
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ గురువారం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల 14వ జాబితా ఇది.
ఖుషీనగర్ లోక్‌సభ స్థానం నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్‌ను, డియోరియా లోక్‌సభ స్థానం నుంచి సందేశ్ యాదవ్‌ను తమ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది.
ఖుషీనగర్, డియోరియా లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. జాన్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి తొలుత అవకాశమిచ్చిన మాయావతి పార్టీ తర్వాత అభ్యర్థిని మార్చి షాకిచ్చింది. ఆమె నామినేషన్ దాఖలు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్‌కు బీఎస్పీ బీ-ఫారం ఇచ్చింది.