రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్‌ రోబోలు.. వీడియో వైరల్‌ | Humanoid Robots Make Coffee Videos Viral | Sakshi
Sakshi News home page

Humanoid Robot: కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్‌ రోబోలు..

Published Fri, Jan 19 2024 2:35 PM | Last Updated on Fri, Jan 19 2024 2:58 PM

Humanoid Robots Make Coffee Videos Viral - Sakshi

ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తయారుచేస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల తరం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. 

మనిషికి సాధ్యంకాని పనులు చేయడం, అతడు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను  తట్టుకోవడం.. ఇవన్నీ కేవలం మర మనుషులకు (రోబోలకు) మాత్రమే సాధ్యం.

తాజాగా ‘ఫిగర్‌.ఏఐ’ సంస్థ సౌత్‌కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్‌ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేదతీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. 

కంపెనీలు తమ సంస్థల్లో హ్యూమనాయిడ్‌ రోబోలను వినియోగించడం కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్‌ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్‌ గతంతోనే వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement