ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్కు తరలించొద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశానని తెలంగాణ బీజేపీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించడం పేద రోగులకు ఇబ్బంది కలిగించడమేనని ఆయన అన్నారు. బుధవారం నాగం విలేకరులతో మాట్లాడారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్, కాలేజీ, వెటర్నరీ ఆస్పత్రిని నిర్మించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారని గుర్తుచేశారు. అయితే వైఎస్ఆర్ మరణాంతరం అది సాధ్యం కాలేదని నాగం తెలిపారు.