తెలుగు తమ్ముళ్లకు పంట సంజీవని
► పథకం వూటున టీడీపీ అనుయాయుల అక్రమాలు
► కొన్ని చోట్ల యుంత్రాలతో పనులు
► ప్రభుత్వ, పొరంబోకు స్థలాల్లో జేసీబీలతో తవ్వకాలు
చిన్న, సన్నకారు రైతుల మెట్ట పొలా ల్లో వర్షపు నీరు నిలబడేలా కుంటలు తవ్వి భూగర్భ జలాలను పెంచాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ‘పంట సంజీవని’ పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం కింద గుంటలను తవ్వి రైతుకు లబ్ధి చేకూర్చడంతోపాటు కూలీలకు పనిదినాలను కల్పించి వలసలను నివారించాలని ఆదేశించింది. దీన్ని శ్రీకాళహస్తికి చెందిన తెలుగు తమ్ముళ్లు తమకు అనుగుణంగా మార్చుకున్నారు. ప్రభుత్వ, పొరంబోకు స్థలాల్లో జేసీబీలతో కుంటలు తవ్వి బిల్లులు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనేఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి వుండలంలోని కోదండరావూపురంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సీనియుర్ మేట్, జన్మభూమి కమిటీ సభ్యుడైన వురో వ్యక్తి పేరిట తవు వ్యవసాయు పొలాల్లో పంట సంజీవని కుంటలు తవ్వినట్లుగా బిల్లులు వుంజూరయ్యూరుు. వారి పొలాల్లో ఎలాంటి కుంటలు లేవు. గ్రావు పొరంబోకు స్థలంలో 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు కొతలతో రెండు కుంటలు తవ్వారు. ఈ పనులకు రూ.64,876 బిల్లులు తీసుకున్నారు. అదే గ్రావూనికి చెందిన వురో రైతు తన పొలంలో ఇదే కొలతలతో పంట సంజీవని కుంటను తవ్వాడు. రూ.32,438 బిల్లు వుంజూరు కాగానే తర్వాత పొలంలోని కుంట పూడ్చేశాడు. వీటిని స్థానికులు గుర్తించడంతో బయటకు వచ్చాయి.
ఈ అక్రమాలకు కొలతలు తీసుకునే దగ్గర నుంచి గుంత పూర్తయ్యే వరకు టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ తదితర ఉపాధి అధికారులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వుండలంలోనే కాకుండా నియోజకవర్గంలో ఈ తరహా అక్రవూలు చాలా చోట్ల జరుగుతున్నాయునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా డ్వావూ అధికారులు విచారణ చేపడితే వురెన్ని అక్రవూలు వెలుగుచూసే అవకాశం ఉంది.
నెరవేరని లక్ష్యం...
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలంలో 46 పంచాయుతీలు, తొట్టంబేడులో 27, ఏర్పేడులో 40, రేణిగుంటలో 19 పంచాయుతీలు ఉన్నారుు. పంట సంజీవని కుంటలు పంచాయుతీకి 100 చొప్పున నియోజకవర్గంలో 13,200 తవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తద్వారా వర్షాలు పడినప్పుడు నీరు అందులో చేరి భూగర్భ జలాలు పెరుగుతాయనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు అధికార గణాంకాల ప్రకారం పరిశీలిస్తే శ్రీకాళహస్తి వుండలంలో 380 గుంతలు, తొట్టంబేడులో 362, ఏర్పేడులో 371, రేణిగుంటలో 183 గుంతలు వూత్రమే తవ్వారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొన్ని చోట్ల అధికారపార్టీ నాయుకులు జేసీబీలు పెట్టి కుంటలు తవ్వారు. తర్వాత తవుకు అనుకూలమైన ఉపాధి కూలీలు పేర్లతో వుస్టర్లు రూపొందించుకుని బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట సంజీవని కుంటలపై సావూజిక తనిఖీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే అవకతవకలు బయుటపడతాయుని ప్రజలు అంటున్నారు.
పంట సంజీవని కుంట తవ్వినా బిల్లు రాలేదు
పథకం కింద వూ పొలంలో కుంటను తవ్వావుు. రెండు నెలలు గడుస్తున్నా బిల్లులు వుంజూరు కాలేదు. కొందరు టీడీపీ నాయకులు పొరంబోకు స్థలంలో తవ్విన కుంటలకు అధికారులు బిల్లులు చెల్లించారు. వాటికి ఏ ప్రాతిపదికో అర్థం కావడం లేదు. - మునిరత్నంరెడ్డి, కోదండరావూపురం
అనువుతులతోనే తవ్వుకోవాలి
పంట సంజీవని కుంటలను పంచాయుతీ ఆమోదంతో రైతుల పొలాల్లోనే కాకుండా ప్రభుత్వ స్థలాల్లో కూడా తవ్వుకునే వెసులుబాటు కల్పించాం. దీనికి పంచాయుతీ తీర్మానం తప్పనిసరి. ఎవరైనా పథకం కింద కుంటలను తవ్వుకుని పూడ్చివేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- వేణుగోపాల్‌రెడ్డి, డ్వావూ పీడీ, చిత్తూరు