
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాల్లో రెండింటిని అటవీ ప్రాంతంలోకి వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 2022 సెప్టెంబర్‌లో ఇక్కడికి చేరుకున్న 8 చీతాలను మొదటగా ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్లలోకి, అనంతరం హంటింగ్ ఎన్‌క్లోజర్లలోకి తరలించారు.
శనివారం మొదట మగ చీతా ఒబన్‌ను, కొన్ని గంటల తర్వాత ఆషా అనే ఆడ చీతాను అడవిలోకి వదిలామని ఫారెస్ట్స్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ చెప్పారు. మిగిలిన వాటిని కూడా నిర్ణీత సమయాల్లో అడవిలోకి విడిచిపెడతామన్నారు. మొన్న ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.