Janmabhoomi Committee
-
బొక్కేస్తున్నారు
► ప్రజాప్రతి ‘నిధులే’ మింగేస్తున్నారు! ► సర్పంచులు,ఎంపీటీసీ, జన్మభూమి కమిటీ సభ్యులు కూడా పింఛన్‌దారులే ► వికలాంగుల కోటానూ వదలని ‘మేత’లు ► నెలనెలా ఇళ్లకు వెళ్లి పింఛన్ ఇస్తున్న అధికారులు ఈ కింది చిత్రంలో కనిపిస్తున్నది కళ్యాణదుర్గంలోని ఎస్వీ గార్మెంట్స్. ప్రధాన రహదారిలో ఉన్న ఈ వస్త్ర దుకాణం యజమాని బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి. సింగిల్ విండో మాజీ డెరైక్టర్ కూడా. ఆయనకు అన్ని అవ యవాలు సక్రమంగా పనిచేస్తున్నా సర్కార్ ఇచ్చే పింఛన్ కోసం వికలాంగుడిగా మారిపోయూడు. కళ్లు మూసుకున్న అధికారులు కూడా ప్రతీ నెలా సదరు వస్త్ర దుకాణం యజమానికి రూ.1000 పింఛన్ (ఐడీ నంబర్ 112705206) చెల్లిస్తున్నారు. ఇలాంటి బొక్కుడు ప్రజాప్రతినిధులు ఇంకా చాలా మందే ఉన్నారు. అధికార పార్టీ అండ..అధికారుల వైఖరితో ప్రజాధనాన్ని అందినకాడికి దోచుకుంటున్నారు. బ్రహ్మసముద్రం : వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పంచ భక్ష పరమాన్నాలకు కొదవ ఉండదని సామెతను నిజం చేస్తున్నారు టీడీపీ నేతలు. నిరాశ్రయులు, వికలాంగులకు, అభాగ్యులకు అందజేసే పింఛన్ మొత్తాన్ని నెలనెలా ద ర్జాగా దక్కించుకుంటున్నారు. అనర్హులని తెలిసినప్పటికీ అధికారులు ప్రతినెలా ఒకటో తేదీన నేతల ఇళ్లవద్దకే వెళ్లి మరీ పింఛన్ అందజేస్తూ స్వామిభక్తి చాటుకుంటున్నారు. జన్మభూమి కమిటీల ఘనకార్యమే 2014 లో టీడీపీ అధికారం చేపట్టిన అనంతరం వృద్ధులకు పింఛన్ మొత్తం రూ.1000, వికలాంగత్వ శాతాన్ని బట్టి రూ.1500గా నిర్ధారించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అధికారులకు కాకుండా జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే లబ్ధిపొందుతున్నారు. దీంతో 2014 ఆగస్టు నుంచి మండలంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జన్మభూమి కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధుల భర్తలు పింఛన్‌దారులు అయ్యారు. బ్రహ్మసముద్రం మండలంలో 4,673 మంది వివిధ రకాల పింఛన్‌దారులున్నారు. వీరందరికీ ప్రతి నెలా రూ.50.28 లక్షలు పంపిణీ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులందరికీ ప్రభుత్వం నెలనెలా వేతనాలు అందజేస్తున్నా.. వారు మాత్రం పింఛన్లు పొందుతూ అభాగ్యుల పొట్ట కొడుతున్నారు. పింఛన్ పొందుతున్న నేతల్లో కొందరు.. ► భైరవానితిప్పకు చెందిన ఆంజనేయులు ఎంపీటీసీ సభ్యుడు. ఈయన సకలాంగుడైనప్పటికీ ఐడీ నంబర్ 112590047తో నెల నెలా వికలాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నాడు. ► పడమటి కొడిపల్లికి చెందిన సర్పంచ్ బంగీకొట్టూరప్ప ఐడీ నంబర్ 112238285తో వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. ► మాజీ సర్పంచ్, జన్మభూమి కమిటీ సభ్యుడు అయిన లింగాయత్ బసన్న ఐడీ నంబర్ 112682097తో నెలనెలా ఇంటివద్దే పింఛన్ పొందుతున్నాడు. ► పడమటి కొండపల్లి ఎంపీటీసీ సభ్యురాలైన తిమ్మక్క ఐడీ నంబర్ 112239 263తో పింఛన్ పొందుతున్నారు. వీరితోపాటు, అధికార పార్టీకి చెందిన మరో సర్పంచ్‌తోపాటు మరో 10 మంది మాజీ సర్పంచులు, మహిళా ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా నెలనెలా పింఛన్ పంపిణీ అవుతోంది. రెండేళ్లుగా ఇదేతంతు జరుగుతోంది. -
నీరు-చెట్టు పనులపై విజిలెన్స్‌కు ఫిర్యాదు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు: నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చేసిన పనులకే అంచనాలు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇరిగేషన్ ఏఈ కరిము ల్లా మండలంలో చేపడుతున్న నీరు-చెట్టు పనుల వివరాలను తెలియజేయగా, ఎమ్మెల్యే గతంలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనుల వివరాలు ఉన్నా యా? అని ప్రశ్నించారు. దీంతో ఏఈ నీళ్లు నమిలి తన వద్ద సరైన సమాచారం లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుంతలను చూపించి బిల్లులు చేసుకుంటున్నట్లు అందుతున్న ఫిర్యాదులను కలెక్టర్ దృ ష్టికి తీసుకువెళ్తామన్నారు. ఫారంఫాండ్‌స పనులను యంత్రాలతో చేపట్టి నిధులను స్వాహా చేయడంపై విజిలెన్స్‌కు ఆధారాలతో సహా నివే దిస్తామన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేయాలి జన్మభూమి కమిటీలతో సంబం ధం లేకుండా గ్రామసభలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే కాకాణి అధికారులకు సూచించారు.కొత్త నిబంధలన ప్రకారం గృహనిర్మాణశాఖ అధికారులు గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయా ల్సి ఉందన్నారు. నిబంధనలు పాటించకుంటే అధికారులు ఇబ్బందు లు పడాల్సి వస్తుందన్నారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, ఎంపీడీఓ సీహెచ్ శ్రీహరి, డి ప్యూటీ త హసీల్దార్ బీ మురళీ పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లకు పంట సంజీవని
► పథకం వూటున టీడీపీ అనుయాయుల అక్రమాలు ► కొన్ని చోట్ల యుంత్రాలతో పనులు ► ప్రభుత్వ, పొరంబోకు స్థలాల్లో జేసీబీలతో తవ్వకాలు చిన్న, సన్నకారు రైతుల మెట్ట పొలా ల్లో వర్షపు నీరు నిలబడేలా కుంటలు తవ్వి భూగర్భ జలాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ‘పంట సంజీవని’ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం కింద గుంటలను తవ్వి రైతుకు లబ్ధి చేకూర్చడంతోపాటు కూలీలకు పనిదినాలను కల్పించి వలసలను నివారించాలని ఆదేశించింది. దీన్ని శ్రీకాళహస్తికి చెందిన తెలుగు తమ్ముళ్లు తమకు అనుగుణంగా మార్చుకున్నారు. ప్రభుత్వ, పొరంబోకు స్థలాల్లో జేసీబీలతో కుంటలు తవ్వి బిల్లులు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనేఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి వుండలంలోని కోదండరావూపురంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సీనియుర్ మేట్, జన్మభూమి కమిటీ సభ్యుడైన వురో వ్యక్తి పేరిట తవు వ్యవసాయు పొలాల్లో పంట సంజీవని కుంటలు తవ్వినట్లుగా బిల్లులు వుంజూరయ్యూరుు. వారి పొలాల్లో ఎలాంటి కుంటలు లేవు. గ్రావు పొరంబోకు స్థలంలో 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కొతలతో రెండు కుంటలు తవ్వారు. ఈ పనులకు రూ.64,876 బిల్లులు తీసుకున్నారు. అదే గ్రావూనికి చెందిన వురో రైతు తన పొలంలో ఇదే కొలతలతో పంట సంజీవని కుంటను తవ్వాడు. రూ.32,438 బిల్లు వుంజూరు కాగానే తర్వాత పొలంలోని కుంట పూడ్చేశాడు. వీటిని స్థానికులు గుర్తించడంతో బయటకు వచ్చాయి. ఈ అక్రమాలకు కొలతలు తీసుకునే దగ్గర నుంచి గుంత పూర్తయ్యే వరకు టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ తదితర ఉపాధి అధికారులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వుండలంలోనే కాకుండా నియోజకవర్గంలో ఈ తరహా అక్రవూలు చాలా చోట్ల జరుగుతున్నాయునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా డ్వావూ అధికారులు విచారణ చేపడితే వురెన్ని అక్రవూలు వెలుగుచూసే అవకాశం ఉంది. నెరవేరని లక్ష్యం... శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలంలో 46 పంచాయుతీలు, తొట్టంబేడులో 27, ఏర్పేడులో 40, రేణిగుంటలో 19 పంచాయుతీలు ఉన్నారుు. పంట సంజీవని కుంటలు పంచాయుతీకి 100 చొప్పున నియోజకవర్గంలో 13,200 తవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తద్వారా వర్షాలు పడినప్పుడు నీరు అందులో చేరి భూగర్భ జలాలు పెరుగుతాయనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు అధికార గణాంకాల ప్రకారం పరిశీలిస్తే శ్రీకాళహస్తి వుండలంలో 380 గుంతలు, తొట్టంబేడులో 362, ఏర్పేడులో 371, రేణిగుంటలో 183 గుంతలు వూత్రమే తవ్వారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొన్ని చోట్ల అధికారపార్టీ నాయుకులు జేసీబీలు పెట్టి కుంటలు తవ్వారు. తర్వాత తవుకు అనుకూలమైన ఉపాధి కూలీలు పేర్లతో వుస్టర్లు రూపొందించుకుని బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట సంజీవని కుంటలపై సావూజిక తనిఖీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే అవకతవకలు బయుటపడతాయుని ప్రజలు అంటున్నారు. పంట సంజీవని కుంట తవ్వినా బిల్లు రాలేదు పథకం కింద వూ పొలంలో కుంటను తవ్వావుు. రెండు నెలలు గడుస్తున్నా బిల్లులు వుంజూరు కాలేదు. కొందరు టీడీపీ నాయకులు పొరంబోకు స్థలంలో తవ్విన కుంటలకు అధికారులు బిల్లులు చెల్లించారు. వాటికి ఏ ప్రాతిపదికో అర్థం కావడం లేదు. - మునిరత్నంరెడ్డి, కోదండరావూపురం అనువుతులతోనే తవ్వుకోవాలి పంట సంజీవని కుంటలను పంచాయుతీ ఆమోదంతో రైతుల పొలాల్లోనే కాకుండా ప్రభుత్వ స్థలాల్లో కూడా తవ్వుకునే వెసులుబాటు కల్పించాం. దీనికి పంచాయుతీ తీర్మానం తప్పనిసరి. ఎవరైనా పథకం కింద కుంటలను తవ్వుకుని పూడ్చివేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - వేణుగోపాల్‌రెడ్డి, డ్వావూ పీడీ, చిత్తూరు -
ఎన్టీఆర్ గృహకల్పనే!
► జిల్లాకు 10500 గృహాలు మంజూరు ► నేటికీ విడుదల కాని మార్గదర్శకాలు నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ పథకం కలగానే మారింది. నెల రోజల క్రితం 10500 గృహాలు మంజూరు చేసినట్లు ప్రజా ప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. నేటికీ వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అధికారులకు చేరలేదంటే ప్రభుత్వానికి ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది. కోవూరు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో జిల్లాకు 10500 గృ హాలు మంజూరు చేయగా, నియోజకవర్గానికి 1250 గృహాలు కేటాయించారు. వాటి ఎంపిక తెలుగు తమ్ము ళ్ల చేతికి అప్పగించడంతో ఇష్టమొచ్చినట్లు వ్యహరించా రు.ఫలితంగా అర్హులైన నిరుపేదలకు జాబితాలో చోటు లేకుండాపోయింది. మేజర్ పంచాయతీల్లో కేవలం 10 నుంచి 20 ఇల్లు మాత్రమే మంజూరు చేశారు. పట్టాలు సరే నిర్మాణాలేవీ? గతంలో కోవూరు మండలం, గుమ్మళ్ళదిబ్బ ప్రాంతం లో ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు సేకరించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్న నిర్మాణంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాల్లో పిచ్చి మొక్కలు ఎదిగి చిన్నపాటి అడవిని తలపించే విధంగా మారిపోయింది. వీటిని పూర్తిస్థాయిలో చదును చేసి ప్రజలకు ఉపయోగంలోకి తెచ్చే రోజు ఎప్పుడు వస్తుందోనని నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంపై దృష్టి పెట్టి పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంబేడ్కర్ జయంతికి హడావుడి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 14న భారీ ఎత్తున ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీనికి సం బంధించిన నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నామని అధికారులు వివరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి ఆ రోజున ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన చేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఊదరగొడుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జీవోల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా నూతన అంశాలను చేర్చాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. అంబేడ్కర్ జయంతి నాటికి పూర్తిస్థాయిలో పథకానికి శంఖుస్థాపన, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఆదేశాలు రాలేదు. వాటి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. 8 వేల కుటుంబాలకు 17 ఇళ్లు: కోవూరు మండలంలో మేజర్ పంచాయతీల్లో పడుగుపాడు పంచాయతీ ఒకటి. ఈ గ్రామ పంచాయతీలో 8 వేలకు పైగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కేవలం 17 ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. - వెంకటేశ్వర్లు, చిన్నపడుగుపాడు జన్మభూమి కమిటీ ఆమోదంతోనే మంజూరు: ఎన్టీఆర్ గృహ కల్ప పథకంలో ఇళ్ల మంజూరులో ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతోనే నిర్ణయించాం. మళ్లీ విడతలో అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం. - జగదీశ్వరి, డీఈ గృహనిర్మాణశాఖ -
అమాత్యా.. ఇదేమి చోద్యం..!
► ఓ వైపు గుంటూరు అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ పెద్దలు ► మరో వైపు పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి ప్రత్తిపాటి క్లాసు ► విస్తుపోతున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ► బృందావన్‌గార్డెన్స్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు ► ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో తమ్ముళ్ల వీరంగం ► కార్పొరేషన్లో ఖాళీలను పట్టించుకోని వైనం ► కృష్ణా పుష్కరాలకు పైసా విడుదల చేయని ప్రభుత్వం ► ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీలు సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు ‘ చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న’ నానుడిని జ్ఞప్తికి తెస్తున్నాయి...గుంటూరు నగరాభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా అడ్డుకుంటుండగా, ఆయన మాత్రం నగర కమిషనర్, ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి క్లాసు తీసుకోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. నగరంలో రోడ్లు విస్తరణ చేపట్టి అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఎంతో పేరు తెచ్చుకున్నారని మీరు సైతం రోడ్లు విస్తరణ పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే తమవాళ్లు ఎవరైనా అడ్డుకుంటే తనకు చెప్పాలంటూ మూడు రోజుల కిందట నగర కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి క్లాస్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి. నగరంలోని బృందావన్గార్డెన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులుగా విస్తరించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది అధికార పార్టీ పెద్దలకు సంబంధించిన గృహాలు, స్థలాలు రోడ్డు విస్తరణలో పోతాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, తమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా 60 అడుగులు మాత్రమే విస్తరణ చేపట్టాలని కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అదేవిధంగా జేకేసీ కళాశాల రోడ్డు నుంచి తక్కెళ్ళపాడు రోడ్డు విస్తరణలో పార్టీకి చెందిన ప్రముఖ బిల్డరుకు సంబంధించిన స్థలం కోల్పోతున్నారు. దీంతో కేవలం ఒకవైపు మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఒత్తిడి తీసుకువస్తూ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం ... అదే సమయంలో నగరాభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రజల పన్నులతోనే నగరంలో కమిషనర్ అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుంది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 540 కోట్లుకు సంబంధించి భూగర్భ డ్రైనేజీ పనులు సైతం ఆలస్యం అవుతున్నాయి. అలాగే నగరాభివృద్ధికి సంబంధించి అటు ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. అదేసమయంలో సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అవినీతికి అంతులేకుండా పోతుంది. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో తమ్ముళ్లు చేతివాటం చూపిస్తున్నారు. కమిషనర్‌కు తమ్ముళ్ల హెచ్చరికలు.. ఇదిలా ఉంటే నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల అంశం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పాటిస్తున్న కమిషనర్‌పై టీడీపీ పెద్దలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. అయితే తమ్ముళ్లు మాత్రం ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకొనేది లేదని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవసరమైతే తెనాలి పట్టణానికి వెళుతున్న నీటిని గుంటూరుకు మళ్లించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో ఆమె ఆశ్చర్యపోయారు. నగరపాలక సంస్థలో సిబ్బంది కొరత.. ఇక నగర పాలకసంస్థలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేరు. అదనపు కమిషనర్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సైతం పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రభుత్వం భర్తీ చేయకపోయినా మంత్రి పుల్లారావు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అధికారులు లేకపోవడంతో ప్రతి చిన్న పనిని కమిషనర్ స్వయంగా చూడాల్సి రావడంతో అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ నిధులతోనే పనులు... కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరంలో రోడ్లవిస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదు. కార్పొరేషన్ నిధులతోనే పనులు చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఇందులో సైతం తమ్ముళ్లు టెండర్లు దక్కించుకొని నాసిరకంగా పనులు చేస్తూ ఇంజినీరింగ్ అధికారులపై పెత్తనం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోని మంత్రి, ప్రజాప్రతినిధులు నగర ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, నగరాభివృద్ధికి అధికారులు కృషిచేయడం లేదన్న విధంగా మాట్లాడడంపై కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.