
ఇళ్లపట్టాలు ఇప్పించాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నివాసం ఉంటున్న పుర ప్రజలకు జీవో నెంబర్ 76 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇప్పించాలని సీపీఐ నాయకులు కోరారు. గురువారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ఎ. వెంకటస్వామి, బి.పూర్ణిమ, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు ఆడేపు రాజమౌళి, బి.లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల రాజేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.