కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు రంగం సిద్ధం
ప్యాకేజీల వారీగా ఒప్పందాలకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా తాగునీటి ప్రాజెక్టు మొదటి దశకు టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో.. వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మొబిలైజేన్ అడ్వాన్స్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక శాఖ ఇటీవలే రూ.200 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించనున్నట్లు సమాచారం. మొత్తం 10 ప్యాకేజీలకు గాను ఒక్కో కాంట్రాక్టర్‌కు ఒక్కో ప్యాకేజీ అప్పగించిన ప్రభుత్వం వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏర్పాట్లు చేసింది. ఒప్పందం కుదుర్చుకోగానే వారికి పని విలువలో ఐదు శాతం లెక్కన మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించనున్నట్లు సమాచారం. పురపాలక శాఖలోని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం లేదా గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలో తాగునీటి పథకాలు చేపడితే.. కాంట్రాక్టర్లకు ఎలాంటి మొబిలైజేషన్ (అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు, ఇతర పనుల నిమిత్తం) అడ్వాన్స్ ఇవ్వని విషయం తెలిసిందే. కానీ చిత్తూరు పథకానికి మాత్రం దాదాపు రూ.100కోట్ల వరకు అడ్వాన్స్‌లు చెల్లించనున్నట్టు సమాచారం.
ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారీగా నిధులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన మొదటి దశ పనులకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు అంచనా విలువ కంటే మూడు నుంచి ఐదు శాతం అధికంగా కోట్ చేసిన విషయం విదితమే. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేలా అసలు ప్రాజెక్టు అంచనా విలువలనే భారీగా పెంచి టెండర్లు పిలిచారన్న ఆరోపణలూ ఉన్నాయి. చిత్తూరు తాగునీటి పథకంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టుకు వెళ్లారు. అరుుతే, హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వనందున ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఇన్‌క్యాప్) నిర్ణరుుంచుకున్నట్టు తెలిసింది.
‘చిత్తూరు తాగునీటి’కి రూ.100 కోట్ల అడ్వాన్స్!
Published Tue, Feb 25 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement
Advertisement