
మీకు అందరికి థాంక్స్: టెన్నిస్ స్టార్ జొకోవిచ్
Novak Djokovic On Australia Visa Row Thanks Fans: ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడేద్దామనుకున్న ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు మెల్‌బోర్న్ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా అధికారులు నిలిపివేసి షాకిచ్చారు. ప్రభుత్వం వీసా రద్దు చేసింది. మినహాయింపు ఇస్తేనే వచ్చానని గట్టిగా వాదిస్తున్న జొకోకు తిరుగుటపా కట్టడం ఇష్టం లేదు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నాడు.
ఈ ప్రయత్నంలో స్వదేశం సెర్బియా నుంచి అతని అభిమానులు, సన్నిహితులు, తల్లిదండ్రులు అతనికి గుండెధైర్యాన్నిచ్చేలా పోస్టులు పెట్టారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన సెర్బియన్ స్టార్ తనకు వెన్నంటే నిలిచి మద్దతు పలికిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. సోమవారం జరిగే కోర్టు విచారణలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది తేలిపోతుంది.
చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్!