‘అమెరికాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అమెరికా క్షిపణి దాడిలో మరణించిన ఖాసిం సులేమానీ స్థానంలో ఇరాన్ జనరల్‌గా నియమితులైన ఎస్మాయిల్ ఘానీ సోమవారం ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ‘మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనికులపై దాడులు నిర్వహించి తీరుతాం. తమ పిల్లల చావు కోసం వారి తల్లులు, కుటుంబ సభ్యులు నిరీక్షించాలి’ అంటూ సులేమాని కుమార్తె జైనాబ్ సోమవారం ఇరాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ హెచ్చరించారు.