Bigg Boss Non-Stop Telugu OTT Promo: Bindu Madhavi Vs Nataraj Master Fight In Nomination - Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: పిచ్చి ముదిరింది, శూర్పణఖ అంటూ రెచ్చిపోయిన నటరాజ్‌

Published Mon, May 9 2022 6:45 PM | Last Updated on Mon, May 9 2022 7:58 PM

Bigg Boss Non Stop Telugu OTT: Bindu Madhavi Vs Nataraj Master Fight In Nomination - Sakshi

పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్‌ ఆడలేదు, పనికిరాని పిల్లి అని తిడుతూ రెచ్చిపోయాడు. మరి ఇంతకీ ఈ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే!

బిగ్‌బాస్‌ కథ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్‌కు చేరుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, నటరాజ్‌ మాస్టర్‌, అనిల్‌, మిత్ర, యాంకర్‌ శివ, బిందు మాధవి, అఖిల్‌, బాబా భాస్కర్‌ ఉన్నారు. వీరిలో అఖిల్‌, బిందుమాధవి, యాంకర్‌ శివ, బాబా భాస్కర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఫినాలేలో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈసారి టాప్‌ 5కి బదులుగా టాప్‌ 6 ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ ఐదుగురితో పాటు మిత్ర, అరియానాలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ కథ చివరికి చేరుకుంటున్నా నామినేషన్స్‌లో మాత్రం ఫైర్‌ తగ్గడం లేదు. తాజాగా పదకొండో వారం నామినేషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఏ ముగ్గురు ఫినాలేకు చేరుకోవడానికి అర్హులు కారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో బిందుమాధవి ఊహించినట్లుగానే మిత్ర, అఖిల్‌, నటరాజ్‌లు ఫినాలేకు అనర్హులని చెప్పింది. నేనొకటి మాట్లాడుతుంటే అన్‌సింక్‌లో నువ్వొకటి మాట్లాడుతుంటవ్‌ అని అఖిల్‌ అనగా.. 'నీకు బ్రెయిన్‌ లేదు కదా, ఉంటే ఏం మాట్లాడుతున్నానో అర్థమయ్యేది అని ఫైర్‌ అయింది. ఎమోషన్స్‌ వాడుకుంటూనే ఎమోషన్స్‌ వాడనంటుంది, వాహ్‌.'. అని అఖిల్‌ బిందుపై సెటైర్‌ వేశాడు. అటు నటరాజ్‌.. నీ వల్ల మీ నాన్న ఫెయిల్‌ అయ్యాడు. ఈమెకు జ్ఞానాన్ని నేర్పండి. తెలుగమ్మాయికి ఉన్న ఒక్క లక్షణం కూడా నీకు లేదు అంటూ బిందు తండ్రికి రిక్వెస్ట్‌ చేశాడు.

నిద్రపోయిన సింహాన్ని లేపావు అంటూ నటరాజ్‌ మాస్టర్‌ ఉడికిపోయాడు. 'పిచ్చి ముదిరిపోయింది, నీకు పిచ్చి, నీ పిచ్చి మొత్తం బయటకు తీస్తా, ఒక్కసారి కూడా గేమ్‌ ఆడలేదు, పనికిరాని పిల్లి' అని బిందును తిడుతూ రెచ్చిపోయాడు. మరి ఇంతకీ ఈ నామినేషన్స్‌లో ఎవరెవరున్నారో తెలియాలంటే రాత్రి 9 గంటల వరకు వేచి చూడాల్సిందే!

చదవండి: అశును వరస్ట్‌ అన్న రవి, కోపంతో ఆమె ఏం చేసిందంటే?

'బిగ్‌ డే, నా కల నెరవేరబోతోంది' డైమండ్‌ రింగ్‌తో హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement