
అరుణ మృతదేహం
సాక్షి, రోలుగుంట(విశాఖపట్టణం) : పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ఓ యవతి బావిలోకి దూకి అత్యహత్య చేసుకుంది. దీనిపై మృతురాలి తండ్రి మడ్డు రమణ సోమవారం చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.ఉమామహేశ్వరావు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంటకు చెందిన మడ్డు రమణ, సత్యవేణి దంపతుల కుమార్తె అరుణ(17) కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7వ తేదీన రోలుగుంటలో తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆ సమయంలో మేనమామాను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు...కుమార్తెను కోరారు. అయితే తాను అప్పుడే పెళ్లి చేసుకోనని ఆమె చెప్పింది. మేనమామను పెళ్లి చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టం లేదని తెలిసింది. రాత్రి తల్లిదండ్రులతోనే కలిసి భోజనం చేసి సరదాగా గడిపింది.
అదే రోజు రాత్రి గణపతి విగ్రహ ఊరేగింపునకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుమార్తె కోసం తల్లిదండ్రులు గాలించారు. 8వ తేదీన కూడా బావుల వద్ద గాలించారు. కొట్టే వీధిలో గల బావిలో శవమై కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఉమాహేశ్వరరావు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి, విచారణ జరిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment