కర్నూలు(గోనెగండ్ల): జిల్లాలోని గోనేగండ్ల మండలంలో పది ఎకరాల్లో చెరకుపంట దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మండలంలోని హెచ్ కైరావలి గ్రామంలో షార్ట్ సర్కూట్ కారణంగా దాదాపు పది ఎకరాల్లో చెరకు పంట ధ్వంసం కావడంతో రైతులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.