
పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లులు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు. అల్లరి బిడ్డ నిద్రలోకి జారుకుంటే ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదయా! ఇలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా ఈసారి తన సరికొత్త పోస్ట్‌లో స్వాతంత్య్ర వేడుకల గురించి మాట్లాడింది!. నిద్రిస్తున్న తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రియాంక.
‘మీ సూపర్ యాక్టివ్ బేబీ నిద్రపోతుంటే’ అని ప్రియాంక ఈ వీడియోను పరిచయం చేసింది. దీంతోపాటు లాఫింగ్ ఇమోజీని కూడా షేర్ చేసింది. కొన్ని సెకన్ల తరువాత టామ్, జెర్రీ డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో పాట వినిపిస్తుంది. ఈ వీడియోకు ‘ఆజాదీ’ అనే కాప్షన్ ఇచ్చింది. కూతురు అల్లరి చేయకుండా హాయిగా నిద్రపోవడమే... తనకు స్వాతంత్య్ర వేడుక!.
(చదవండి: 'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణవివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై.. )