100 శాతం పోస్టులు గిరిజనులకే.. | ​Hundred Percent Village Volunteer Jobs For Tribals | Sakshi
Sakshi News home page

అక్కడ 100 శాతం పోస్టులు గిరిజనులకే..

Published Fri, Aug 9 2019 9:58 AM | Last Updated on Fri, Aug 9 2019 6:37 PM

​Hundred Percent Village Volunteer Jobs For Tribals - Sakshi

సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్‌ ఏరియాలో నివశిస్తున్న గిరిజనులకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు నూరు శాతం స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన 13 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఈ ఉద్యోగాలు ఏజెన్సీలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో నివశిస్తున్న స్థానికులకే ఇస్తామని తెలిపారు. నవరత్నాల ఆశయాల అమలుకు వీరు ప్రధానంగా పనిచేయాల్సి ఉంటుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement