సాక్షి, విశాఖపట్నం : ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువకుల నుంచి డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది. వివరాలు.. గాజువాకకు చెందిన అగస్త్యన్ అనే వ్యక్తి నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. అయితే ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడం.. తమ డబ్బులు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు అగస్త్యన్‌ను నిలదీశారు. అంతేగాక అతనిని ఇన్నోవా కారులో ఎక్కించి తీసుకెళ్తుండంతో తనను కిడ్నాప్ చేశారని అగస్త్యన్ పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశాఖ డైరీ వద్ద కారును పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు విచారణ చేపట్టారు. (బాధితుడితో పాటు కిడ్నాపర్లూ నేరస్తులే..)
కాకినాడ సీఎస్‌ఐ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్క యువకుడి నుంచి 10 లక్షలు చొప్పున అగస్త్యన్ వసూలు చేసినట్లు పోలీసుల ప్రథమిక విచారణలో తేలింది. మొత్తం 50 లక్షలు పైనే వసూలు చేసినట్లు వెల్లడైంది. ఎంత కాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు అగస్త్యన్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు అన్నారు. కాకినాడ నుంచి విశాఖ వచ్చిన అగస్త్యన్‌కు కారులో వెంబడించి, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఛీటింగ్ కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై గాజువాక పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా వల్ల మహిళలకే సమస్యలు:)
Comments
Please login to add a commentAdd a comment