
‘సత్య (1998), కౌన్ (1999), శూల్’ (1999) వంటి సినిమాల తర్వాత బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరో సినిమా చేయనున్నారు. తన తాజా చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’లో మనోజ్ బాజ్‌పాయ్ నటించనున్నట్లు రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ టైటిల్‌కి ‘యూ కెనాట్ కిల్ ది డెడ్’ అనేది క్యాప్షన్.
‘‘హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్, అడ్వెంచర్, థ్రిల్లర్స్... వంటి సినిమాలు చేశాను. కానీ ఇప్పటివరకు నేను హారర్ కామెడీ జానర్‌లో సినిమా చేయలేదు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ హారర్ కామెడీ ఫిల్మ్. పోలీస్‌స్టేషన్‌లో ఓ భయంకరమైన ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్స్ భూతాలు అవుతారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారిపోతుంది. మరి... ఈ గ్యాంగ్‌స్టర్ భూతాల నుంచి పోలీసులు ఎలా తప్పించుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ’’ అని ‘ఎక్స్’ వేదికగా రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.