జార్ఖండ్‌ కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన మహిళా నేత | Congress Leader Manju Kumari Joins BJP | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన మహిళా నేత

Published Tue, Oct 15 2024 9:53 AM | Last Updated on Tue, Oct 15 2024 10:28 AM

Congress Leader Manju Kumari Joins BJP

రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అస్సాం సీఎం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌చార్జ్ హిమంత బిస్వా శర్మ సమక్షంలో కాంగ్రెస్ మహిళా నేత మంజు కుమారి బీజేపీలో చేరారు. మంజుతో పాటు ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సుకర్ రవిదాస్ కూడా వందలాది మంది కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు.

బాబులాల్ మరాండీ, హిమంత బిస్వా శర్మ మంజు కుమారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ  మంజు కుమారి చేరికతో గిరిధి జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఆమె జమువా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కేదార్ హజార్‌పై  పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని  మంజు మీడియాకు తెలిపారు. జార్ఖండ్ ఏర్పడిన తర్వాత  ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని మంజు విమర్శించారు. 

 


ఇది కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్‌-1’ అమలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement