Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

ugadi 2025 Celebrations At tadepalli ysrcp party office1
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్‌ జగన్’

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్‌ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్‌ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్‌ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sakshi Guest Column On Rashtriya Swayamsevak Sangh2
జాతి పునర్నిర్మాణంలో... 'ఆర్‌ఎస్‌ఎస్‌'@100

దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నూరు వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ మైలు రాయిని సంఘ్‌ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది. ఇలాంటి సందర్భాలు... ఉత్సవాల కోసం కావని, ఆత్మపరిశీలన చేసుకుని, లక్ష్యసాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్‌ స్థాపించినప్పటి నుండి సుస్పష్టమైన విషయం. అదే సమయంలో, ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు, నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయంసేవకులు, వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం. ప్రత్యేకించి, సంఘ్‌ స్థాపకులైన డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ జయంతి సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో... ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు, సమరసతతో కూడిన సమైక్య భారతావని దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం మరేముంటుంది? దేశం కోసం జీవించేలా...డాక్టర్‌ హెడ్గేవార్‌లో భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ, అఖండమైన అంకితభావం చిన్నతనం నుంచే కనపడింది. కోల్‌కతాలో తన వైద్య విద్యను పూర్తిచేసేనాటికే, సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకూ భారతదేశానికి బ్రిటిష్‌ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది. అదే సమయంలో దైనందిన జీవితంలో దేశభక్తి లేకపోవడం, సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం, సామాజిక జీవితంలో క్రమశిక్షణరాహిత్యం వల్ల భారతదేశంలో బయటివారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు. ఎడతెగని దురాక్రమణలతో మన ఘనచరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మరచిపోయారని ఆయనకు అనుభ వానికి వచ్చింది. ఫలితంగా మన సంస్కృతి, జ్ఞాన సంబంధమైన సంప్రదాయం పట్ల నైరాశ్యభావం, ఆత్మన్యూనతాభావం చోటు చేసు కున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్య లను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు. అందుకే, దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నా లతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని నిర్ణయించారు. రాజ కీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన పద్ధతిలో నడిచే సంఘం ఆవిర్భావం.ఈ ఉద్యమం, సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి ఒక అద్భు తానికి ఎంతమాత్రం తక్కువ కాదు. హెడ్గేవార్‌ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు, కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంగా ఇచ్చారు, అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది. ఆయన జీవితకాలంలో, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సంఘ కార్యం విస్తరించింది.శాఖోపశాఖలుగా ‘శాఖ’మనం స్వాతంత్య్రాన్ని పొందినప్పుడు, అదే సమయంలో భారతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు, పాకిస్తాన్‌ నుండి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ, మర్యాద లతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ్‌ స్వయంసేవ కులు తమ అంకితభావాన్ని కనబరిచారు. సమాజం కోసం బాధ్యత, కర్తవ్యభావాలతో ముడిపడిన స్వయంసేవక్‌ అనే భావన విద్య, కార్మిక రంగం, రాజకీయరంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. రెండవ సర్‌సంఘ్‌చాలక్‌ అయిన శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోల్వాల్కర్‌) మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీ కరించబడాలి! దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరు ద్ధరణకు జరిగిన శాంతియుతపోరులో సంఘ్‌ స్వయంసేవకులు కీలక పాత్ర పోషించారు. రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను అనుసంధానించాయి. జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు, పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభి వృద్ధి వరకు, సంఘ్‌ స్వయంసేవకులు స్పృశించని అంశం లేదు. ప్రతి విషయాన్నీ రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ, సంఘ్‌ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపైన, సరైన ఆలోచనలు గల వ్యక్తులు – సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడంపైన దృష్టి పెట్టింది. సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం, కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘ్‌ దృష్టి సారించింది. లోక మాత అహల్యాబాయి హోల్కర్‌ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘ్‌ పిలుపుతో దేశమంతటా 27 లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు 10 వేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది. సంఘ్‌ తన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు బ్లాక్, గ్రామ స్థాయి వరకూ జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలని సంఘ్‌ నిర్ణయించింది. గత ఏడాది కాలంలో పటిష్ఠమైన ప్రణాళికతో మరో పది వేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడమన్నది అంకితభావానికి, అంగీకారానికి చిహ్నం. అయితే, ప్రతి గ్రామానికి, బస్తీకి చేరుకోవడ మనే లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ్‌ పరివర్తన్‌ అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది. శాఖ నెట్‌వర్క్‌ను విస్తరించే క్రమంలో పౌరవిధులు, పర్యా వరణహితమైన జీవనశైలి, సామాజిక సమరసతా వర్తన, కుటుంబ విలువలు, స్వీయత్వ స్పృహపై ఆధారపడిన దైహికమార్పుపై దృష్టిని ఉంచింది. తద్వారా ప్రతి ఒక్కరూ ‘పరం వైభవం నేతు మేతత్‌ స్వరాష్ట్రం’ – మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లే బృహత్‌ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు.గత వంద సంవత్సరాలలో, సంఘ్‌ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా ప్రయాణించింది. ఎవ్వరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్‌కి నమ్మకం లేదు. అలాగే, ఈ రోజున సంఘ్‌ పనిని వ్యతిరే కిస్తున్నవారు కూడా సంఘ్‌లో భాగమవుతారనే విశ్వాసాన్ని కలిగి ఉంది. ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కా రాలను అందించే సామర్థ్యాన్ని భారతదేశపు ప్రాచీన, అనుభవ ఆధారిత జ్ఞానం కలిగివుంది. ఈ అతి పెద్దయిన, అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే, భారతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకుని, ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేసినప్పుడే! ఇందుకోసం సజ్జన శక్తి నాయకత్వంలో సమరసతతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులమై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం!దత్తాత్రేయ హోసబాళె వ్యాసకర్త ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ్‌ (జాతీయ ప్రధాన కార్యదర్శి)

