ఏకకాల ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బుధవారం జరగనున్న అఖిలపక్ష భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కావడం లేదు. ఒకే దేశం..ఒకే ఎన్నికలు అనే అజెండాపై ప్రభుత్వం ముందస్తు సమాచారం లేకుండా తక్కువ వ్యవధిలో సమావేశం ఏర్పాటు చేసిందని, దీనిపై సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి రాసిన లేఖలో మమతా బెనర్జీ స్పష్టం చేశారు.