
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 19) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది. ఈ విధానం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ వంటి అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల్లో నిన్నటి పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. గత ఐదు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 19న పెట్రోల్ ధర లీటరుకు ఏయే నగరంలో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ.107.46
విజయవాడ: రూ.109.74
న్యూ ఢిల్లీ: రూ.94.77
ముంబై: రూ.103.50
కోల్‌కతా: రూ.105.01
చెన్నై: రూ.101.03
బెంగళూరు: రూ.102.98
అహ్మదాబాద్: రూ.94.58
లక్నో: రూ.94.58
పాట్నా: రూ.106.11
డీజిల్ ధరలు
డీజిల్ ధరలు కూడా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య విభిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 19న డీజిల్ ధరలు లీటర్‌కు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: రూ.95.70
విజయవాడ: రూ.97.57
న్యూ ఢిల్లీ: రూ.87.67
ముంబై: రూ.90.03
కోల్‌కతా: రూ.91.82
చెన్నై: రూ.92.39
బెంగళూరు: రూ.90.99
అహ్మదాబాద్: రూ.90.17