
నారా లోకేష్ యాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. బంగారుపాలెంలో నడిరోడ్డుపై లోకేష్ ప్రసంగించే యత్నం చేశారు.
సాక్షి, చిత్తూరు: నారా లోకేష్ యాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. బంగారుపాలెంలో నడిరోడ్డుపై లోకేష్ ప్రసంగించే యత్నం చేశారు. అభ్యంతరం తెలిపిన పోలీసులను టీడీపీ కార్యకర్తలు దూషించారు. పోలీసులు సర్దిచెబుతున్నా టీడీపీ నేతలు గొడవకు దిగారు.
నడిరోడ్డుపై ప్రసంగాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులకు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అనుమతి తీసుకోకుండా సభలు నిర్వహించకూడదని పోలీసులు సూచించారు.
చదవండి: ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?