
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ మధ్య కర్ణాటక మీదుగా విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 40 మి.మీ, మచిలీపట్నంలో 24, కొవ్వూరులో 23, చంద్రగిరిలో 20, అల్లవరంలో 10, మామిడికుదురులో 9 మి.మీ. వర్షపాతం నమోదైంది.
(చదవండి: డైవర్షన్ డ్యాం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం)