AP Assembly Session 2022: Speaker Thammineni Angry Over TDP Members - Sakshi
Sakshi News home page

అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవమే లేదు.. ప్రజలు గమనించాలి: స్పీకర్‌ తమ్మినేని

Published Fri, Sep 16 2022 12:35 PM | Last Updated on Fri, Sep 16 2022 1:21 PM

AP Assembly Session: Speaker Thammineni Angry Over TDP members - Sakshi

టీడీపీ సభ్యులు ఎప్పుడూ ఇదే విధంగా వ్యవహరిస్తోంది. వాళ్ల తీరును ప్రజలు గమనించాలి. అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవం లేదు.

సాక్షి, అమరావతి:  అసెంబ్లీలో సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గురువారం కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు. 

‘టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనించాలి. అసెంబ్లీ అంటే టీడీపీకి గౌరవం లేదు. ఎప్పుడూ ఇదే విధంగా వ్యవహరిస్తోంది. తోటి సభ్యుల హక్కులను కాలరాస్తోందని స్పీకర్‌ మండిపడ్డారు. ఈ మేరకు టీడీపీ సభ్యులను సభ నుంచి ఒక్కరోజుపాటు సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. 

రెండో రోజు సమావేశాల్లో సభ జరుగుతుండగా.. నినాదాలతో మంత్రులు, స్పీకర్‌ ప్రసంగాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు టీడీపీ సభ్యులు. సజావుగా సాగాలనే విజ్ఞప్తులను వాళ్లు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. నిన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తొలిరోజు కూడా టీడీపీ సభ్యుల తీరు ఇలాగే ఉంది. దీంతో నిన్న కూడా వాళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement