసిన థియేటర్ ఫైర్ టెండర్ ఇప్పుడు పని చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు థియేటర్లలోను సుమారు 750 మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు కుర్చీలున్నాయి. థియేటర్లకు సిబ్బంది కూడా రాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. సినిమా ప్రదర్శన సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
విశాఖపట్నం, గోపాలపట్నం: ఎరక్కపోయి.. ఇరుక్కుపోవడమంటే ఇదేమరి. ఆలయంలో చోరీకి యత్నించి, తిరిగి బయట పడలేక పోలీసులకు చిక్కిన ఘటన వేపగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వేపగుంట జంక్షన్లో పైడితల్లమ్మ ఆలయం ఉంది. శుక్రవారం వేకువజామున ఆలయ తలుపులు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు, అర్చకుడికి ఇక్కడ వాతావరణం గందరగోళంగా కనిపించింది. హుండీ కనిపించలేదు. ఆలయ ప్రవేశం పైభాగంలో గ్రిల్స్ విరిచి ఉన్నాయి. ఆలయంలో చిల్లర డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపల గర్భాలయం వెనక వ్యక్తి హుండీ పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. దీంతో విస్తుపోయిన ఆలయ చైర్మన్ మామిడి రాజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయంలోకి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని తలుపుల తాళాలూ పెకిలించినా గర్భాలయ తలుపు తాళం తీయడానికి నిందితుడు సాహసించలేకపోయినట్టు తెలిసింది. నిందితున్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించినా బయటకు రాలేక ఇలా ఉండిపోయినట్లు ఆయన నుంచి సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా వేపగంట జంక్షన్‌లోనే పోలీసు అవుట్‌పోస్టు ఉంది. దీని పక్కనే పైడితల్లమ్మ ఆలయం ఉన్నా ఈ సంఘటన జరిగిందంటే పోలీసు నిఘా ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు. -
అమ్మా.. లేమ్మా!
రాత్రి అందరిలానే నిద్రపోయిన ఆ తల్లి ఇకలేవలేదు.. తెల్లారేసరికి కిటికీ ఊచలకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. రాత్రి ఇంట్లోనే ఉన్న తండ్రి అయిపూఅజా లేకుండా పోయాడు.. అభం శుభం తెలియని ఆ పిల్లలు తల్లిలో చలనం లేక, తండ్రి కనిపించక తల్లడిల్లిపోయారు.. ఆరిలోవ రవీంద్రనగర్‌లో జరిగిన గృహిణి అనుమానాస్పద మృతి ఘటన.. పిల్లల ఆక్రందన స్థానికులను కలచివేసింది. ఆరిలోవ(విశాఖ తూర్పు): తెల్లారక ముందే టిఫిన్ తయారు చేసి బలవంతంగా నిద్ర లేపే అమ్మ.. ఈ రోజు ఎంత లేపినా ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారులకు తెలియడం లేదు. వద్దు వద్దు అంటున్నా వెంట పడి తినిపించే తల్లి ఆకలేస్తోందని ఎంత ఏడుస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. చిన్న అరుపు వినిపిస్తే ఏమైందోనని కంగారు పడి పరుగెత్తే అమ్మ గుక్కపట్టి ఏడుస్తున్నా పక్కకు కదలడం లేదు.. ఏమైందో చెప్పడానికి నాన్న కూడా కనపడకుండా పోయాడు.. మాటలైనా రాని ఆ పసివాళ్ల హృదయ ఘోష చుట్టూ ఉన్న వారి మనసును కలిచివేసింది.. ఓ గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులకు తెలియజేసి పరారైన మృతురాలి భర్త తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి దరి పెంటలింగాపురానికి చెందిన బమ్మడిపాటి గోపీకృష్ణ కిరణ్‌కుమార్‌కు, అదే జిల్లా గరివిడి దరి పెదబంటుపల్లికి చెందిన ఉమ(26)తో 2012లో వివాహమైంది. గోపీకృష్ణ నగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న సాయి, లడ్డూ అనే మగపిల్లలున్నారు. వీరంతా కొన్నాళ్లుగా మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో చిన్నచిన్న గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. అయితే ఈ గొడవలు పెద్దల వరకు చేరలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారేసరికి ఉమా చీరతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆమె భర్త గోపీకృష్ణ వరసకు తోడల్లుడు అయ్యే బంధువుకు ‘ఉమా ఆత్మహత్య చేసుకొంది.. వెంటనే రావలెను’ అని సెల్ఫోన్లో మెసేజ్ చేశారు. అనంతనం అక్కడే మృతదేహాన్ని, నిద్రపోతున్న చిన్నారులను వదిలేసి పరారయ్యాడు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్ మెసేజ్ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు. అనంతరం విజయనగరం నుంచి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ రామచంద్రరావు, ఆరిలోవ సీఐ సీహెచ్.తిరుపతారావు, ఎస్ఐ పాపారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంధువుల అనుమతితో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అల్లుడే చంపేసి ఉంటాడు.. తన కుమార్తె ఉమా(26)ను అల్లుడు గోపీకృ ష్ణ చంపేసి ఉంటాడని, అందుకే పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడని మృతురాలి తండ్రి ఎన్.సూర్యప్రకాష్ ఆరిలోవ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తగిన విధంగా కట్నకానుకులు ఇచ్చుకొన్నామ ని, అయినా కట్నం సరిపోక అదనంగా మరిం త కట్నం అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానా స్పద కేసుతో పాటు మృతురాలి భర్తపై 498ఏ కేసు నమోదు చేసినట్టు సీ.ఐ తిరుపతిరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నామన్నారు. -
అంతుచిక్కని మిస్టరీ..!
అల్లిపురం(విశాఖ దక్షిణ): సీసీఎస్‌లో లాకప్ డెత్ విషయంలో మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని మంగళవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. మృతిచెందాడని భావిస్తున్న గొర్లి పైడిరాజు(26) మృతదేహం ఆచూకీ బుధవారం కూడా తెలియక పోవడం విశేషం. ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశాల మేరకు విచారణ అధికారి, జేసీపీ దాడి నాగేంద్రకుమార్ మంగళవారం రాత్రి వి చారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం జేసీపీతో పాటు డీసీపీ ఫకీరప్ప, క్రైం డీసీపీ ఏఆర్ దామోదరరావు, ఏడీపీసీ వి.సురేష్‌బాబు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారించారు. మూడు బృందాలు ఏర్పాటు చేశాం గొర్లి పైడిరాజు అనే యువకుడు భారత్ బంద్ రోజున అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎంవీపీ పోలీసులు అదుపుకులోకి తీసుకున్నారని జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపారు. బంద్ కారణంగా స్టేషన్లో సిబ్బంది లేకపోవడంతో పండావీధిలో గల ఆయన భార్య ఎర్ని కుమారిని తీసుకొచ్చి బైండోవర్ చేసి పంపించేశామని వివరించారు. తరువాత ఏం జరిగిందో మాకు తెలియదని జేసీపీ తెలియజేశారు. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు ముగ్గురు సీఐల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బృందాలు తిరిగి వచ్చిన తరువాత వివరాలు తెలియజేస్తామని జేసీపీ వివరిచారు. ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు పైడిరాజు లాకప్ డెత్ అయ్యాడని ఆరోపిస్తున్నారని, రిటైర్డ్ కానిస్టేబుల్ జయకుమార్, సీఐ దుర్గాప్రసాద్‌లే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, తరువాత మృతదేహాన్ని అక్కడి నుంచి పోలీస్ జీపులో విజయనగరం తరలించి, అక్కడ దహనం చేశారని ఆరోపిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా... అందులో నిజం లేదని జేసీపీ ఖండించారు. వారు ఆరోపిస్తున్న రిటైర్ట్ కానిస్టేబుల్ జయకుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. విచారణలోనే నిజం తెలియాల్సి ఉందని, ఇంతకు మించి తమ వద్ద సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. పైడిరాజు బతికుంటేకోర్టుకు తీసుకురండి గొర్లి పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని విశాఖ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ఎన్.హెచ్.అక్బర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఆయన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జేసీపీ దాడి నాగేంద్రకుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేసీపీతో మాట్లాడుతూ గొర్లి పైడిరాజు అనే వ్యక్తిని సీసీఎస్‌కు తీసుకురావడం నిజం కాదా..? అని ప్రశ్నించారు. పైడిరాజును పోలీసులే లాకప్ డెత్ చేశారని ఆరోపించారు. బతికే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారని, అలాంటప్పుడు తక్షణమే పైడిరాజును కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని, లాకప్‌డెత్‌కు కారకులైన వారికి షోకాజ్ నోటీసులిచ్చి, జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను, సీఐని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీసీఎస్‌లో లాకప్‌డెత్ కలకలం..?
