
తమన్నా తన రాబోయే చిత్రం ఓదెల- 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమన్నాసెక్యూరిటీఅధికారిణి అద్భుతమైన భద్రతా నైపుణ్యాలు విశేషంగా నిలిచాయి.
తమన్నా ప్రమోషన్ ఈవెంట్‌కు హాజరవ్వడం కోసం ముంబైలోని తన నివాసం నుంచి బయటకు వచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ ఉన్న తమన్నాకు మించి ఆమెకు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్ అందర్నీ ఆకర్షించింది. తమన్నాకు రక్షణ కల్పిస్తూ...రద్దీ రోడ్‌లో ఆ పోలీసు అధికారిని మార్గాన్ని క్లియర్ చేసింది. అక్కడున్న వారిని తప్పుకోమని కోరుతూ.. సైడ్ సైడ్ అంటూ తమన్నాకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ‘సైడ్..సైడ్’ అంటూ అక్కడున్న వారిని నియంత్రిస్తున్న ఆమె వీడియో వైరల్‌గా మారింది.
ఆమె పని తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. డ్యూటీలో ఆమె అంకితభావానికి, నైపుణ్యానికి ముగ్ధులయ్యారు, వాటే పోలీస్ ఆఫీసర్ అని ఒకరు, "మహారాష్ట్ర లేడీ పోలీస్ ఆఫీసర్" మరో యూజర్ కమెంట్ చేశారు. దీంతో హీరోయిన్ తమన్నాకు మించి క్రేజ్ సంపాదించుకుంది ఈ మహిళా పోలీసు అధికారి.