Eid al-Fitr marks the end of Ramadan 20253
ప్రేమను పంచే శుభదినం ఈద్‌

ఈదుల్‌ ఫిత్ర్‌ లేక రంజాన్‌ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్‌’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ను అనుసరించి రంజాన్‌ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్‌) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్‌ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్‌ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్‌ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్‌ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్‌ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్‌ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్‌ నమాజ్‌ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్‌ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్‌ ఫిత్ర్‌ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్‌ నెల ముగియగానే, షవ్వాల్‌ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్‌ ఫిత్ర్‌’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్‌’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్‌

Sakshi Guest Column On emperors tax Chhatrapati Shivaji and Aurangzeb4
చక్రవర్తులందరూ పన్నులను వడ్డించినవారే!

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ క్రూరుడూ, హిందూ వ్యతిరేకీ కాబట్టి, మహారాష్ట్రలో ఉన్న అతని సమాధిని తవ్వి తీసిపారెయ్యాలని డిమాండ్‌ చేస్తూ, నాగపూర్‌లో, వారం కిందట, కొన్ని హిందూ సంస్థలు సభలూ, నిరసన ప్రదర్శనలూ జరిపాయి. ఔరంగజేబు సమాధిని తీసెయ్యనక్కరలేదనీ, అతను అంతిమంగా మరాఠా ప్రజల చేతుల్లో ఓడిపోయాడు గనక, అతని సమాధి, మరాఠా ప్రజల వీరత్వానికి గుర్తుగా ఉంటుందని చీలిన శివసేనలోని ఒక పక్షం వాదన. తీసేస్తే తీసెయ్యండి, కానీ మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి– అని కూడా ఒక విమర్శ. ఇటీవల వచ్చిన, హిందీ సినిమా ‘ఛావా’లో చూపించినట్టు... ఔరంగజేబు క్రూరుడు కాదనీ, ఎన్నో మంచిపనులు కూడా చేశాడనీ, సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన ఒక ముస్లిం సభ్యుడు అన్నాడు. వివాదం పెరిగి పెద్దదై, నాగపూర్‌లో చిన్న స్థాయి మతకలహాల వంటివి జరిగి షాపులూ, ఇళ్ళూ, వాహనాలూ ధ్వంసం అయ్యాయి. 50మందికి గాయాలయ్యాయట! ఇంగ్లీషూ, హిందీ టీవీ చానళ్ళలో ఈ వివాదంపై చర్చలు చూపించారు. ఇదే సమయంలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్ప ప్రజానుకూల చక్రవర్తో వాదించిన వారున్నారు. ఔరంగ జేబ్‌ సైన్యంలో కీలకమైన పదవుల్లో హిందూ సైనికాధి కారులున్నారని వాళ్ళ జాబితా ఇచ్చిన వారున్నారు. అలాగే, శివాజీ సైన్యంలో కూడా, అతనికి ఎంతో నమ్మకస్తులైన ముస్లిం ఉన్నత సైనికాధికారులున్నారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఈ చర్చల్లో ముస్లిం చక్రవర్తుల్ని ప్రజా వ్యతిరేకులుగానూ, హిందూ చక్రవర్తుల్ని ప్రజలకు అనుకూలురుగానూ వాదించు కోవడమే ఎక్కువగా కనిపించింది. పత్రికల్లోగానీ, టీవీ డిబేట్లలో గానీ, అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులనేవారు, వాళ్ళు ఏ మతస్థులైనా, పాలకవర్గ ప్రతినిధులనీ, పాలకవర్గం ఎప్పుడూ ప్రజలకు అనుకూలంగా ఉండజాలదనీ వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పిన వారు లేరు. ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే, సత్యానికి కళ్ళు మూసినట్టవుతుంది. చక్రవర్తులంటే, అనేక చిన్నా పెద్దా భూభాగాల మీద పరిపాలన చేసే వాళ్ళు గదా? ఉదాహరణకి, ఔరంగజేబ్‌ (1618–1707) అయినా, శివాజీ (1630–1680) అయినా, చక్రవర్తులుగా విశాలమైన భూభాగాలను వారి కాలంలో పాలించారు. వారు ఎవరితో కలిసి ఎవరిని ఓడించారో, ఎన్నెన్ని ప్రాంతాలను ఆక్రమించారో, ‘ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫియతులూ’ ఇక్కడ చెప్పు కోలేము. అదంతా రకరకాల చరిత్ర పుస్తకాలలో దొరుకుతుంది. వారి ప్రభుత్వాలలో కూడా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, సైనిక శాఖ, ఇతర అనేక రకాల శాఖలూ ఉన్నాయి. ఏకాలంలో అయినా, ఏ ప్రభుత్వమైనా పరిపాలన చెయ్యాలంటే, తప్పనిసరిగా కావలిసినవి పన్నులే. చరిత్రనించీ, మార్క్స్‌ గ్రహించి చెప్పినది ఇదే: ‘అధికార గణానికీ, సైన్యానికీ, మత గురువులకూ, కోర్టులకూ, క్లుప్తంగా చెప్పాలంటే, మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగపు మనుగడకీ ఆధారం... రాజ్యానికి అందే పన్నులే! పన్నులు అంటే, ప్రభుత్వపు యంత్రాంగపు ఆర్థిక పునాది తప్ప, మరేమీ కాదు’. అయితే, పన్నులు ఏ పేర్లతో వచ్చినా, ఏ రూపంలో చెల్లించినా, వాటి మూలం ఎక్కడుంది? ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నామో, ఆ కాలానికి చెందిన శ్రామిక జనాల శ్రమలోనే ఉంది! అదెలాగో చూద్దాం. ఔరంగజేబు ప్రభుత్వమైనా, శివాజీ ప్రభుత్వమైనా ఆ కాలంలో రకరకాల పద్ధతుల్లో పన్నులు వసూలు చేసేవి. వసూళ్ళకు ఒక యంత్రాంగం ఉండడం తప్పనిసరి. మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు చక్రవర్తులూ పన్నులు ఎవరి దగ్గర్నించి ప్రధానంగా వసూలు చేశారు? వ్యవసాయ రంగం నించీ. అలాగే, ఆనాటి పరిమితుల్లో ఉండిన పరిశ్రమలనించీ, సరుకులతో వ్యాపారం జరిపే వర్తకుల నించీ! అసలు, ఒక రాజ్యంలో ఉండే భూములు ఎవరి అధీనంలో ఉంటాయి? వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎవరు? పంటలు పండించేది ఎవరు? (1) జమీందారులనీ, మిరాసీదారులనీ, రకరకాల పేర్లతో ఉండే పెద్ద భూస్వాములు. వీళ్ళసలు ఒళ్ళు వంచరు. అంతా కౌలు రైతులు ఇచ్చే కౌలు మీదే ఆధారపడతారు. ఏ శ్రమా చెయ్యకుండా, కౌలు రైతులనించి గుంజిన కౌలులో నించే, చక్రవర్తికి శిస్తుగానీ, కప్పం గానీ, రకరకాల పన్నులు గానీ కడతారు. (2) సొంత శ్రమల మీదే, ప్రధానంగా ఇంటిల్లిపాదీ, కష్టపడి జీవించే ‘స్వతంత్ర రైతులు’. వీళ్ళు కట్టే శిస్తులు గానీ, పన్నులు గానీ అన్నీ వీళ్ళ సొంత శ్రమ వల్లనే కడతారు. (3) సొంత శ్రమ మీదే కాక, కొంత ఇతరుల శ్రమల మీద కూడా ఆధార పడి జీవించే రైతులు వీళ్ళు. వీళ్ళు కట్టే పన్నులు కూడా, వీరి సొంత శ్రమలో నించీ కొంతా, ఇతరుల నించీ వచ్చిన అదనపు శ్రమ నించీ కొంతా. (4) వ్యవసాయ శ్రామికులు. వీళ్ళు లేకుండా వ్యవసాయంలో ఏ దశలోనూ, ఏ పనీ జరగదు. వీళ్ళని పనిలో పెట్టుకునే వారు, వారు పేద రైతులైనా, కొంత మెరుగైన స్థితిలో ఉన్న వారైనా, కౌలు రైతులైనా, ఈ కూలీల శ్రమ మీద ఆధారపడే వారే! వీళ్ళకి ‘కూలి’ అనేది డబ్బు రూపంలో ఇచ్చినా, ధాన్యం రూపంలో ఇచ్చినా, వాళ్ళకి అందేది వాళ్ళ శ్రమ శక్తి విలువే. మొత్తం శ్రమ విలువ కాదు. శ్రమ శక్తి విలువ అంటే, మర్నాడు వచ్చి పని చెయ్యడానికి శ్రామికులకి కావలిసిన జీవితావసరాలకు తగ్గ జీతం అన్నమాట. శ్రమ విలువ అంటే, తాము జీతం రూపంలో తీసుకునే విలువా, యజమాని లాభంగా మిగుల్చు కునే అదనపు విలువా కూడా కలిసినదే. వ్యవసాయ రంగం నించీ వచ్చే పన్నులు ఎక్కువ భాగం ఈ అదనపు విలువలో నించీ తీసి ఇచ్చేవే!ఆ కాలపు రెవెన్యూ చరిత్ర ప్రకారం, ఈ ఇద్దరు చక్రవర్తులకీ ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నించే వచ్చేది. వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ‘శిస్తు’ అనీ, ‘చౌత్‌’ అనీ, ‘జప్త్‌’ అనీ, ‘సర్దేశ్‌ ముఖీ’ అనీ, ఇంకేవో పేర్లు. అవన్నీ మనకి అనవసరం. భూమి వైశాల్యాన్ని బట్టో, సారాన్ని బట్టో, వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి. వీటిని చెల్లించే వారిని రైతులనీ, జమీందారులనీ, మిరాశీ దారులనీ, కౌల్దారులనీ... ఏ పేరుతో మనకి చెప్పినా, అసలు సంగతి కాయకష్టం చేసే రైతుల శ్రమని దోచడమే! ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా, ఈ చక్రవర్తి గొప్పా, ఆ చక్రవర్తి గొప్పా అనే తగువు అర్థం లేనిది. వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల, కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగానూ, కొందరు కొంత సాత్వికంగానూ, కొందరు కటువు గానూ, మరికొందరు కర్కశంగానూ, క్రూరంగానూ ఉంటారు. ‘ఏ రాయి అయితేనేమీ పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనే నానుడిలో ఉన్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే... చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులే! మనం మాట్లాడుకునే చక్రవర్తుల కాలంలో చిన్న స్థాయిలో అయినా రకరకాల పరిశ్రమలు ఉండేవి. వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడిగానీ, ఇతరత్రా గానీ సరుకులు తయారయ్యేవి. ఉప్పూ, దూదీ, దారం, నేతా, నూనెలూ, చర్మంతో తయారు చేసే వస్తువులూ, నివాసాల సామగ్రీ... ఇలా ఎన్నో రకాల పరిశ్రమలూ, వర్తకాలూ ఉండేవి. పరిశ్రమల యజమానులైనా, వర్తకులైనా, కట్టే పన్నులు, వాళ్ళ దగ్గిర పనిచేసే శ్రామికులు ఇచ్చే అదనపు విలువలోనించే తీసి కడతారు. అంటే, మళ్ళీ శ్రమ దోపిడీ ద్వారానే! ఈ విషయాలు ప్రజలు గమనంలో ఉంచుకుంటే మత ఘర్షణలు తలెత్తవు. ప్రజల అనైక్యత నుంచి ఎన్నికల ప్రయో జనం పొందాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం గమనార్హం.బి.ఆర్‌. బాపూజీ వ్యాసకర్త హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీవిశ్రాంత ఆచార్యులు

Donald Trumps warning to Iran on nuclear deal5
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్‌

వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్‌ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్‌. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దుట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌)తో పాటు జర్మనీ, యూరప్‌ యూనియన్‌(ఈయూ)లు, ఇటు ఇరాన్‌ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్‌ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్‌.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్‌ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.

IPL 2025: Chennai super kings vs Rajasthan royals live updates and highlights6
IPL 2025: బోణీ కొట్టిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌..

CSK vs RR live updates and highlights: ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.బోణీ కొట్టిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌..ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బోణీ కొట్టింది. గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ విజ‌యం సాధించింది. 183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(63) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌వీంద్ర జ‌డేజా(32) ప‌ర్వాలేద‌న్పించాడు.రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో వ‌నిందు హ‌స‌రంగా నాలుగు వికెట్ల‌తో చెల‌రేగ‌గా.. ఆర్చ‌ర్, సందీప్ శ‌ర్మ‌ ఓ వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన‌ రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(37), శాంస‌న్‌(20) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఖాలీల్ అహ్మ‌ద్‌, ప‌తిరాన, నూర్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. జ‌డేజా, అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌.. గైక్వాడ్ ఔట్‌రుతురాజ్‌ గైక్వాడ్‌(63) రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో గైక్వాడ్‌ ఔటయ్యాడు. 16 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 129/5సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్.. శంక‌ర్ ఔట్‌92 ప‌రుగుల వ‌ద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన విజ‌య్ శంక‌ర్.. హ‌స‌రంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి 111 ప‌రుగులు చేసింది. క్రీజులో జ‌డేజా(8), గైక్వాడ్(55) ఉన్నారు.సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌..ఇంపాక్ట్ ప్లేయ‌ర్ శివ‌మ్ దూబే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది.18 ప‌రుగులు చేసిన దూబే.. హ‌స‌రంగా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.సీఎస్‌కే రెండో వికెట్ డౌన్‌..రాహుల్ త్రిపాఠి రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 23 ప‌రుగులు చేసిన త్రిపాఠి.. హ‌స‌రంగా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయి 62 ప‌రుగులు చేసింది. క్రీజులో దూబే(8), గైక్వాడ్ ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌..6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్టానికి 40 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(20), రాహుల్ త్రిపాఠి(21) ఉన్నారు.సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌.. ర‌వీంద్ర ఔట్‌183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ర‌చిన్ ర‌వీంద్ర‌.. ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చాడు.నితీష్ రాణా సూప‌ర్ హాఫ్ సెంచ‌రీ.. సీఎస్‌కే టార్గెట్ ఎంతంటే?గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(37), శాంస‌న్‌(20) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఖాలీల్ అహ్మ‌ద్‌, ప‌తిరాన, నూర్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. జ‌డేజా, అశ్విన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.రాజ‌స్తాన్ ఆరో వికెట్ డౌన్‌..రియాన్ ప‌రాగ్ రూపంలో రాజ‌స్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌రాగ్‌.. ప‌తిరాన బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ 6 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగులు చేసింది.రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌.. జురెల్ ఔట్‌ధ్రువ్ జురెల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 ప‌రుగులు చేసిన జురెల్‌.. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 81).. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌: 129/3రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌.. శాంస‌న్ ఔట్‌సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. నూర్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప‌రాగ్ వ‌చ్చాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్‌.. రెండు వికెట్ల న‌ష్టానికి 87 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(61), రియాన్ ప‌రాగ్‌(1) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న రాణా..5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(44), సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.రాయ‌ల్స్ తొలి వికెట్ డౌన్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 ప‌రుగులు చేసిన య‌శ‌స్వి జైశ్వాల్‌.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. సామ్ కుర్రాన్‌, దీప‌క్ హుడా స్ధానాల్లో ఓవ‌ర్ట‌న్‌, విజ‌య్ శంక‌ర్ వ‌చ్చారు. రాయ‌ల్స్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పు చేయ‌లేదు.తుది జ‌ట్లుచెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణరాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

CM Chandrababu Naidu P4 Meeting Turns into a Major Flop7
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్‌ ప్లాప్‌.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం

సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్‌ సభ అట్టర్‌ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్‌ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్‌ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy On Fine Rice Distribution Scheme8
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్‌

సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘నల్లగొండ‌ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యంఅందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులేఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడుసన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉందినాకు కేసీఆర్‌తో పోలిక ఏంటి?నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి‌ 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాంపదేళ్లలో తెలంగాణను నంబర్‌ వన్‌ చేస్తారైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

Vinay Hiremath Sold His Startup And Now He Studying Physics9
రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు

కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్‌ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్‌ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లూమ్‌ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?లూమ్‌ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్‌ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్‌ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.The co-founder of Loom sold his biz for ~$1B, made $50-70M personally, then walked away from an extra $60MHe has “no income right now” and is “looking for internships”...@vhmth has a wild post-exit story. we talked about it on Moneywise:-Turned down $60M in retention… pic.twitter.com/uTdS5blabz— Sam Parr (@thesamparr) March 25, 2025

Lamborghini Driver After Hitting 2 Workers On Noida Footpath10
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?

నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement