
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు బుధవారం నుంచి తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి.
కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.