
అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ, మనసును సాంత్వన పరచడంలోనూ టీ ని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు.
టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి.
ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. గుండెల్లో మంట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి.
నిద్ర సమస్యలు...
కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ కి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
పేగులపై దుష్ప్రభావం...
అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్‌ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.