ట్రాక్టర్ దొంగ అరెస్ట్.. రిమాండ్
Published Tue, Oct 1 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
కోదాడఅర్బన్, న్యూస్‌లైన్ : కోదాడ పట్టణ పరిధి శ్రీరంగాపురంలో ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన వీరబాబు అనే వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగాపురానికి చెందిన అంకతి ప్రసాద్ ట్రాక్టర్‌ను శనివారం రాత్రి వంకా వీరబాబు దొంగిలించాడు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీరబాబు ట్రాక్టర్‌ను హుజూర్‌నగర్‌కు తీసుకువెళుతుండగా బాలాజీనగర్ వద్ద ఐడీ పార్టీ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరబాబును కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఐడీ పార్టీ సిబ్బంది సుందరయ్య, నర్సయ్య, యుగంధర్, శ్రీను, నరసింహారావులను పట్టణ సీఐ మధుసూదన్ అభినందించారు.
Advertisement
Advertisement