
అమెజాన్ భారత్‌లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్‌కు సంబంధించిన టీజర్‌ను అమెజాన్ విడుదల చేసింది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్‌లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్‌లో పేర్కొంది.
ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు!
అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్‌పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది.
స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపులు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్‌మీ (Redmi 12C) ఫోన్‌ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999.
సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు, వాటి యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్‌ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్‌లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలపై..
టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో కస్టమర్‌లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ వై సిరీస్ హెచ్‌డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్‌జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది.
ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..