Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan responds to Supreme Court verdict on the arrest of senior journalist Kommineni Srinivasa Rao1
‘సుప్రీం తీర్పు’.. చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025

Supreme Court Orders Release Of Kommineni Srinivasa Rao2
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సాక్షి చానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్‌ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారు. మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు.. యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు?. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కేఎస్ఆర్ నియంత్రించారు . వాటిని సమర్థించలేదు. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారు. పైగా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు.పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం . ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది’’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కొమ్మినేనికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది.

A Man Search For Missing Mother And 2 Year Old Daughter After Air India Incident3
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..

గాంధీ నగర్‌: ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్‌, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్‌ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్‌ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్‌ ఆస్పత్రిలో లంచ్‌ బాక్స్‌లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్‌కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్‌లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్‌లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్‌ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు.

Donald Trump calls Israels strike on Iran excellent4
Donald Trump: నచ్చితే ఒక రకంగా.. నచ్చకపోతే ఇలా..!

డొనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం. ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్‌’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం.. ఇలా ప్రతీది ట్రంప్‌కు ముడిపడే ఉంది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జ‌పిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్‌ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్న‌ది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్ర‌రాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఇరాన్‌పై కక్ష ఎందుకు?ఇక్కడ ఇరాన్‌పై మాత్రం ట్రంప్‌ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్‌ సమర్ధిస్తున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్‌పై దాడిని ఇజ్రాయిల్‌ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్‌ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్‌.. ఇప్పుడు ఇజ్రాయిల్‌-ఇరాన్‌ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్‌కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. అణు ఒప్పందంపై ఇరాన్‌కు చాన్స్‌ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్‌. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్‌ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు(ఇరాన్‌) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్‌ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్‌లో స్పష్టంగా కనబడుతోంది. ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్‌ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..

Telangana government released a GO on January 2023 regarding DA5
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది

Englands U-19 squad announced for series against Ayush Mhatre-led India U-19 team6
భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టులో ఫ్లింటాఫ్ త‌న‌యుడు

భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్ర‌క‌టించింది. ఇంగ్లీష్‌ అండ‌ర్‌-19 జ‌ట్టుకు థామస్ రెవ్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఈ జ‌ట్టులో ఇంగ్లండ్ దిగ్గ‌జం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు ద‌క్కించుకున్నాడు.రాకీ ప్లింటాఫ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా నిరూపించుకునేందుకు సిద్ద‌మవుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 5 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాకీ.. 15.22 స‌గ‌టుతో 137 ప‌రుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లలో అత‌డి పేరిట 167 ప‌రుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచ‌రీ కూడా ఈ జూనియ‌ర్ ప్లింటాప్ సాధించాడు. ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు యూత్ వ‌న్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ త‌ర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టుకు యువ సంచ‌ల‌నం అయూష్ మాత్రే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఈ జ‌ట్టులో వైభ‌వ్ సూర్య‌వంశీ వంటి చిచ్చ‌ర‌పిడుగులు ఉన్నారు.ఇంగ్లండ్ అండర్‌-19 టీమ్‌థామస్ రెవ్ (కెప్టెన్‌), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.భారత అండర్‌-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్‌జేద్ ఎహమ్‌జెనా.

ACB notice in the Formula E case,ktr slams revanth reddy 7
KTR: ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. మరి రేవంత్’

సాక్షి,హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసెడింట్‌ కేటీఆర్‌ ఫైరయ్యారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడుచట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్‌కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్‌ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌పై దుయ్యబట్టారు.అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…— KTR (@KTRBRS) June 13, 2025

CCTV Footage Shown What Happened Moments In BJ Medical College Of The Plane Crash8
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు

సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్‌,ఆర్యన్‌,మనవ్‌ జయ్‌ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్‌ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్‌ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్‌ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్‌ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్‌ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్‌ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్‌ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్‌లో లోపల ఉన్న టేబుల్‌ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Kommineni Arrest To Bail: Courts Slaps Police These Are Complete Details9
కొమ్మినేని అరెస్ట్‌ టు బెయిల్‌! ఎప్పుడేం జరిగిందంటే..

సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్‌ చేయాలంటూ.. ఆయన అరెస్ట్‌ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్‌ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..9వ తేదీ సోమవారం..గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 👉70 ఏళ్ల వయసులో.. సీనియర్‌ సిటిజన్‌, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్‌ఎస్‌ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహంఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్‌) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్‌ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్‌ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.

10 Minute Delay Saved Woman From Plane Crash10
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్‌ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్‌ మిస్‌ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్‌కు వెళ్లాల్సిన గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్‌ అనే మహిళ.. అహ్మదాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్‌ మిస్‌ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్‌పోర్ట్‌ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్‌ ఎక్కలేదు. బోర్డింగ్‌ ప్రాసెస్‌కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్‌ మిస్‌ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా 171 బోయింగ్‌ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్‌లోనే ఉన్నా. ఆ ఫ్లైట్‌ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్‌ అవుతుంది. బోర్డింగ్‌ ప్రోసెస్‌ అంతా 12.10 కల్లా కంప్లీట్‌ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చా. నేను చెక్‌ ఇన్‌ గెట్‌ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్‌ చేశా. మొత్తం ప్రొసెస్‌ అంతా త్వరగా కంప్లీట్‌ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్‌ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్‌ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్‌ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్‌కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్‌గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్‌తో నా కూతురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్‌ ప్రాసెస్‌కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్‌ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement