ఎన్టీఆర్ గృహకల్పనే!
► జిల్లాకు 10500 గృహాలు మంజూరు
► నేటికీ విడుదల కాని మార్గదర్శకాలు
నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ పథకం కలగానే మారింది. నెల రోజల క్రితం 10500 గృహాలు మంజూరు చేసినట్లు ప్రజా ప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. నేటికీ వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అధికారులకు చేరలేదంటే ప్రభుత్వానికి ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది.
కోవూరు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో జిల్లాకు 10500 గృ హాలు మంజూరు చేయగా, నియోజకవర్గానికి 1250 గృహాలు కేటాయించారు. వాటి ఎంపిక తెలుగు తమ్ము ళ్ల చేతికి అప్పగించడంతో ఇష్టమొచ్చినట్లు వ్యహరించా రు.ఫలితంగా అర్హులైన నిరుపేదలకు జాబితాలో చోటు లేకుండాపోయింది. మేజర్ పంచాయతీల్లో కేవలం 10 నుంచి 20 ఇల్లు మాత్రమే మంజూరు చేశారు.
పట్టాలు సరే నిర్మాణాలేవీ?
గతంలో కోవూరు మండలం, గుమ్మళ్ళదిబ్బ ప్రాంతం లో ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు సేకరించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్న నిర్మాణంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాల్లో పిచ్చి మొక్కలు ఎదిగి చిన్నపాటి అడవిని తలపించే విధంగా మారిపోయింది. వీటిని పూర్తిస్థాయిలో చదును చేసి ప్రజలకు ఉపయోగంలోకి తెచ్చే రోజు ఎప్పుడు వస్తుందోనని నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంపై దృష్టి పెట్టి పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అంబేడ్కర్ జయంతికి హడావుడి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 14న భారీ ఎత్తున ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీనికి సం బంధించిన నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నామని అధికారులు వివరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి ఆ రోజున ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊదరగొడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జీవోల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా నూతన అంశాలను చేర్చాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తిస్థాయిలో పథకానికి శంఖుస్థాపన, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఆదేశాలు రాలేదు. వాటి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
8 వేల కుటుంబాలకు 17 ఇళ్లు:
కోవూరు మండలంలో మేజర్ పంచాయతీల్లో పడుగుపాడు పంచాయతీ ఒకటి. ఈ గ్రామ పంచాయతీలో 8 వేలకు పైగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కేవలం 17 ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. - వెంకటేశ్వర్లు, చిన్నపడుగుపాడు
జన్మభూమి కమిటీ ఆమోదంతోనే మంజూరు:
ఎన్టీఆర్ గృహ కల్ప పథకంలో ఇళ్ల మంజూరులో ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతోనే నిర్ణయించాం. మళ్లీ విడతలో అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం. - జగదీశ్వరి, డీఈ గృహనిర్మాణశాఖ