Woman Sexually Harassed By Private Hospital Senior Assistant In Chittoor - Sakshi
Sakshi News home page

Chittoor Crime: సర్టిఫికెట్‌ కోసం వస్తే.. చాక్లెట్‌, గ్రీన్‌ ఇంక్‌ పెన్ను.. చివరకు గదిలోకి రమ్మని..

Published Wed, Feb 23 2022 8:50 AM | Last Updated on Wed, Feb 23 2022 12:53 PM

Woman Molested by Senior Assistant in Chittoor District - Sakshi

సీనియర్‌ అసిస్టెంట్‌ కల్పించుకుని తొలుత ఆ మహిళను చాక్లెట్‌ తీసుకురావాలని కోరాడు. ఆ తర్వాత గ్రీన్‌ఇంక్‌ పెన్ను అడిగాడు. ఆపై పక్కగదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేశాడు. బయటకు వచ్చిన మహిళ దరఖాస్తు ఫారాన్ని అక్కడే చింపేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది.

సాక్షి, చిత్తూరు: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ మంగళవారం సర్వీస్‌ సర్టిఫికెట్‌ కోసం వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాలు.. చిత్తూరుకు చెందిన ఓ మహిళ జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్‌ కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వహించింది. ఇటీవల డీసీహెచ్‌ఎస్‌ పరిధిలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో సర్వీస్‌ సర్టిఫికేట్‌ కోసం అధికారులను ఆశ్రయించింది.

సీనియర్‌ అసిస్టెంట్‌ కల్పించుకుని తొలుత ఆ మహిళను చాక్లెట్‌ తీసుకురావాలని కోరాడు. ఆ తర్వాత గ్రీన్‌ఇంక్‌ పెన్ను అడిగాడు. ఆపై పక్కగదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేశాడు. బయటకు వచ్చిన మహిళ దరఖాస్తు ఫారాన్ని అక్కడే చింపేసి విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. వారు హుటహుటిన ఆస్పత్రికి చేరకుని సీనియర్‌ అసిస్టెంట్‌ను చితకబాదారు. కాళ్లవేళ్ల పడి బతిమలాడడంతో వదిలిపెట్టారు. జరిగిన విషయాన్ని సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌కు వివరించడంతో అక్కడే సర్దుబాటు చేశారు.   

చదవండి: (సాధారణ టికెట్‌తోనే రిజర్వ్‌డ్‌ కోచ్‌లో ప్రయాణం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement