విశాఖ, చింతపల్లి(పాడేరు):మన్యంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. వారపుసంతలు వేదికలుగా చేసుకుని వ్యాపారులు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వారపుసంతలో తమ్మంగులకు చెందిన ఓ గిరిజన రైతు అటవీఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించాడు. గుర్తు తెలియని వ్యాపారి అధిక ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అత్యాశకు పోయిన గిరిజనుడు రూ.2 వేల నోటు తీసుకుని ఉత్పత్తులను విక్రయించాడు. నిత్యావసర సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రెండు వేల నోటు ఇవ్వగా సదరు వ్యాపారి నోటు నకిలీదని తెలిపాడు. రెండు వేల నోటు మిగతా నోట్లకు భిన్నంగా ఉండండతో గిరిజనుడు ఆ నోటును చించివేసి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment