
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‍యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.
మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్‍యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి.