
న్యూయార్క్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు విరాళంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లను సేకరించినట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు. విరాళాలను ఎలా సంపాదించిందీ వివరిస్తూ ఆయన ఫెడరల్ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నారు.
మొత్తం 34 మిలియన్ డాలర్లలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 18.8 మిలియన్ డాలర్లు అందాయి. హష్ మనీ కేసులో ట్రంప్‌పై నేరారోపణల ప్రక్రియ మొదలుకొని కోర్టు దోషిగా ప్రకటించే వరకు రెండు వారాల వ్యవధిలోనే 15.4 మిలియన్ డాలర్లు విరాళంగా అందినట్లు మద్దతుదారులు తెలిపారని పొలిటికో పేర్కొంది.