ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో శనివారం ఓ ఇంటి నిర్మాణ పనుల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంటిపైన నిర్మాణ పనుల్లో ఉండగా విద్యుత్ తీగలు తాకి ఎరమల (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్ (22) అనే మరో వ్యక్తి విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతనిని స్ధానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.