అల్లిపురం(విశాఖ దక్షిణం): విశాఖ నగరంలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీఎస్)లో మంగళవారం లాకప్ డెత్ జరిగినట్లు కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారం మేరకు... విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు గొర్లి పైడిరాజు (26)ను సీసీఎస్ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లు తెలిసింది. మంగళవారం అతడిని విచారిస్తున్న సమయంలో మృతి చెందినట్లుగా సమాచారం. తక్షణమే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారని, ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డాకు తెలియడంతో సీసీఎస్ ఏసీపీ వై.గోవిందరావును తన చాంబర్‌కు పిలిపించి హెచ్చరించినట్లు సమాచారం. సీసీఎస్ వద్ద హైడ్రామా విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏసీపీ గోవిందరావు ఎందుకు వచ్చారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. తరువాత సీసీఎస్‌లో ఉన్నవారు ఒకరొకరు వెళ్లిపోవడంతో స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. 6 గంటల తర్వాత మృతదేహం మార్చురీకిఅనుమానాస్పదంగా మృతి చెందిన గొర్లి పైడిరాజు మృతదేహాన్ని పోలీసులు మంగళవారం మధ్యాహ్నమే సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించారు. కానీ రాత్రి 8.45 గంటల సమయంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించటం విశేషం. ఈ ఆరు గంటల పాటు మృతదేహాన్ని పోలీసులు ఎక్కడ తిప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు విషయాన్ని బయటకు పొక్కకుండా చూద్దామని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరో పక్క మృతుడు గుండెపోటుతో చనిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మృతుడిపై ఆరు కేసులు మృతుడు గొర్లె పైడిరాజుపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిని సీసీఎస్ పోలీస్‌లు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. అతని సహ నిందితుడు దున్నా కృష్ణ సమాచారం కోసం విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గొర్లె పైడిరాజు మృతి చెందినట్లు సమాచారం. విచారణ జరుపుతున్నాం సంఘటపై విచారణ జరుపుతున్నాం. మృతుడు గొర్లె పైడిరాజును విచారణ నిమిత్తం తీసుకొచ్చాం. సోమవారం రాత్రి అతని భార్య వచ్చి తీసుకెళ్లిపోయింది. కానీ ఏం జరిగిందో పూర్తి విచారణ చేపట్టమని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. – దాడి నాగేంద్రకుమార్, జాయింట్ పోలీస్ కమిషనర్, విశాఖపట్నం. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాపురం చేయనని
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడేమో ఇంట్లో పెద్దవాళ్లకు ఇష్టం లేదు కాపురం చేయనని కరాఖండిగా చెప్పేశాడో ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు శుక్రవారం పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ(23), తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదిమాతాండ గ్రామానికి చెందిన బాణోయ అనసూయ(20) 2016 సంవత్సరంలో ప్రేమించుకున్నారు. ఆమె బి.ఫార్మసీ చదువుకుని హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. శివ రాజమండ్రి ఆదిత్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసేవాడు. వీరిద్దరూ 2017 డిసెంబర్ 23న స్నేహితుల సాయంతో సూర్యాపేటలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఐదు నెలల పాటు కాపురం చేసిన శివ అర్ధంతరంగా ముఖం చాటేశాడు. అదేమంటే తన ఇంట్లో తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది. పైగా రావికమతం ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ భవాని, సీడీపీవో మంగతాయారు.. శివకు వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
విశాఖపట్నం, గొలుగొండ: తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. చోద్యం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి కృష్ణదేవిపేట ఎస్ఐ రమేష్ అందించిన వివరాలిలావున్నాయి. చోద్యం గ్రామానికి చెందిన శ్రీపాద అనూష(24) గత ఏడాది శ్రీపాద సత్యన్నారాయణతో వివాహం అయ్యింది. భర్తతో పాటు అనూష తల్లిదండ్రులు చోద్యంలో నివాసం ఉంటున్నారు. అనూష తండ్రి కామేశ్వర శర్మ ఇంట్లోని చెవిదుద్దులు తీసుకువెళ్లారు. వాటిని తిరిగి తీసుకురాకపోవడంతో అనూషకు ఆయనకు మధ్య గొడవ జరిగింది. కాసేపటికి అంతా సద్దుమణిగింది. తరువాత అర్ధరాత్రి సమయంలో అనూష ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై వేసుకొని నిప్పంటుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కుటుంబ సభ్యులు మంటలు అర్పినా ప్రయోజనం లేకపోయింది. శరీరం కాలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనూష భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించిన యువతి పెళ్లి చెడగొట్టానన్న క్షోభతో..
విశాఖసిటీ, అగనంపూడి(గాజువాక): ప్రేమించిన యువతి దక్కడం లేదన్న అక్కసు ఓ పక్క.. పెళ్లి చెడగొట్టానన్న ఆత్మక్షోభ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు.. అగనంపూడి నిర్వాసితకాలనీ దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్ (28) ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రమేష్ ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు 2న రఘు అనే అతనితో వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ రఘు వద్దకు వెళ్లి మీరు పెళ్లి చేసుకోవాల్సిన యువతిని ప్రే మిస్తున్నానని, ఆ యువతి కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పడంతో రఘు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు రమేష్‌పై దువ్వాడ పో లీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం రమేష్‌పై కేసు నమోదు చేసి పూచీకత్తుపై రాత్రి ఇంటికి పంపించేశారు. ఇంటికి చేరుకున్న రమేష్ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ జేబులో దొరికిన సూసైడ్ నోట్లో యువతి చాలా మంచిదని, నాది వన్‌సైడ్ లవ్ అని, యువతిని దక్కించుకోడానికి నేను ఆమెపై నిందలు వేశానని, రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతూ లేఖ రాశాడు. రమేష్ తండ్రి నూకరాజు చిన్నతనంలోనే మరణించగా, తల్లి వరహాలమ్మ, అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. -
పిల్లలులేరని ఆర్మీ జవాన్ ఆత్మహత్య
విశాఖపట్నం,ఎస్.రాయవరం(పాయకరావుపేట): దేశ ప్రజలకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేసిన ఓ యువకుడు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు. తమ కళ్లముందు కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. చిన్న చెల్లి ఇంట్లో శుభాకార్యానికి వచ్చిన వారానికే ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో రామయ్యపట్నం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మీలో జవానుగా పనిచేస్తున్న నేదూరి నాగవెంకటసత్యనారాయణ (25) మంగళవారం తెల్లవారు జామున ఇంటివద్ద పురుగు మందుతాగాడు. గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇతను నాలుగున్నర ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి, అహ్మదాబాద్‌లో సిఫాయిగా పని చేస్తున్నాడు. చిన్న చెల్లి ఇంట్లో శుభకార్యానికి నెలరోజుల సెలవుపై వచ్చాడు. ఈ నెల 21న వచ్చిన నాగవెంకటసత్యనారాయణ బుధవారం చెల్లి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి అవసరమైన సరుకులు ,వస్తువులు కొనుగోలు చేశాడు. ఇంతలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న నాగవెంకటసత్యనారాయణకు పిల్లలు పుట్టక పోవడంవల్ల మనస్తాపానికి గురయ్యేవాడని, ఆ కారణం తప్ప ఆ యువకుడు చనిపోవడానికి మరో కారణం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. నాగవెంకట సత్యనారాయణ అంత్యక్రియలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కుమార్ స్వామి తెలిపారు. -
మూగజీవిపై ఇంటి యజమాని ప్రతాపం
సాక్షి, విశాఖపట్నం ,గాజువాక: అత్తపై కోపాన్ని దుత్తపై చూపించాడన్న సామెతను నిజం చేశాడో ప్రబుద్ధుడు. తన ఇంట్లో అద్దెకున్న వారిని ఏమీ చేయలేక వారు పెంచుకొంటున్న కుక్కపై తన ప్రతాపం చూపించాడు. అద్దెకున్న వారు ఇంట్లోలేని సమయంలో ఒక పెద్ద కర్ర తీసుకొని వారి కుక్కను చావబాదాడు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు సంబంధిత వ్యక్తిపై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరా కలీం అనే మహిళ తమ కుటుంబంతో కలిసి స్థానిక చినగంట్యాడ ఈ – సేవా కేంద్రం సమీపంలోని బి.రవిబాబు ఇంట్లో అద్దెకు నివాసముంటున్నారు. యజమాని అనుమతితో ఒక కుక్కపిల్ల (చార్లెస్ రూబీ)ను కూడా తీసుకొచ్చి పెంచుకొంటున్నారు. ఏడాది కాలంగా ఇంటి యజమానికి, ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. అగ్రిమెంట్ అమల్లో ఉండగానే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఫ్లోరా నిరాకరించారు. తనకున్న ఇబ్బందులను వివరించి కొద్దికాలంపాటు ఇల్లు ఖాళీ చేయలేనని తెలిపారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నడుస్తుండగానే ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తమ చర్చి ఫాదర్ మెమోరియల్ ప్రేయర్‌కు కుటుంబంతో సహా ఆమె వెళ్లిపోయారు. ఆ సమయంలో కుక్కను బాల్కనీలో కట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చిన వారికి కుక్క శబ్ధం చేయకపోవడంతో ఏదో అనుమానం శంకించింది. తీరా బాల్కనీలో చూస్తే కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాన్ని కదిపి చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కడం, ఒక్కసారిగా రక్తంతో కూడిన వాంతి చేసుకోవడంతో ఆందోళన చెందారు. అనంతరం తేరుకొని కుక్కకు వైద్యం చేయించారు. ఈ విషయంపై జంతు సంరక్షణ సొసైటీ ప్రతినిధులతో కలిసి గాజువాక పోలీసులకు 25వ తేదీ న ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు పోలీసుల పరిశీలనలో ఉంది. -
నవ వధువు ఆత్మహత్య
విశాఖపట్నం, రోలుగుంట(చోడవరం): పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. భర్త వద్ద రెండు నెలలు ఉండి, ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వచ్చింది. శ్రావణ మాసం రావడంతో అత్తవారు కోడలిని తమ ఇంటికి పంపించాలని కోరారు. మరో వారంలో కుమార్తెను అత్తవారింటికి పంపించేం దుకు ఆ తల్లి అన్నీ సిద్ధం చేసుకుని కుమార్తెతో బుధవారం రాత్రి ఆ విషయం చెప్పింది. మరి ఆ రాత్రి నవవధువు భూలక్ష్మి(19) ఏమనుకుందో, ఏమో గాని గురువారం రోలుగుంట సమీపంలో చెక్కల మిల్లు వద్ద బావిలో శవమై తేలింది. ఈ సంఘటన మండలవాసులను కలచివేస్తుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం కొండపాలెం గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబు, మణమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల వయస్సు దాటిన తరువాత సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు స్వామిని, కుమార్తె భూలక్ష్మిని తల్లి మణమ్మ కూలిపనులు చేస్తూ పోషించింది. కుమార్తెకు మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామానికి చెందిన అధికారి అప్పలనాయుడు, వరలక్ష్మిల కుమారుడు శ్రీనుతో ఈ ఏడాది మే 3వ తేదీన వివాహం జరిపించింది. అందరూ ఆనందించారు. అయితే విధి వక్రీకరించింది. ఆషాఢమాసానికి తన ఇంటికి వచ్చిన బిడ్డ, శ్రావణమాసంలో ఆనందంగా అత్తవారింటికి వెళుతుందని తల్లి పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె గుండెలు ఆవిసేలా రోదించింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని గురువారం స్థానిక పోలీసులకు మణమ్మ ఫిర్యాదు చేసింది. వివాహబంధంపై అంగాహన లేకే ఇలా చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ హరికృష్ణ, మండల మేజిస్ట్రేట్ పి.అప్పలనాయుడితో కలసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను విచా రించారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చరణ్.. ఓ నకిలీ పోలీస్
విశాఖ క్రైం, పీఎం పాలెం(భీమిలి): రోడ్డు పక్కన మద్యం తాగేవారు... అబ్బాయిలతో కలిసి ఉండే అమ్మాయిలు... రాత్రి వేళ ఒంటరిగా కనిపించే వారినే లక్ష్యంగా చేసుకుని పోలీస్ ఆఫీసర్ని అని బెదిరిస్తూ దోపిడీకి పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8లక్షల నగదుతో పాటు రూ.17లక్షల విలువ చేస్తే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నగర క్రైం డీసీపీ దామోదర్ బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మరాటీ సృజన కుమార్ అలియాస్ చరణ్(39) దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడడంతో కేసులు నమోదయ్యాయి. అక్కడ పోలీస్ కేసులతోపాటు నిఘా పెరగడంతో విశాఖ నగరానికి మకాం మార్చేశాడు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెం కేంద్రంగా దోపిడీలకు తెగబడ్డాడు. ఇక్కడే ఇల్లు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తూ నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. రోడ్డు పక్కన మద్యం తాగేవారు, అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయిలను భయపించి వారి నుంచి రూ.10వేల నుంచి భారీగా రూ.5లక్షల వరకూ దోచుకునేవాడు. దోచుకున్న నగదుతో విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు ఇంటిలోకి అవసరమైన ఆధునిక వస్తువులు కొనుక్కున్నాడు. పెద్దలకు భయపడి కొందరు, పరువు పోతుందని కొందరు ఈ దోపిడీ విషయాలను ఎవరికీ చెప్పకపోవడంతో చరణ్ ఆటలు సాగిపోయాయి. చివరకు ఓ బుల్లెట్ కొనుక్కుని దానిపై పోలీస్ ఆఫీసర్ని అంటూ లోగో స్టిక్కర్ కూడా అంటించాడంటే ఎంతకు తెగించాడో అర్థం చేసుకోవచ్చు. అత్యాశకు పోవడంతో చిక్కాడు జూలై 29న మధురవాడ ఉడా కాలనీ నుంచి వెళ్లే ఐటీ రోడ్డులో ఓ మహిళతో కారులో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లిన చరణ్ వారిని బెదిరించాడు. తాను పోలీస్ ఆఫీసర్‌ను అని, ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించడంతో సదరు జంట బెదిరిపోయారు. వారి మెడలోని బంగారు చైన్ లాక్కున్న తర్వాత... సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి బీరువాలోని నక్లెస్ కూడా లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా మరో రూ.5లక్షల నగదు ఇవ్వాలని బెదిరించడంతో సదరు వ్యక్తి స్నేహితుల నుంచి ఆ రాత్రి వేళ నగదు సమీకరించి చరణ్‌కు అందజేశాడు. జరిగిన ఘటనపై బాధితుడు పీఎం పాలెం పోలీస్‌లను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుని ఆనవాళ్లు, బుల్లెట్ వివరాలు ఆధారంగా నేర విభాగం సిబ్బంది చురుగ్గా స్పందిం చారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు నిఘా పెట్టి అనుమానం రాకుండా నార్త్ సబ్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మంగళవారం సాయంత్రం పోతిన మల్లయ్యపాలెంలో చరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై ఇప్పటికే పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఆరిలోవ పీఎస్‌లో రెండు, త్రీ టౌన్ పీఎస్‌లో ఒక కేసు నమోదయ్యాయి. చరణ్ వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 87.84గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.8.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితుని ఇంటిలోని వాషింగ్ మెషీన్, టీవీ, కూలర్, బుల్లెట్, మరో బైక్, కారు, ç2 కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని గుర్తించి ఆధారాలతో అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పీఎం పాలెం పోలీస్ స్టేసన్ సిబ్బంది పి.చిన్నరాజు, ఎం.శేఖర్, ఎస్ఐ జి.అప్పారావు, నార్త్ జోన్ సీఐలకు నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తరఫున డీసీపీ దామోదర్ రివార్డులు అందజేసి అభినందించారు. -
స్టూడెంట్ ని ఇంటికి పిలిచి..కరస్పాండెంట్ కీచక చర్య
విశాఖపట్నం ,అల్లిపురం : కీచక కరస్పాండెంట్‌ను శిక్షించాల్సిందే అంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డాబాగార్డెన్స్‌లో ప్రేమసమాజం ఎదుట గల విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంగళవారం కోపోద్రిక్తులయ్యారు. కళాశాలలో చదివే విద్యార్థినులతో కరస్పాండెంట్ గాది వెంకట సత్య నరిసింహ కుమార్ అలియాస్ కుమార్ కీచకుడిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం విద్యార్థులంతా కలిసి కళాశాలలో కుమార్‌ను నిలదీశారు. బాధితురాలి కథనం ప్రకారం... విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న బాధితురాలు కైలాసపురంలో గల కళాశాల హాస్టల్లో ఉండేది. అయితే హాస్టల్లో సౌకర్యాలు బాగోలేవని ఇటీవల బయట అద్దె గది తీసుకుని ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్ తల్లి కాలం చేయడంతో ఇంటి పనులున్నాయని బాధితురాలిని శుక్రవారం కుమార్ ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతని కాళ్లు పట్టుకుని బతిమలాడి అక్కడి నుంచి బయటపడింది. జరిగిన విషయాన్ని సోమవారం కళాశాలలో సహ విద్యార్థినులకు చెప్పి... తాను చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో విద్యార్థులంతా విషయాన్ని కళాశాలలో మరో ఉపాధ్యాయుడు సురేష్‌కు వివరించారు. ఆత్మహత్య చేసుకుని సాధించేదేముంది అంటూ బాధితురాలిని వారించారు. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కరస్సాండెంట్ కుమార్ కార్యాలయంలోకి వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్‌ని హెచ్చరించాల్సిందిపోయి మద్దతుగా నిలవడంతో విద్యార్థులు కోపోద్రోక్తులయ్యారు. కుమార్‌పై వారంతా తిరగబడేసరికి టూ టౌన్ పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై గతంలో మూడు కేసులు నిందితుడు కుమార్ గతంలో నర్సీపట్నంలో కూడా కళాశాలలు నడిపినట్లు అతని భార్య సాయిలక్ష్మి తెలిపింది. అతనిపై అక్కడ కూడా లైంగిక వేధింపులపై మూడు కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి కళాశాలలు మూసివేసి ఇక్కడకు చేరుకున్నాడని, అతడిని కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ వెంట తిప్పుకుంటుందని భార్య తీవ్రస్థాయిలో ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని ఆరోపించింది. వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థులకు పలువురి మద్దతు బాధిత విద్యార్థినితో పాటు కళాశాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీతో పాటు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక అండగా నిలబడ్డారు. కళాశాల విద్యార్థులతో కలిసి డాబాగార్డెన్స్ నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావుని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపులేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా వేరే కళా శాల ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించా లని డిమాండ్ చేశారు. లేకుంటే జీవీఎంసీ వద్ద భారీ ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కంచరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలు ఫిర్యాదు మేరకు కంచరపాలెం ఎస్ఐ ఉమ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. నిందితుడిని విచారిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ఈ మేరకు నగర పోలీస్ కుమార్ మహేష్‌చంద్ర లడ్డా నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అతని ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ప్రవర్తనపై విద్యార్థుల ఆగ్రహం ఫిర్యాదు తీసుకోకపోవడంతో టూ టౌన్ పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని, అతడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బైఠాయించారు. మరోవైపు ఎస్ఐ మహేష్ విద్యార్థులకు అండగా ఉన్న అధ్యాపకుడు సురేష్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఏ1గా సురేష్ పేరు పెడతామనడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి స్టేషన్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సంఘటన జరిగింది కైలాసపురం అయినందున అది ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. నిందితుడిని, బాధితులను అక్కడకు పంపిస్తామన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫ్లెక్సీలను చించివేశారు. కళాశాల అద్దాలు పగలగొట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించి వేశా>రు. కళాశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పండుగ ముందు విషాదం
సాగర్‌నగర్(విశాఖ తూర్పు): పండుగ ముందు రోజు విషాదం నెలకొంది. బక్రీద్ సందర్భంగా ఫొటోలు తీసుకునేందుకు వెళ్లిన వారిలో ఓ యుకుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జోడుగుళ్లపాలెం సీతకొండ దిగువన గల నాచురాళ్లుపై సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 16 ఏళ్ల యువకుడు జయూద్ గల్లంతయ్యాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదర్శనగర్ పరిధి రవీంద్రనగర్‌కు చెందిన అన్నదమ్ములు జయూద్, జయాన్, వారి స్నేహితుడు మాజీన్ కలసి మంగళవారం సాయంత్రం సముద్ర తీరంలో ఫొటోలు తీసుకోవడానికి వెళ్లారు. సీతకొండ వ్యూ ఫాయింట్ కిందన నాచురాళ్లపై నిల్చొని కొన్ని ఫొటోలు తీసుకున్నారు. వీరిలో జయూద్ కాస్త ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపోయి సముద్రంలో పడిపోయాడు. వెంటనే అలల తాకిడికి లోనికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన జయాన్, మాజీన్ ఆందోళనకు గురై ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు తెలియజేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో ఆరిలోవ సీఐ తిరుపతిరావు, ఎస్ఐ అప్పారావు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి గల్లంతైన జయూద్ కన్పించలేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహ్మద్ జబీర్‌కు జయూద్, జయాన్ కుమారులు. జయూద్ బాసర జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి సంవత్సరంగా చదువుతుండగా జయాన్ శ్రీనిధి మోడల్ స్కూళ్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. వీళ్ల స్నేహితుడైన మరో విద్యార్థి మాజీన్ శ్రీనిధి స్కూల్లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఇలాంటి విషాదం జరగడంతో జయూద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఇదే స్థలంలో సెల్ఫీలు తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురు యువకులు గల్లంతుయ్యారు. అయినా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడం విచారకరమని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువతిని కాపాడిన లైఫ్ గార్డ్స్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సముద్ర అలల తాకిడికి ప్రమాదానికి గురైన యువతిని లైఫ్‌గార్డ్స్ కాపాడారు. మెరైన్ సీఐ వి.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన బి.మీనాక్షి తీరంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయింది. వెంటనే గుర్తించిన లైఫ్‌గార్డ్స్ రంగంలోకి దిగి ఆమెను సురక్షితంగా రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం మీనాక్షిని ఆమె తండ్రికి అప్పగించారు. మెరైన్ ఏఎస్ఐ కుమార్, పోలీసులు కనకరాజు, లైఫ్ గార్డ్స్ లక్ష్మణ్ ఆమెను రక్షించారు. -
భార్యపై అనుమానం..భర్త రెండో పెళ్లి..!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): తన భర్త రెండో పెళ్లికి సన్నాహాలు చేసుకున్నాడని ఒక మహిళ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హెచ్‌బీకాలనీకి చెందిన బంగారు లక్ష్మికి 2006 జూన్ 20వ తేదీన కొయ్యూరు మండలం కాకరపాడు గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నండ్రు కృష్ణతో వివాహం జరిగింది. వీరికి 2009లో కుమారుడు జన్మించాడు. కాగా, బంగారులక్ష్మి 2014 సంవత్సరంలో విజయనగరం జిల్లా ఎస్.కోటలోని వివేకానంద డైట్ కళాశాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బంగారు లక్ష్మితో మాట్లాడడం భర్త చూశాడు. అప్పటి నుంచి అనుమానం పెంచుకున్న కృష్ణ భార్యని హింసిస్తున్నాడు. దీంతో ఆమె కుమరుడితో కలిసి పుట్టింటికి వచ్చేశారు. భార్య కాపురానికి రాకపోవడంతో భర్త కృష్ణ నర్సీపట్నం కోర్టులో కేసు వేశాడు. ఈ నేపథ్యంలో గిరిజన యువతి వంతల కొండమ్మను రెండో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలియడంతో బంగారులక్ష్మి పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. సీపీ సూచనల మేరకు ఆమె ఎంవీపీ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కేసుని ఎంవీపీ స్టేషన్ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ యాడ్‌తో రూ.3.73లక్షలకు టోకరా
అల్లిపురం(విశాఖ దక్షిణ): ఫేస్బుక్ యాడ్ ద్వారా పర్సనల్ లోన్ ఇప్పిస్తానని రూ.3.73లక్షలు కాజేసిన యువకుడిని సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌ఫోన్, రూ.59,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం సిటీ, ఉక్కునగరం, సెక్టార్ – 8కు చెందిన నిడదవోలు సత్య కిరణ్‌కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్లో పర్సనల్ లోన్ యాడ్ డిసిప్లే చూశాడు. దీంతో యాడ్ డిస్ప్లే చేసిన యువకుడు శ్రీకాకుళం జిల్లా, మొలియాపుట్టికి చెందిన శిరిగిడి ప్రవీణ్‌ను (6309761623) ఫోన్ ద్వారా సంప్రదించాడు. దీంతో ఆ యువకుడు మోసపూరిత మాటలతో బాధితునికి పర్సనల్ లోన్ ఇప్పించనున్నట్లు నమ్మబలికాడు. అందుకుగాను అతని అకౌంట్లో ప్రాసెసింగ్ ఛార్జీల కింద రూ.3,73,840 జమ చేయాలని చెప్పాడు. దీంతో సత్య కిరణ్‌కుమార్ ఆ మొత్తాన్ని ప్రవీణ్ అకౌంట్లో జమచేశాడు. డబ్బు జమ చేసిన తరువాత ప్రవీణ్ నుంచి సమాధానం లేకపోవడంతో తాను మోసపోయానని భావించి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్య కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 419, 420 ఐటీ యాక్ట్ 2000–2008, 66డీ సైబర్ క్రైం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ వి.గోపీనాథ్, ఎస్ఐ కె.రమేష్, కానిస్టేబుళ్లు కె.నాగేష్, జె.మురళి, బి.వి.రాంబాబు సహకారంతో నిందితుని గుర్తించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్బంగా సీఐ గోపీనాథ్ మాట్లాడుతూ ఇంటర్నెట్లో లోన్ యాడ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని, వాటిని నమ్మకూడదని హెచ్చరించారు. ఆన్లైన్ మోసంపై కేసు నమోదు పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మరో ఆన్లైన్ మోసంపై కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం పాలెం ఆఖరు బస్టాపు ప్రాంతానికి చెందిన ఎస్.లిఖిత్‌కుమార్ ఓఎల్ఎక్స్ వెబ్సెట్లో ఓ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. జయకిషన్ అనే వ్యక్తి వివో కంపెనీ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. రూ.12 వేలకు విక్రయించేందుకు అంగీకారం కుదిరింది. ఆ ప్రకారం ముందు రూ.5 వేలు ప్రకటనలో తెలిపిన బ్యాంకు అకౌంట్లో లిఖిత్‌కుమార్ జమ చేశాడు. మిగతా రూ.7 వేలు జమ చేస్తే ఫోను మీ సొంతం అవుతుందని జయకిషన్ చెప్పడంతో మిగిలిన మొత్తం కూడా జమ చేశాడు. అనంతరం నెల రోజులు కావస్తున్నా ఫోన్ పంపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన లిఖిత్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దన్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ
విశాఖ క్రైం: నగరంలో సంచలనమైన రౌడీషీటర్ మహ్మద్ ఖాసీం హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు కత్తులు, ఒక పిస్టల్, బుల్లెట్స్, స్టీల్ రాడ్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ఈ నెల 2వ తేదీ(గురువారం రాత్రి) 10.50 గంటల సమయంలో ఎల్ఐసీ భవనం దరి(అంబేడ్కర్ విగ్రహం సమీపంలో) ఖాసీంను చిట్టుమామూతో పాటు మరో ఆరుగురు కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మేరుగు చిట్టిబాబు–42(అలియాస్ చిట్టిమామూ), అంబటి మధుసూదనరావు–26(అలియాస్ రుషికొండ మధు), గుడ్ల వినోద్‌కుమార్‌రెడ్డి(26), శీలం సతీష్(23), సయ్యద్ రెహమాన్–24(అలియాస్ మున్నా), చొప్పా హేమంత్‌కుమార్(23), గత్తాడ శ్రీనివాస్(22)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా వివరించారు. గొడవలే హత్యకు కారణం హత్యకు గురైన ఖాసీం, చిట్టిమామూ మధ్య కొన్నేళ్లుగా గొడవులు ఉన్నాయి. ఆధిపత్యం ఈ ముఠాలు ఘర్షణ పడుతుండేవి. ఖాసీం 2010 నుంచి పలు హత్య కేసుల్లో నిందితుడు. చిట్టిమామూ సోదరుడు, కంచరపాలేనికి చెందిన నగష్‌ను ఖాసీం హత్య చేశాడు. నగరంలో ఖాసీం, బత్తిన మురళీ, చిటిమామూల వర్గాల మధ్య వార్ జరుగుతుండడంతో వీరిపై పీడీ యాక్ట్ పెట్టారు. 2017లో చిట్టిమామూ, బత్తిన మురళీ జైలు నుంచి విడుదలయ్యారు. ఖాసీం ఈ ఏడాది జూన్ 12న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి చిట్టిమామూ.. ఖాసీంను హతమార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో చిట్టిమామూ మూడు నెలల కిందట మధు అనే వ్యక్తి పేరు మీద పాత ఆటో(ఏపీ31టీఏ 7472)ను కొనుగోలు చేశాడు. అనకాపల్లిలో సింగ్‌ల వద్ద కత్తులు కొనుగోలు చేశాడు. జూలై 27, 2018న చిట్టిమామూ.. మధుకు ఒక పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లు అందజేశాడు. దీంతో ఖాసీంను హతమార్చేందుకు వ్యూహం రచించారు. ముందుగా ఖాసీం వర్గానికి చెందిన బత్తిన మురళీని గురువారం(ఈనెల 2న) కైలాసపురంలో హత్య చేయడానికి చిట్టిమామూ ముఠా ప్లాన్ చేసింది. అయితే మురళీ చుట్టు పక్కల ఎక్కువ మంది జనాలు ఉండడంతో హత్యకు వీలు కాలేదు. అక్కడి నుంచి వెనుదిరిగిన చిట్టిమామూ ముఠా ఉదయం నుంచే ఖాసీం కదలికలపై రెక్కీ నిర్వహించింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఖాసీం డైమండ్ పార్కు సమీపంలోని సాయిరాం పార్లర్ వద్దకు వస్తాడన్న సమాచారంతో ఆర్యకుమార్, శ్యామ్, శ్రీను, వేముల ఆనంద్, పవన్, ప్రసాద్, గాది వెంకటేష్ కాపు కాశారు. అయితే ఖాసీం రాత్రి 10 గంటలకు సాయిరాం పార్లర్ వద్దకు వచ్చాడు. హత్య చేయడానికి ప్రయత్నించినా జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడే కాపు కాశారు. ఖాసీం రాత్రి 10.30 గంటల సమయంలో సాయిరాం పార్లర్ నుంచి ఎల్ఐసీ భవనం మీదుగా డాబాగార్డెన్స్ వైపు హోండాయాక్టివ్(ఏపీ 31 డీఎన్ 8662)పై ఇంటికి వెళ్తున్నాడు. ఆయనను అంబటి మధు, జి.వినోద్‌రెడ్డి పల్సర్–220 మోటార్ బైక్‌పై, ఆటోలో సయ్యద్ రెహమాన్, చొప్పా హేమంత్‌కుమార్, శీలం సతీష్, రాజేష్ వెంబడించారు. రెహమాన్ డ్రైవింగ్ చేశాడు. హోండా యాక్టివ్ సాయి నడుపుతుండగా.. వెనక ఖాసీం కూర్చున్నాడు. ఆటోతో హోండో యాక్టివ్‌ను ఢీకొట్టారు. దీంతో కింద పడిన ఖాసీంను మధు పిస్టోల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అది పేలకపోవడంతో ఆటోలో ఉన్న వారు కత్తులతో ఖాసీంపై దాడి చేశారు. తల, మెడ, కడుపుపై కత్తులతో బలంగా నరికేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు రాజేష్ పారిపోయాడు. మిగతా ఐదుగురు, చిట్టిమామూ ఇంటికి వెళ్లారు. ఆ తరువాత ఐదుగురితో పాటు చిట్టిమామూ కలిసి మోటర్ సైకిల్, ఆటోలో ఎన్ఏడీ జంక్షన్‌కు వెళ్లి అక్కడున్న శ్రీనుకు పిస్టోల్ అందజేశారు. కశింకోట వెళ్లి స్నేహితుల వద్ద రూ.10 వేలు తీసుకొని అన్నవరం వెళ్లారు. అన్నవరంలోని బస్టాండ్ రోడ్డు వద్ద ఆటోను వదిలేసి, కాకినాడకు వెళ్లిపోయారు. మరుసటి రోజు 3న కారులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లారు. మళ్లీ తిరిగి రాజమండ్రి జొన్నాడకు చేరుకున్నారు. మరో వైపు పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఎన్‌హెచ్–16 తాడి గ్రామంలో ఆటోల వెళ్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఉన్న ఆరు కత్తులు, ఒక పిస్టోల్, ఒక స్టీల్ రాడ్, కారంపొడిని స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ నగరంలో రౌడీయిజం చేస్తే తాటాతీస్తానని సీపీ హెచ్చరించారు. ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ ఫకీరప్ప, ఎస్బీ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసిం హత్య’
సాక్షి, విశాఖపట్నం : ఆధిపత్య పోరే రౌడీ షీటర్ ఖాసిం హత్యకు కారణమని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. ఆగస్టు రెండో తేదీన జరిగిన ఈ హత్య కేసును ఛేదించిన సీపీ మహేష్‌చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు.. ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసింను హత్య చేశారని, ఈ హత్యకు ముందు అతని అనుచరుడు బతిన మురళిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని. అయితే అతడు రాకపోయే సరికి మళ్లీ డైమండ్ పార్క్ సాయిరామ్ పార్లర్ వద్ద రెక్కీ నిర్వహించారని, వాహనాలతో వెంబడించి ఖాసింను హతమార్చారని ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులైన మెరుగు చిట్టి బాబు అలియాస్ చిట్టి మాము, అంబటి అంబటి మధుసూదన్ రావు అలియాస్ ఋషికొండ మధు, గుడ్ల వినోద్ కుమార్ రెడ్డి అలియాస్ రామాటాకీస్ వినోద్, శీలం సతీష్, సయ్యద్ రెహాన్ అలియాస్ మున్నా, చొప్పా హేమంత కుమార్, గతడ శ్రీనివాసులు ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఒక పిస్టల్, రెండు రౌండ్ల బుల్లెట్లు, ఆటో, ఆరు పదునైన కత్తులు, ఒక స్టీల్ రాడ్, కారంపోడి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి
గోపాలపట్నం: ఓ కారుడ్రైవరు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గోపాలపట్నంలో సంచలనంగా మారింది. ఉరిపోసుకుని మరణించినట్లు బయటకు కనిపించినా ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికి బంద కాదని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..గోపాలపట్నం శివారు యల్లపువానిపాలెం సంతోష్‌నగర్ రైలు ట్రాకుల వద్ద చెట్టుకి ఓ వ్యక్తి ఉరిపోసుకుని ఉన్నట్లు గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ పైడియ్య ఆధ్వర్యంలో ఎస్ఐ మహంతి శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతదేహం సమీపంలో గుర్తింపు కార్డులు కనిపించాయి. గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుడు నెయ్యిల లక్ష్మణరావు (42)గా గుర్తించారు. కార్డుల సాయంతో అతని అడ్రసు కనుగొన్నారు. ఇతను వడ్లపూడిలోని రైల్వేక్వార్టర్స్ వద్ద నివాసం ఉంటున్నట్టు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి కేజీహెచ్‌కి తరలించారు. సంఘటనా స్థలంలో లభ్యం అయిన కార్డుల్లో ఈశ్వరరావు అనే న్యాయవాది కార్డు కూడా ఉంది. విషాదంలో మృతుని కుటుంబం లక్ష్మణరావు మృతిచెందాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుని భార్య అరుణని గోపాలపట్నం పోలీసులు విచారించారు. తన భర్త ఓ న్యాయవాది వద్ద కారు డ్రైవరుగా పని చేస్తున్నాడని, ముందూమునుపూ ఎవరితోనూ వివాదాలు లేవని చెప్పింది. తమకు పదమూడేళ్ల కుమార్తె ఉందని, ఇంత వరకూ అన్యోన్యంగానే ఉన్నామని, కుటుంబ కలహాల్లేవని, అప్పులు వంటివి కూడా ఆమె తెలిపింది. పోస్టు మార్టం నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
దారి తప్పి.. చోరీల బాటపట్టి
భీమునిపట్నం ,విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలయ్యారు... అందుకు అవసరమైన డబ్బుల కోసం చోరీల బాటపట్టారు. ఈక్రమంలో అపహరించిన బైక్‌లు విక్రయించేందుకు యత్నించగా... అనుమానించిన పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు. భీమిలి పోలీస్ స్టేషన్లో క్రైం డీసీపీ దామోదర్ వెల్లడించిన వివరాల ప్రకారం... భీమిలి సమీపంలోని బ్యాంక్ కాలనీకి చెందిన కొల్లేటి శ్రావణకుమార్(19) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ఇతను ప్రధాన సూత్రధారిగా ఉండగా అదే ప్రాంతానికి చెందిన కారు మెకానిక్ కర్రిశెట్టి పైడిరాజు(21), విజయగరానికి చెందిన పల్లి రవీంద్రకుమార్(27) జట్టుకట్టారు. వీరు ముగ్గురూ కలిసి భీమిలి, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఆరు బుల్లెట్లు, ఆరు స్కూటీలు, రెండు బైక్‌లు అపహరించారు. వరుస చోరీలపై అందిన ఫిర్యాదులపై స్థానిక ఎస్ఐ కె.మధుసూదనరావు దర్యాప్తులో భాగంగా పలుచోట్ల నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వెల్డర్ శావణ్‌కుమార్ రోజుకో ద్విచక్ర వాహనంపై తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతనిపై కదలికలను పరిశీలించారు. ఈ క్రమంలో శ్రావణ్ ఓ మెకానిక్ షాప్ వద్దకు వెళ్లి... తన వద్ద కొత్త ద్విచక్ర వాహనం ఉందని, దాన్ని విక్రయించేస్తానని చెప్పాడు. అనుమానించిన సదరు మెకానిక్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగుచూసింది. దీంతో పైడిరాజు, రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం 14 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలతో సంబంధం ఉందని భావిస్తున్న కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ, ఇతర సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీలు గోవిందరావు, నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ బాలసూర్యారావు పాల్గొన్నారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
విశాఖపట్నం, అనకాపల్లి టౌన్: అనకాపల్లి– పూడిమడక రహదారిలో వరుణ్ మోటర్ షోరూమ్ వద్ద గల ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం రాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంక్ సిబ్బంది, స్థానికులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖాతాదారుల అవసరం నిమిత్తం మంగళవారం బ్యాంక్ ఏటీఎం సిబ్బంది రూ. 8 లక్షల నగదును ఏటీఎంలో భద్రపరిచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకూ వర్షం కురవడంతో పక్కనే ఉన్న దుకాణాలను రోజూ కంటే ముందుగానే మూసివేశారు. రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో ఏటీఎం షట్టర్‌ని మూసివేసి వెళ్లిపోయారు. బ్యాంకు సిబ్బంది బుధవారం వచ్చి ఏటీఎం షట్టర్‌ను తెరిచి చూడగా మిషన్ లోపలిభాగం డోర్తీసి, గ్యాస్‌కట్టర్‌తో కట్టి చేసిన ఉంది. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఏటీఎం మిషన్ ముందు డోర్‌ని తీశారుకానీ నగదు ఉన్న డోర్‌ను తీయలేకపోయారు. పట్టణ ఎస్ఐ అప్పన్న, క్లూస్‌టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. -
పోలీసుల అదుపులో చిట్టిమాము ముఠా
విశాఖ క్రైం: నగరంలో సంచలనం రేపిన రౌడీషీటర్ ఖాసీం హత్య కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని నగరంలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. హత్యలో ప్రధాన సూత్రధారుడు చిట్టిమాము అని నిర్థారించిన పోలీసులు ఆ ముఠా కదలికలపై దృష్టి సారించారు. ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఉన్నట్లు అనుమానించి 6 బృందాలతో విస్తృతంగా గాలించారు. చివరకు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం హత్యలో కీలకమైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని నగరానికి తీÜసుకొచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి వారిని విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు... హత్యలో మొత్తం 14 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వీరిలో ఆరుగురు గురువారం రాత్రి 10.30గంటల సమయంలో ఖాసీంను రోడ్డు మీద కత్తులతో నరికారని, మిగిలిన వారంతా సమీపంలోని తోపుడుబళ్ల వద్ద కాపు కాచారని తెలిసింది. ఆ సమయంలో ఖాసీం తప్పించుకుని ముందుకు వస్తే అక్కడ అంతమొందించేందుకు ముగ్గురు మాటువేశారని, వేరే మార్గంలో తప్పించుకునేందుకు యత్నించినా మట్టుబెట్టేందుకు వీలుగా పక్క రోడ్డులో ముగ్గురు, మరో చోట ఇద్దరు కాపుకాచారని తెలిసింది. చిట్టిమాము సోదరుడితోపాటు అతని ప్రాణ స్నేహితుడు కిరణ్‌ను హతమార్చినప్పటి నుంచి ఖాసీంపై పగ పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కిరణ్ హత్య తర్వాత అతని భార్య చిట్టిమాముకు ఓ ఫిస్టల్ ఇచ్చిందని, ఖాసీం హత్య రోజు కత్తులతో దాడి చేసినప్పటికీ తప్పించుకుంటే ఆ ఫిస్టల్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్యలో కీలకమైన చిట్టిమాముతోపాటు సీతంపేటకు చెందిన వినోద్, రుషికొండకు చెందిన చిట్టి, షణ్ముక, మధుతో కలిపి మొత్తం ఐదుగురు అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరందరినీ రెండు రోజుల్లో మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో డీసీపీ ఫకీరప్ప, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సారథ్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలతో పాటు పలువురు సిబ్బంది నిందితులను పట్టకోవడంలో కీలకపాత్ర పోషించారు. -
బైక్ రేసర్లపై కొరడా
విశాఖ క్రైం: నగర పరిధిలోని బీచ్‌రోడ్‌లో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆదేశాల మేరకు శనివారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. భీమిలి, ఎంవీపీ, పీఎంపాలెం, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఆరిలోవ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీ నిర్వహించి 100 బైక్‌లను సీజ్ చేశారు. ఇందులో 13 బైక్‌లను మైనర్లు నడిపినట్టు గుర్తించారు. కొంత మంది మైనర్లు బైక్‌లు వదిలి వెళ్లిపోయారు. పోలీస్ బ్యారెక్స్‌లో ఆదివారం సీజ్ చేసిన బైక్‌లను ప్రదర్శనలో పెట్టి , రేసులో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ పకీరప్ప మాట్లాడారు. ఎవరైనా ద్విచక్ర వాహనాలను అతివేగంగా, సైలెన్సర్లు తీసి అధిక శబ్ధంతో నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల పై విన్యాసాలు చేయడం, రేసింగ్‌లు పూర్తిగా నిషేధమన్నారు. ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబం ధనలను ఉల్లంఘించి నడిపిన 100 బైక్‌లను సీజ్ చేశామని, వాహనచోదకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ రెండో సారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, స్పీడ్ గన్ల ద్వారా బైక్‌రేసర్లను గుర్తిస్తామన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా బైక్ రేసర్ల సమాచారం వచ్చిందని, నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టుబడిన వారిలో ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉన్నాడని, అతనిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాహనాలు తల్లిదండ్రుల పేరు మీద ఉంటే.. వారికి జరిమానా విధిస్తామన్నారు. సీజ్ చేసిన బైక్‌లను డంపింగ్ యార్డుకు పంపిస్తున్నట్లు తెలిపారు. నగరంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 508, మెట్రిక్ సంస్థ ద్వారా 1,648 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్, నాగేశ్వరరావు, సీఐలు శ్రీనివాస్, ఈశ్వరరావు, లక్ష్మణమూర్తి, సింహచలం, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
పుట్టిన రోజునే.. అనంతలోకాలకు..
విశాఖపట్నం ,అక్కిరెడ్డిపాలెం(గాజువాక): పుట్టిన రోజు వేడుకలను ఓ యువకుడు ఆనందంగా జరుపుకున్నాడు. ఏమైందో గానీ అందరూ నిద్రపోయిన తర్వాత తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో విషాదం నింపాడు. జీవీఎంసీ 59వ వార్డు రెడ్డి తుంగ్లాలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి గాజు వాక పోలీసులు తెలిపిన వివరాలివి. ఆటోనగర్ సాహు వాలా సిలిండర్స్ కంపెనీ ఎదురుగా రెడ్డి తుంగ్లాంలో నివసిస్తున్న మాణివెళ్తి అప్పారావు, నాగమణి దంపతులకు సంతోష్ కుమార్, శ్యాంకుమార్ (25)లు కుమారులున్నారు. వీరంతా తమ సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. శ్యాంకుమార్ ఆటోనగర్‌లోని ఓ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతను శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి రాత్రి ఆనందంగా గడిపాడు. అనంతరం అందరూ తమ గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. శ్యాం తప్పితే అందరూ ఆదివా రం ఉదయం నిద్రలేశారు. అతను బాగా నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యులు తలచారు. ఉదయం 10 గంటలు కావస్తున్నా అతను నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు గట్టిగా బాదారు. గది కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు చూడగా శ్యాం మంచంపై అచేతనంగా పడి ఉన్నాడు. మొహం గోడకు తగిలి, నేలపై తీవ్ర రక్తస్రావం అయి ఉండటంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఎస్ఐ మన్మథరావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. శ్యాంకుమార్ చీరతో ఫ్యాను ఉరివేసున్నాడని, ప్రాణం పోయే క్షణంలో చీర ముడివీడటంతో కిందకు పడిపోయాడని పోలీసులు తెలిపారు. మొహం గోడకు తగలి దవడ వద్ద తీవ్ర గాయం కారణంగా రక్తస్రావం జరిగిందన్నారు. అనంతరం గాజువాక సీఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. అయితే యువకుడు ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు. -
తుపాకీతో బెదిరించి.. కత్తులతో నరికారు
విశాఖ క్రైం/అల్లిపురం/ డాబాగార్డెన్స్: నగరంలో జరుగుతున్న రౌడీ షీటర్ల వరస హత్యలతో ప్రజలు నిర్ఘాంతమైపోతున్నారు. ఏ హత్యకు ఆ హత్య విభిన్న పంథాలో జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బైక్‌పై వస్తున్న ఖాసీంను ఆటోతో ఢీకొట్టడం, కింద పడ్డ అతన్ని తుపాకీతో గురిపెట్టి అచేతనంగా ఉంచి కత్తులతో దారుణంగా హత్య చేయడం.. అంతటా చర్చనీయాంశమైంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే ఇలాంటి నేర సంస్కృతి.. ప్రశాంత విశాఖలో పురి విప్పడంతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొంది. రౌడీషీటర్ మహ్మద్ ఖాసీంను గురువారం రాత్రి 10 గంటల సమయంలో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బైక్‌పై డైమండ్ పార్క్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ మీదుగా ఖాసీం ఇంటికి వెళ్తున్నాడు. వెనుక ఆటోలో కత్తులతో వస్తున్న ప్రత్యర్థులు ఎల్ఐసీ భవనం ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టారు. ఖాసీం బైక్‌పై నుంచి పడిపోయాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీ తీసి ఖాసీం తలపై గురిపెట్టాడని, ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఖాసీంను తుపాకీతో గురిపెట్టిన వ్యక్తి చిట్టిమాముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పిస్టల్ ఎవరిదనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కమిషనర్ లడ్డా ఆదేశాల మేరకు టూటౌన్, ఎంఆర్పేట పరిధిలో రౌడీ షీటర్లను తెల్లవారుజామున ఆరు గంటలకే స్టేషన్లకు తరలించారు. వారు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఖాసీం హత్య కేసులో అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా చిట్టిమాము, రుషికొండ మధు, రామాటాకీస్ మధు, టెక్కం లక్ష్మణ, షణ్ముఖ్, చలువతోట మధు, కల్యాణ్‌లతో పాటు మరికొంత మంది పేర్లు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఘటన అనంతరం చిట్టిమాముతో పాటు అతని భార్య కూడా కనిపించకపోవడంతో..ఈ కేసులో చిట్టిమాము పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఖాసీం పోస్టుమార్టం సమయంలో అతని అనుచరుడు మురళీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాతకక్షలే కారణమని అనుమానం ఖాసీం హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఖాసీం మేనల్లుడు తెలుగు అనిల్. అతని హత్య కేసులో ప్రధాన నిందితుడు పొడుగు కిరణ్ గ్యాంగ్‌కు, ఖాసీం గ్యాంగ్‌కు మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. పొడుగు కిరణ్‌పై రెండు సార్లు దాడులు జరగడం, కిరణ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడం తదితర ఘటనలు చేసుకున్నాయి. మరో వైపు చిట్టి మాము తమ్ముడు హత్య కేసులో ఖాసీం ఒకడు. వన్‌టౌన్‌లో 1992లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఖాసీం. కప్పరాడలో జరిగిన జంట హత్య కేసులో చిట్టిమాము తమ్ముడిని ఖాసీం హత్య చేశారు. జిల్లా పరిషత్‌లో లచ్చా అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో కూడా ఖాసీం నిందితుడు. ఈ నేపథ్యంలో పొడుగు కిరణ్ వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న చిట్టిమాము, అతని అనుచరులు ఖాసీం పట్ల గుర్రుగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు గురువారం రాత్రి ఒంటరిగా దొరికిన ఖాసీంపై దాడికి పాల్పడి మట్టుబెట్టారు. హత్య అనంతరం వారంతా పరారయ్యారు. నిందితుల కోసం మూడు బృందాలు.. ఖాసీం హత్య కేసులో దర్యాప్తు కోసం మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నాయి. ఖాసీం హత్య కేసును పోలీస్ కమిషనర్ లడ్డా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖాసీం మృతదేహానికి పోస్ట్‌మార్టం ఖాసీం మృతదేహానికి శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఖాసీం మద్దతుదారులు అధిక సంఖ్యలో మార్చురీకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా హడావుడిగా మారింది. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందుగానే మార్చురీ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ పరిసర ప్రాంతాల్లో గుంపుగా ఉన్న యువకులను చెల్లా చెదురు చేశారు. ప్రధాన గేట్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమతి లేనిదే ఎవర్నీ లోపలికి పంపలేదు. అనుమానం వచ్చిన వారిని గేట్ అవతలే ఉంచారు. గుర్తింపు కార్డు చూసి ఉద్యోగులను వదిలారు. అలాగే క్యాజువాల్టీ వద్ద పోలీసులు మొహరించారు. ఏవీఎన్ కాలేజ్ డౌన్రోడ్డులోని గేట్‌ను మూసివేశారు. అడుగడుగునా పోలీసులు ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళనకు గురయ్యారు. -
పినతల్లి ఇంటికి వస్తే.. ప్రే..ముంచాడు
విశాఖపట్నం ,పాయకరావుపేట: ప్రేమించానని నమ్మించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోమంటే నిరాకరించి బెదిరిస్తున్నాడని ఓ యువతి శుక్రవారం మహిళా సమాఖ్య ప్రతినిధులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని పాతపేటకు చెందిన ఒక యువతి అప్పుడప్పుడు పండుగలకు నర్సీపట్నంలో ఉంటున్న పినతల్లి ఇంటికి వెళ్లేది. అక్కడ అత్తిలి భాస్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మిన ఫలితంగా అతడి ద్వారా గర్భం దాల్చినట్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని భాస్కర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అడిగితే రూ. 5 లక్షలు కట్నం కావాలన్నారని,గర్భం తీయించి వేసుకుంటే పెళ్లి చేసుకుంటానని బెదిరి స్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను నమ్మించి మోసం చేసిన భాస్కర్‌తో తనకు వివాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధిత యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆమెతో పాటు మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు బందుల సుబ్బలక్ష్మి, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వి.శివప్రసాద్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి ఎరుపల్లి రమణమ్మ , మహిళా సమాఖ్య మండల కార్యదర్శి ఎలిపే సత్యవతి ఉన్నారు. -
బంగారం కేసులో.. పోలీసుల దొంగాట
దొంగ బంగారం కేసులో అసలు కథ.. కాదు కాదు.. ఆట ఇప్పుడే మొదలైంది..కేసును ఛేదించి అసలు నిందితులను జైలులో పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లొంగి గోప్యంగా కేసును చాపచుట్టేయాలనుకున్నారు..దాన్ని కాస్త ‘సాక్షి’ రట్టు చేయడంతో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు.. ‘గుమ్మడి కాయల దొంగ’.. అంటే భుజాలు తడుముకున్నట్లు తాజా వివరాల కోసం ఏ అధికారిని అడిగినా.. తాను చూడటం లేదంటే.. తాను చూడటం లేదని కప్పదాటు వైఖరి అనుసరిస్తున్నారు..టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్చల్ చేస్తున్న ఓ నగల వ్యాపారి అరకేజీ దొంగ బంగారంతో నాలుగు రోజుల క్రితం దొరికిపోవడం.. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు అతన్ని వదిలిపెట్టిన వైనం విశాఖ పాత నగరంలో కలకలం రేపింది.దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఆరా తీసిన సాక్షికి పోలీసుల దొంగాట కూడా తెలిసొచ్చింది. తమకు సంబంధం లేదని చెబుతున్న పోలీసు అధికారులే మరోవైపు గురువారం రాత్రి ఈ కేసును సెటిల్ చేసేందుకు గోపాలపట్నం స్టేషన్లో ‘పంచాయితీ’ పెట్టడం విశేషం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చోరీ బంగారం కేసు విచారణలో పోలీసులు దొంగాట మొదలెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వార్డు అధ్యక్షుడు కావడం, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు ఎవరికి వారు తప్పించుకునే ధోరణి అవలంభిస్తున్నారు. ఆ కేసులో అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టిన పోలీసులు నిజాయితీగా వివరాలు చెబుతున్నప్పటికీ పై అధికారులు మాత్రం కప్పదాటు వైఖరినే నమ్ముకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ వార్డు అధ్యక్షుడిగా హల్చల్ చేసే ఓ నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దొంగ బంగారం క్రయ, విక్రయాల్లో ఆరితేరిన వ్యాపారిగా గతంలోనే రికార్డులకెక్కిన అతని తాజా భాగోతాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసలు బండారం దొంగ బంగారం’ శీర్షికతో గురువారం సాక్షిలో వచ్చిన కథనం కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. వారం కిందట కిందట కంచరపాలెం క్రైం పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగలు ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి వన్‌టౌన్ కురుపాం మార్కెట్ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై పోలీసులు దాడి చేసి అరకేజీ బంగారంతోపాటు పది కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. తాము చోరీ చేసిన బంగారాన్ని ఓ న్యాయవాది ద్వారా టీడీపీ నేతకు చెందిన షాపులోనే విక్రయించామని దొంగలు చెప్పడంతో ఆ షాపులో పనిచేస్తున్న యువకుడితో పాటు ధర్మకాటా వ్యాపారం చేసే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసి మంగళవారం స్టేషన్‌కు వెళ్లిన షాపు యజమాని అయిన టీడీపీ నేతను స్టేషన్లోనే కూర్చోబెట్టి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఇంతలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి.. నేర విభాగానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసిన దరిమిలా కంచరపాలెం పోలీసులు నిందితులను విడిచిపెట్టారు. అయితే రికవరీలో భాగంగా టీడీపీ వార్డు అధ్యక్షుడిని పది తులాల బంగారం, అతని షాపులో పని చేస్తున్న యువకుడిని ఐదు తులాలు, ఇద్దరు ధర్మకాటా వ్యాపారులను తలో పది తులాలు.. అంటే మొత్తం 35 తులాల బంగారం ఇవ్వాలన్న పోలీసుల షరతుకు వారు అంగీకరించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.30గంటల సమయంలో కంచరపాలెం పోలీసులు రీడింగ్‌రూమ్ ప్రాంతంలోని అపోలో ఫార్మసీ సమీపంలో ఉన్న ఓ జ్యూయలరీ షాపు నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను ఓ ధర్మకాటా వ్యాపారి తరఫున తీసుకెళ్లారు. ఇంత జరిగినా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్టే వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. -
నిరుద్యోగులకు వల
ఆరిలోవ(విశాఖ తూర్పు): వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఓ ప్రబుద్ధుడు వల చేసి, లక్షల్లో దండేశాడు. తీరా ఉద్యోగాలు లేకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో టాస్క్ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు జిల్లా పరిషత్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సాయికృష్ణ పరిచయమయ్యాడు. కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి సాయికృష్ణ.. కోటేశ్వరరావుతో పరిచ యం పెంచుకున్నాడు. జిల్లాలో ఏదైనా పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో ఉద్యోగం ఇప్పిస్తానని, డీఎంహెచ్‌వో, ఇతర వైద్యాధికారులు తనకు బాగా తెలుసని నమ్మించాడు. అలా కోటేశ్వరరావు వద్ద రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ విషయం కోటేశ్వరరావు తన స్నేహితులతో చెప్పడంతో విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన మరో 8 మంది, శ్రీకాకుళం జిల్లా, విశాఖ నగరానికి చెందినవారు సుమారు 30 మంది రూ.35,000లు నుంచి రూ.లక్ష వరకు సాయికృష్ణకు చెల్లించారు. పీహెచ్సీలలో కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మించి ఈ ఏడాది జూన్ మొదటి వారంలో డబ్బులు వసూలు చేశాడు. రెండో వారంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. చేతికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తానంటూ కొందరిని కాకినాడ రీజనల్ హెల్త్ సెంటర్‌కు కూడా తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు లాడ్జీలో ఉంచాడు. కొద్ది రోజులు పడుతుందని అధికారులు అన్నారని మాయమాటలు చెప్పి తిరిగి పంపించేశాడు. జూలై గడిచినా ఉద్యోగాలు రాలేదని, సాయికృష్ణ మోసం చేశాడని బాధితులు గ్రహించారు. సాయికృష్ణను పరిచయం చేసిన కోటేశ్వరరావుని బాధితులు నిలదీశారు. దీంతో కోటేశ్వరరావు తాను కూడా బాధితుడినేనని, మిగిలిన బాధితుల సహకారంతో ఇటీవల టాస్క్ఫోర్సు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నగరంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకొన్న సాయికృష్ణను ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. మిగిలిన బాధితులు కూడా స్టేషన్‌కు వచ్చి సాయికృష్ణ తమకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. ఆరిలోవలో రెండో ఫిర్యాదు ఇదిలా ఉండగా సాయికృష్ణ ఆరు నెలల క్రితం ఇదే విధంగా నిరుద్యోగులను మోసం చేయడంపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అప్పట్లో కూడా నగరానికి చెందిన కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. వారంతా హనుమంతవాక వద్ద సాయికృష్ణను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ ఇదే మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశాడు. ఇప్పుడు రెండో ఫిర్యాదు నమోదైంది. సాయికృష్ణ వలలో పడి ఇలా నిరుద్యోగులు తరచూ మోసపోతున్నారు. ద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తి అరెస్ట్ అల్లిపురం(విశాఖ దక్షిణ): నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించిన వ్యక్తిని టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జీవీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ పార్కు దరి హెచ్‌బీ కాలనీకి చెందిన గాడి సత్యసూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ హైదరాబాద్ యల్లారెడ్డి గూడెంలోని సన్ సిటీ అపార్టమెంట్స్‌లో నివసిస్తున్నాడు. ఈయన గత నెల జూలైలో విశాఖపట్నం వచ్చి డాల్ఫిన్ హోటల్లో బస చేశాడు. ఆ సమయంలో ఆయన నేవల్ అధికారుల వస్త్రధారణలో, కెప్టెన్‌గా నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు. ఉద్యోగం అవసరమైన వారిని గుర్తించి వారిని హోటల్‌కు ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేసేవాడు. ఇలా అక్కయ్యపాలెంలో సరోజా హాస్పటల్ వద్ద నివసిస్తున్న హుకుంపేటకు చెందిన బుడ్డిగ తరుణ్‌కుమార్‌ను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హోటల్‌కు పిలిచాడు. అతని వద్ద నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. ఆ తరువాత శశికాంత్ ముఖం చాటేయడంతో తరుణ్‌కుమార్ మోసపోయానని గ్రహించి గత నెల 30న టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీఐ, తన సిబ్బందితో కలసి నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శశికాంత్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. బాధితులు 9440904716, 7989359509 నంబర్లలో ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. -
మన్యంలో దొంగనోట్లు
విశాఖ, చింతపల్లి(పాడేరు):మన్యంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. వారపుసంతలు వేదికలుగా చేసుకుని వ్యాపారులు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వారపుసంతలో తమ్మంగులకు చెందిన ఓ గిరిజన రైతు అటవీఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించాడు. గుర్తు తెలియని వ్యాపారి అధిక ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అత్యాశకు పోయిన గిరిజనుడు రూ.2 వేల నోటు తీసుకుని ఉత్పత్తులను విక్రయించాడు. నిత్యావసర సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రెండు వేల నోటు ఇవ్వగా సదరు వ్యాపారి నోటు నకిలీదని తెలిపాడు. రెండు వేల నోటు మిగతా నోట్లకు భిన్నంగా ఉండండతో గిరిజనుడు ఆ నోటును చించివేసి వెళ్లిపోయాడు. -
కంచరపాలెంలో తాగుబోతుల హల్చల్
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మద్యం సేవించి మత్తు తలకెక్కిన కొందరు బర్మా క్యాంపు సమీపంలోని దివ్య వైన్ షాపు వద్ద తీవ్ర రాద్ధాంతం చేశారు. చుట్టు పక్కల వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా బుధవారం సంచలనం రేపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి బర్మా క్యాంప్ వద్ద రవి, గణేష్ అనే యువకులు బుధవారం సాయంత్రం తాగిన మైకంలో హల్చల్ చేశారు. దీంతో ఇక్కడ గొడవ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు రక్షక్ వాహనంలో వెళ్తే... వారిపై కూడా గణేస్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయాడు. రవిని పట్టుకోగా శరీరంపై కొన్ని దెబ్బలు ఉండడంతో చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన గణేష్ కోసం గాలిస్తున్నారు. రవి బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, గణేష్ కప్పరాడకు చెందినవాడని గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసు భర్తపై ఫిర్యాదు
విశాఖ క్రైం: విశాఖపట్నం రూరల్ అదనపు ఎస్పీ(క్రైం)గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్జే రాజ్‌కుమార్ తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకొని తనకు అన్యాయం చేశారని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అతని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ లతా మంజు బుధవారం మాట్లాడుతూ 1987లో నమ్మె రాజ్‌కుమార్‌తో తనకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని, కొంతకాలం కాపురం చేసిన తర్వాత గుట్టుగా గంగాభవానీ అనే మహిళను వివాహం చేసుకొని ఇప్పుడు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పుట్టింటికి పంపించేసి ఒంటరి మహిళగా చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మా నాన్న పలుమార్లు అడిగితే అధికార బలంతో సమాధానమిచ్చేవారనీ, ఇప్పుడు మా తండ్రి కూడా మరణించడంతో అడిగే దిక్కులేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యగా, నామినీగా పోలీస్ సర్వీస్ రికార్డుల్లో తన పేరుని మార్చి రెండో భార్య పేరుని చేర్చి తనకు తీవ్ర అన్యాయం చేశారనీ, అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని లతామంజు విజ్ఞప్తి చేశారు. అదనపు ఎస్పీ ఈ నెలలో రిటైర్ అవుతుండగా, నామినీగా రెండో భార్య పేరు గంగాభవానీని అక్రమంగా చేర్చిన తీరుని పరిశీలించి తనకు న్యాయం చేయాలని డీజీపీని కోరానని ఆమె తెలిపారు. -
అసలు బండారం.. దొంగ బంగారం
అధికారం.. అదీ రాజకీయాధికారం ఉంటే చాలు.. ఏదైనా చేసేయొచ్చు!.. ఎంత పెద్ద కేసు నుంచైనా అనాయాసంగా బయటపడిపోవచ్చు!!..గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతలు సాగిస్తున్న దందాలు.. అధికార యంత్రాంగంపై చేస్తున్న స్వారీలు చూస్తే ఈ విషయంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనపించకమానదు..భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఇతరత్రా పలు రకాల దందాలతో చోటామోటా నేతలు సైతం బడాబాబులుగా రూపాంతరం చెందుతున్నారు.. కోట్లకు పడగలెత్తుతున్నారు..ఈ దుష్ట సంస్కృతికి కొనసాగింపే.. తాజాగా వెలుగులోకి వచ్చిన దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత అక్రమ దందా.. అదే దొంగ బంగారం కొనుగోలు దందా..వృత్తి కార్మికునిగా జీవితం ప్రారంభించిన ఈ టీడీపీ నేత.. తొలి నుంచీ ఈ వ్యవహారాల్లోనే రాటుదేలాడు.. కోట్లు కూడబెట్టాడు..ఇక టీడీపీ అధికారంలోకి రావడం.. స్థానిక ఎమ్మెల్యే దన్ను దొరకడం, చిన్నపాటి నామినేటెడ్ పోస్టు కూడా లభించడంతో మరింత రెచ్చిపోయి చోరీ బంగారం కొనుగోళ్ల మోతాదు పెంచాడు..అయితే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయడంతో పెద్దమొత్తంలో దొంగ బంగారంతో అడ్డంగా దొరికిపోయాడు..అయితే ఏం.. అధికారం ఉంది కదా.. ఇలా ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లడం.. అలా అక్కడి ఫోన్ మోగడం.. ఎమ్మెల్యేగారి అధికార స్వరం వినిపించడంతో.. దాడుల వరకు పక్కాగా జరిపిన పోలీసులు నీరుగారిపోయారు.. అయ్యగారిని వదిలేసి.. కేసును సాగదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లతో ఇప్పటికే నగరాన్ని చెరబట్టిన టీడీపీ నేతలు.. తమ దందాల్లో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. దొంగ బంగారం కొనుగోళ్లు, విక్రయాల కేసుల్లోనూ తమదే పైచేయి అని నిరూపించుకుంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం వార్డు అధ్యక్షుడిగా, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుడిగా హల్చల్ చేస్తున్న ఓ నగల వ్యాపారి దొంగ బంగారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అయితే అధికారం అండతో వెంటనే బయటకొచ్చేశాడు. వాస్తానికి దొంగ బంగారం కొనుగోలు, విక్రయాల్లో ఎప్పటి నుంచో ఆరితేరిన వ్యాపారిగా పేరున్న ఈయన ఇప్పటికే చాలాసార్లు పోలీసు రికార్డులకెæక్కాడు. తాజాగా మూడురోజుల కిందట కంచరపాలెం పోలీసులు పక్కా సమాచారంతో కురుపాం మార్కెట్ సమీపంలోని సదరు టీడీపీ నేతకు చెందిన జ్యూయలరీ షాపుపై దాడి చేశారు. అక్కడ అరకేజీకి పైగా దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకుని షాపును మూయించేశారు. సదరు వ్యాపారి కమ్ నేతను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఓ న్యాయవాది మధ్యవర్తిత్వంలో ఓ దొంగ నుంచి ఆ బంగారం కొనుగోలు చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు ఆ మేరకు కేసు ఫైల్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈలోగా టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి.. ఒత్తిడి చేయడంతో, అతన్ని విడిచిపెట్టి.. ప్రస్తుతానికి విచారణను కొనసా...గిస్తున్నారు. గతమంతా నేర చరిత్రే వాస్తవానికి ప్రస్తుతం పట్టుబడిన వ్యాపారికిది మొదటి కేసేమీ కాదు. ఆయన గత చరిత్రంగా కేసులమయమే, 1991లోనే దొంగ బంగారం కేసుల్లో ఆయనపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత రాజకీయ నేతగా రూపాంతరం చెందాక సస్పెక్ట్ షీట్‌ను తీయించేసుకున్నప్పటికీ.. అతని వ్యాపారశైలి మాత్రం మారలేదు. మూడేళ్ల కిందట ఇదే వ్యాపారి అలియాస్ టీడీపీ నేతను నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పరదేశిపాలెం సర్వే నెంబర్–2లో 5.26 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. సదరు టీడీపీ నేత ఫోర్జరీ పత్రాలతో ఆ భూములకే టైటిల్ డీడ్, పట్టా చేయించేసుకున్నాడు. దీనిపై స్వయంగా ఇప్పటి జిల్లా కలెక్టర్, అప్పటి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు 420, 468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఇక 2007లో సహచర జ్యూయలరీ వ్యాపారులు పల్లా సత్తిబాబు, కొలుసు అప్పలరాజులను బంగారం రికవరీ విషయంలో ఇబ్బంది పెట్టడంతో వారు అప్పట్లో హోంమంత్రి మొదలుకుని అందరికీ ఫిర్యాదుచేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఐ కుమార్ దొంగ బంగారం కొనుగోలు చేశారని వచ్చిన సమాచారంతో టీడీపీ వార్డు అధ్యక్షుడు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ నాయకుడిని అదుపులోకి తీసుకుని విచారించామనికంచరపాలెం క్రైం ఎస్సై కుమార్ తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ అతన్ని అదుపులోకి తీసుకున్నా ఇంకా బంగారం రికవరీ చేయలేదని, కేసు విచారణ దశలో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని అన్నారు. -
యలమంచిలిలో చోరీ
విశాఖపట్నం, యలమంచిలి: పట్టణంలోని రామ్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది.రామ్‌నగర్ శివారు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గొర్లె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు ప్రవేశించి ఏడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. ఇంటి బయట శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటి వెనుక తలుపు తాళం తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలను చోరీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు విశాఖ డెయిరీలో టెక్నికల్అసిస్టెంట్గా పనిచేస్తుండడంతో తెల్లవారుజామున లేచి డ్యూటీకి బయలుదేరే సమయంలో ఇంటిలో వెళ్లగా చూడగా వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా తెరిచి, దుస్తులు చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్టు గుర్తించాడు. బాధితుని ఫిర్యాదుమేరకు యలమంచిలి టౌన్ ఎస్ఐ నారాయణరావు ఆ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు.దొంగలను పట్టుకునేందుకు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. -
డ్రైవింగ్ నేర్చుకొంటూ యువతి దుర్మరణం
ఆరిలోవ(విశాఖ తూర్పు): డ్రైవింగ్ నేర్చుకొంటూ డివైడర్ని ఢీకొని ఓ యువతి మృతి చెందిన సంఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చినవాల్తేరు ప్రాంతానికి చెందిన పావని(16) నగరంలోని రామాటాకీస్ దరి మహవీర్ బుక్ షాపులో పనిచేస్తుండేది. ఆమెకు ఆరిలోవ ప్రాంతం జైభీమ్ నగర్‌కు చెందిన కిరణ్‌తో పరిచయమైంది. కిరణ్ ఆమెకు బైక్ డ్రైవింగ్ నేర్పడానికి ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో రుషికొండ తీసుకెళ్లాడు. బీచ్ రోడ్డులో డ్రైవింగ్ నేర్చుకొనే క్రమంలో బేపార్కు వద్ద మలుపులో ఆమె నడుపుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు పొట్టలో బలమైన గాయమైంది. అదే సమయంలో నడకకోసం వెళ్లిన వారు 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. పావని పెదనాన్న పీలా రమణ ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఏఎస్ఐ బ్రహ్మాజీ కేసు నమోదు చేశారు. -
అనైతిక బంధం హత్యకు పురిగొల్పింది
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): పెళ్లికి ముందే దారి తప్పింది. ఆ అనైతిక బంధాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో... ఏకంగా భర్తనే అడ్డు తొలగించేస్తే వివాహేతర బంధానికి ఏ ఇబ్బందీ ఉండదని భావించింది. అనుకున్నదే తడువుగా ప్రియుడు, అతని స్నేహితునితో కలిసి ప్రణాళిక రచించి అంతమొందించారు. 104 ఏరియాలో సంచలనం రేపిన నటరాజ్ హత్యకేసును ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు ఛేదించారు. ఏసీపీ లంక అర్చున్ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కొబ్బరితోటకు చెందిన నటరాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన పార్వతితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే అప్పటికే పార్వతికి జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన మినరల్ వాటర్ కేన్లు ఇంటింటికీ సరఫరా చేసే మురళి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో నటరాజు దుబాయ్ వెళ్లడంతో మరికొంత స్వేచ్ఛ లభించింది. మురళి స్నేహితుడు కొమ్మాది ప్రాంతానికి చెందిన కూర్మాన గణేష్ ఇంట్లో తరచూ ప్రియుడు మురళితో పార్వతి గడిపేది. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న నటరాజ్ భార్యతోపాటు మురళీని మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవడంతో కొద్ది నెలల కిందట మురళిపై నటరాజ్ దాడి చేశాడు. దీనిపై అప్పట్లో రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. ప్రాంతం మారినా మారని తీరు నటరాజ్, పార్వతి దంపతులకు పదేళ్ల కుమార్తె, ఐదేళ్ల పాప ఉన్నారు. ఈ క్రమంలో కొబ్బరితోట ప్రాంతంలో ఉంటే భార్య ప్రవర్తన వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, వేరే ప్రాంతానికి వెళ్తే ప్రశాంతంగా గడపవచ్చని నటరాజ్ భావించాడు. దీంతో 104 ఏరియా సమీపంలోని బాపూజీనగర్ ప్రాంతంలో ఆరు నెలల కిందట ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నటరాజ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయినప్పటికీ పార్వతి తీరులో మార్పు రాకపోవడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తన వివాహేతర బంధానికి అడ్డంగా ఉన్న భర్తనే తొలగించుకోవాలని పార్వతి భావించింది. అనంతరం ప్రియుడు మురళిని సంప్రదించి అతని స్నేహితుడు కొమ్మాది ప్రాంతానికి చెందిన గణేష్ ఇంటిలోనే ప్రణాళిక రచించారు. పక్కా ప్రణాళికతో హత్య హత్యకు ప్రణాళిక రచించిన మురళి, పార్వతి, గణేష్ ముందుగా ఓ ఆన్లైన్ విక్రయ సంస్థలో కత్తిని బుక్ చేసుకున్నారు. అది వచ్చిన తర్వాత హత్యకు సిద్ధమయ్యారు. ఈ నెల 18వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 104 ఏరియా నుంచి నటరాజ్ నడుచుకుంటూ బాపూజీనగర్‌లోని ఇంటికి వస్తున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసిన మురళి, గణేష్ వెనుక నుంచి బీరు బాటిళ్లతో నటరాజ్‌పై దాడి చేశారు. అనంతరం కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. నటరాజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మురళి, గణేష్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పార్వతిని తమ అదుపులో ఉంచి విచారిస్తున్నారు. -
క్షణికావేశంలో కఠిన నిర్ణయం!
అల్లిపురం(విశాఖ దక్షిణ): టీవీలో చానల్ మార్చడంలో తండ్రి, కూతురు మధ్య జరిగిన గొడవ ఆ తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. పిల్లలతో సర్దుకుపోవాల్సిన పెద్దాయన క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశారు. మనస్తాపంతో తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట పరిధి, కృష్ణానగర్‌లో నక్కా కొండలరావు(52) తన కుటుంబంతో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూమార్తె సాయి ప్రశాంతితో కలిసి కొండలరావు టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో తండ్రీ కుమార్తెకు మధ్య టీవీ చానల్ మార్పు విషయంలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొండలరావు మనస్తాపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా తలుపుల తీసి చూశారు. అప్పటికే ఆయన తాడుతో ఇంటిపై కప్పుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు మృతదేహాన్ని దించి గుట్టుగా అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికకు తరలించారు. అక్కడి శ్మశానవాటిక సిబ్బంది మృతదేహం మెడ భాగంలో తాడు బిగుసుకున్న గుర్తులు గుర్తించారు. దీంతో వారు శ్మశానవాటిక ఇన్‌ఛార్జి ప్రసన్నకుమార్‌కు తెలియజేయటంతో ఆయన మహారాణిపేట పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్ఐ రామకృష్ణ శ్మశాన వాటికకు వచ్చి కుటుంబ సభ్యులుతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.