
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్‌లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్‌లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు.
కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.
Wow what a landing...
Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024