
సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్డులో వైఎస్సార్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పార్టీ జెండాను వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి ఆవిష్కరించారు.
సాక్షి, విజయవాడ: సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్డులో వైఎస్సార్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పార్టీ జెండాను వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్‌రెడ్డి ఆవిష్కరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పునూరు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతిగా ఉన్నారన్నారు. ‘‘ఆప్కస్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 1,30,000 మందికి పర్మినెంట్ ఎంప్లాయిస్ తీసుకొచ్చారు. నాలుగు లక్షల మందిని వాలంటీర్లు ఏర్పాటు చేశారు’’ అని గౌతమ్‌రెడ్డి తెలిపారు.
సంక్షేమం అందించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: దేవినేని అవినాష్
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులను, కార్మికులను ఇబ్బంది పెట్టలేదని.. ఆటో కార్మికులకు వైఎస్ జగన్ రూ.పదివేలు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు కార్మికులు అభ్యున్నతను విస్మరించారు. కోవిడ్ సమయంలో కార్మికులకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఎస్సార్‌సీపీ ప్రతి గ్రామంలో కార్మికులకు అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చి..
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాహన మిత్రతో కార్మికులకు అండగా నిలిచారు. చంద్రబాబు వాలాంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను ఎత్తివేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ప్రశాంతంగా విధులు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు. సంవత్సరం గడుస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం లేదు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేం అని గవర్నమెంట్ రాకమందు చంద్రబాబు తెలియదా’’ అంటూ ఆమె ప్రశ్నించారు.
కార్మికులకు వ్యతిరేకంగా కూటమి సర్కార్ నిర్ణయాలు: మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2 వేల మందికి ఆటో కార్మికులకు చేయూతను అందించింది. కూటమి ప్రభుత్వంలో ఆటో కార్మికులపై చలనాలు చేస్తున్నారు. 9 నెలల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు ఏం చేశారో చెప్పాలి. విజయవాడ నగరంలో హ్యాకర్లుపై దౌర్జన్యలు పెరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? నిన్న(గురువారం) జరిగిన పరిషత్ ఎన్నికలో విజయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు ఆపలేకపోయారు. ఎంపీటీసీలు, జడ్పిటిసిలు వైఎస్సార్‌సీపీ పక్షాన బలంగా నిలబడ్డారు’’ అని ఆయన చెప్పారు.