కసింకోట: టీవీ ఆన్ చేద్దామని ప్రయత్నించిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా కసింకోటలో గురువారం రాత్రి జరిగింది. పట్టణంలోని పెదబజార్ వీధికి చెందిన దాసరి బంగారు శెట్టి(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే గురువారం రాత్రి ఇంటికి వచ్చిన బంగారు శెట్టి టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నించగా.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.