World Boxing Championships: నరేందర్‌ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు | World Boxing Championships: Narender Berwal Enters Quarters, Govind Sahani and Deepak Kumar Through to Pre-quarters | Sakshi
Sakshi News home page

నరేందర్‌ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు

Published Fri, May 5 2023 4:56 AM | Last Updated on Fri, May 5 2023 4:56 AM

World Boxing Championships: Narender Berwal Enters Quarters, Govind Sahani and Deepak Kumar Through to Pre-quarters - Sakshi

తాష్కెంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్‌ బెర్వాల్‌ (ప్లస్‌ 92 కేజీలు), గోవింద్‌ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్‌ కుమార్‌ (51 కేజీలు) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్‌ బాక్సర్‌ శివ థాపా పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది.

తొలి రౌండ్‌ బౌట్‌లలో నరేందర్‌ 4–1తో మొహమ్మద్‌ అబ్రోరిదినోవ్‌ (తజికిస్తాన్‌)పై, గోవింద్‌ 5–0తో మెహ్రోన్‌ షఫియెవ్‌ (తజికిస్తాన్‌)పై, దీపక్‌ 5–0తో లూయిస్‌ డెల్గాడో (ఈక్వెడోర్‌)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్‌ రెస్‌ యురీ (బ్రెజిల్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్‌ (57 కేజీలు), ఆశిష్‌ చౌధరీ (80 కేజీలు), నవీన్‌ (92 కేజీలు) పోటీపడతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement