రెజ్లింగ్‌ పాటకు మొసలి హుషారు | Florida Star Wars-loving alligator Darth Gator Imperial March moment | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌ పాటకు మొసలి హుషారు

Published Mon, Nov 11 2024 6:18 AM | Last Updated on Mon, Nov 11 2024 6:18 AM

Florida Star Wars-loving alligator Darth Gator Imperial March moment

90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్‌ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్‌ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్‌ ప్రఖ్యాత థీమ్‌సాంగ్‌ అయిన ‘ది ఇంపీరియల్‌ మార్చ్‌’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. 

గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్‌ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్‌ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్‌గ్లేడ్స్‌ హాలిడే పార్క్‌లో డార్త్‌ గేటర్‌ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్‌బాయ్స్‌ టీవీషో స్టార్‌ పౌల్‌ బేడార్ట్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్‌లు కొడుతున్నారు.  
  
 – న్యూయార్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement